ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం

ABN, Publish Date - Dec 08 , 2024 | 12:47 AM

క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని, అందరూ క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు.

అంతర జిల్లా క్రీడాకారులతో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, నిర్వాహకులు

అంతర్‌ జిల్లా బాస్కెట్‌ బాల్‌ క్రీడా పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే పితాని

పెనుమంట్ర, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని, అందరూ క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. మార్టేరు ఎస్‌ వీజీ హైస్కూల్‌ క్రీడా ప్రాంగణంలో పదవ అంతర్‌ జిల్లా సీనియర్‌ చాంపియన్‌ పురుషులు, మహిళల బాస్కెట్‌ బాల్‌ పోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వ లన చేసి క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీక రించారు. పితాని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల్లో రాణించే టాప్‌ 20 మెంబర్స్‌కు ప్రతి నెల రూ.75 వేలు ఖాతాలో జమ చేస్తుందని, మార్టేరు బాస్కెట్‌ బాల్‌ పోటీలతోనే ఇది ప్రారం భంకావడం అభినందనీయమన్నారు. మార్టేరులో మల్టిపుల్‌ స్పోర్ట్స్‌ సెమీ కాంప్లెక్స్‌ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారులను దేశం లోనే అగ్రగామిగా చూడాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్‌ అథారిటీ ఆంధ్రప్రదేశ్‌ పైలెట్‌ ప్రాజెక్టుగా బాస్కెట్‌బాల్‌ను ఎంపిక చేయడం క్రీడాకారుల కు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు. బాస్కెట్‌ బాల్‌ క్రీడల పరిశీలకుడు చెంగల్వరాయుడు మాట్లాడుతూ అనంతపురంలో బాస్కెట్‌బాల్‌ జాతీయ జట్టు ఎంపిక చేస్తామని, 2026 జనవరి నాటికి మార్టేరులో సెమీ స్టేడియం ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. స్కూల్‌ గేమ్స్‌ సెక్రటరీ చక్రవర్తి మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తుందని, క్రీడాకారులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బాస్కెట్‌బాల్‌ యూత్‌ అధ్యక్షుడు చిర్ల బాలాజీ రెడ్డి, జాతీయ క్రీడాకారుడు సత్తి సుబ్బన్న రెడ్డి ఆచంట జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్‌ బాబు, కోనాల శ్రీనివా సరెడ్డి, తేతలి రాజారెడ్డి, వెలగల నగేష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అనంతరం ఫ్లడ్‌ లైట్ల వెలుగులో జరిగిన మొదటి మ్యాచ్‌లో కడప, పశ్చిమ గోదావరి జిల్లా మహిళ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోటీలను ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, స్థానికులు ఆసక్తిగా తిలకించారు.

Updated Date - Dec 08 , 2024 | 12:47 AM