ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బైక్‌, ఆటోలు సునాయాసంగా కొట్టేస్తారు

ABN, Publish Date - Nov 25 , 2024 | 11:59 PM

ద్విచక్ర వాహనాలు, ఆటోలను వారు సునాయాసంగా కొట్టేస్తారు. జిల్లాలో పలుచోట్ల కొట్టేసిన వాహనాలతో పోలీసులకు పట్టుబడ్డారు.

అదుపులో నిందితులు, స్వాధీనం చేసుకున్న వాహనాలు

ఇద్దరు దొంగలు అరెస్ట్‌

వాహనాలు స్వాధీనం

పాలకోడేరు, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనాలు, ఆటోలను వారు సునాయాసంగా కొట్టేస్తారు. జిల్లాలో పలుచోట్ల కొట్టేసిన వాహనాలతో పోలీసులకు పట్టుబడ్డారు. వాహనాల దొంగలను సోమవారం అరెస్ట్‌ చే సి రూ.7,19,000 విలువ చేసే మోటార్‌ బైక్‌లు, ఆటో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గొల్లలకోడేరు గ్రామానికి చెందిన ఈదా ప్రకాశ్‌, మోగల్లు గ్రామానికి చెందిన రెడ్డి శివ కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతు న్నారు. విస్సాకోడేరులో 2 మోటర్‌ బైక్‌లు మోగల్లులో 1, భీమవరం మండలం డేగాపురం లో ఆటో, హైదరాబాద్‌లో పల్సర్‌ బైక్‌ దొంగిలిం చి మోగల్లులోని ఒక పొదలో దాచిపెట్టారు. దొంగతనాలపై ఆయా పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. దొంగిలించిన మోటార్‌ బైక్‌లు, ఆటో స్వాధీనం చేసుకున్నామని తెలి పారు. భీమవరం రూరల్‌ సీఐ శ్రీనివాసరావు, ఎస్సై మంతెన రవివర్మ ఆధ్వర్యంలో అరెస్టు చేసినట్లు స్టేషన్‌ రైటర్‌ నాగరాజు తెలిపారు.

స్కూటర్‌ డిక్కీలో సొమ్ము కొట్టేశాడు

భీమడోలు, నవంబరు 25: ద్వారకాతిరుమల మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన నంద మూరి సత్యనారాయణ బ్యాంక్‌ ఖాతాలో రూ.2.5లక్షలు సోమవారం డ్రా చేశాడు. స్కూటీ డిక్కీలో ఉంచి భీమడోలులో స్కూటీ షాపు ముందు ఉంచి సరుకుల కొనుగోలుకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి డిక్కీలో సొమ్ము ఎవరో కొట్టే శారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Nov 25 , 2024 | 11:59 PM