ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫార్మసీ ప్రవేశం లేదు

ABN, Publish Date - Nov 27 , 2024 | 12:11 AM

ఏపీఈఏపీ సెట్‌ ఇంటర్మీడియట్‌ విద్యార్థుల భవిష్యత్‌ నిర్దేశించే ప్రవేశ పరీక్ష. విద్యార్థుల తల్లిదండ్రుల కల నెరవేర్చే మార్గం.

ప్రవేశ పరీక్ష రాసి ఐదు నెలలు

విద్యా సంవత్సరం ఆరంభమై మూడు నెలలు

కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఎప్పుడు?

విద్యార్థుల ఎదురుచూపు

తల్లిదండ్రుల ఆవేదన

ఏపీఈఏపీ సెట్‌ ఇంటర్మీడియట్‌ విద్యార్థుల భవిష్యత్‌ నిర్దేశించే ప్రవేశ పరీక్ష. విద్యార్థుల తల్లిదండ్రుల కల నెరవేర్చే మార్గం. ప్రవేశ పరీక్ష ముగిసి నాలుగు నెలలైనా విద్యార్థుల భవిష్యత్‌ ప్రశ్నార్ధకంగా మారింది. ఏపీఈఏపీ సెట్‌ రాసిన ఎంపీసీ విభాగం విద్యార్థులకు ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ముగిసి విద్యార్థులు కళాశాలల్లో చేరారు. వారికి తరగతులు ప్రారంభం కావడమే కాదు ఇంటర్నల్‌ పరీక్షలు రాస్తున్నారు. మొదటి సెమిస్టర్‌కు సన్నద్ధం అవుతున్నారు. బైపీసీ విభాగం విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపట్టలేదు. ఫార్మసీ ప్రవేశాల కోసం విద్యార్థులు మూడు నెలలుగా ఎదురు చూస్తున్నారు.

భీమవరం రూరల్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఏపీఈఏపీసెట్‌ ద్వారా బి ఫార్మశీలో చేరాలనుకునే విద్యార్థులు మూడు నెలలు గా వేచి చూస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్స ర ప్రవేశాలకు నోటిఫికేషన్‌ ఇప్పటికి విడుదల కాలేదు. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్య ర్‌ ఎడ్యుకేషన్‌ (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) ఉన్నత విద్య ప్రవేశాల ప్రక్రియ చేపడుతుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం దాదాపు అన్ని ఉన్నత విద్య ప్రవే శాల ప్రక్రియ పూర్తయింది. కానీ ఏపీఈఏపీసెట్‌ రాసిన ఇంటర్‌ బైపీపీ విభాగం విద్యార్థులను మాత్రం గాలికొదిలేసింది. ఈ విభాగం విద్యార్థులకు ఫార్మశీ గ్రాడ్యుయేషన్‌ ప్రవేశాలపై ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన లేదు. విద్యా సంవత్సరం ఆరంభమై మూడు నెలలు గడిచి పోయింది. మరికొన్ని విభాగాలకు తదుపరి విద్యా సంవత్సరం ప్రవేశ పరీక్షలకు (జేఈఈ మెయిన్స్‌) దరఖాస్తు ప్రక్రియ కూడా సాగుతోం ది. కానీ ప్రస్తుత విద్యా సంవత్సరం ఫార్మసీ ప్రవేశాల ప్రక్రియ మాత్రం పత్తా లేదు. బైపీపీ విభాగం విద్యార్థులకు ఏపీఎస్‌సీహెచ్‌ఈ ఇంత వరకు ఏవిధమైన ప్రవేశ ప్రక్రియ చేపట్టక పోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీఈఏపీ సెట్‌ ర్యాంక్‌తో అగ్రికల్చర్‌, హార్టీకల్చర్‌ ప్రవేశాలు పూర్తికాగా ఏపీఎస్‌సీహెచ్‌ఈ చేపట్టాల్సిన ప్రకియ ఎందుకు జాప్యం చేస్తోందని పలువురు ప్రశ్నిస్తున్నారు. బైపీసీ విభాగం విద్యార్థులకు ఫార్మసీతో పాటు కొన్ని యూనివర్సిటీల్లో బయోటెక్నాలజీ, ఫుడ్‌ టెక్నాలజీ కోర్సుల ప్రవేశాలు చేపట్టాల్సి ఉంది.

ప్రవేశ ప్రక్రియ ఎప్పుడు?

నవంబరు ముగుస్తున్నా ఫార్మసీ ప్రవేశాలు ఎప్పుడు అనేది తెలియడం లేదు. ఏపీఈఏపీసెట్‌ రాసిన ఎంపీసీ విభాగం వారికి ఇంజనీరింగ్‌ తరగతులు మొదలై నెలలు గడుస్తుంది. మరో పక్క అగ్రికల్చర్‌, వర్కింగ్‌ కోర్సుల తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. బిఫార్మసీ, కొన్ని సాంకేతిక కోర్సుల ప్రవేశాలు మాత్రం నిలిచిపో యాయి. దీనితో విద్యార్థులలో ఒత్తిడి నెలకొంది. బి.ఫార్మసీలో సీటు రాకపోతే మరే ఇతర కోర్సుల్లో చేరే అవకాశాలు కోల్పోయినట్లేని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో 12 కళాశాలలు

ఉమ్మడి గోదావరి జిల్లాలో ఏడాది నుంచి కొత్తగా వచ్చిన రెండు ఫార్మసీ కళాశాలతో కలిపి 12 ఫార్మసీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 1200 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2023–24 విద్యా సంవత్సరంలో 920 సీట్లే ఉండగా ఈ ఏడాది 180 సీట్లు పెరిగాయి. బి ఫార్మసీలో చేరాలనుకునే విద్యార్థులకు అదనంగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. కౌన్సెలింగ్‌ ఆలస్యం సీట్ల భర్తీపై ప్ర భావం ఉంటుందని కళాశాల యాజమాన్యా లు కూడా ఆందోళన చెందుతున్నాయి. బి.ఫార్మసీ కోర్సు ప్రాధాన్యత దృష్ట్యా కొన్నేళ్లుగా పూర్తిస్థాయి లో సీట్లు భర్తీ అవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి పై గందరగోళంతో కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ కోసం చూ స్తున్నారు. కొన్ని కళాశాలలకు విద్యార్థుల తల్లితండ్రులు ఫోన్‌చేసి కౌన్సెలింగ్‌ ఎప్పుడు అంటూ పదే పదే అడుగుతున్నారు.

ఎందుకీ జాప్యం..!

బి ఫార్మసీ విద్యార్థులకు విద్యా సంవత్సరం జాప్యం కావడం కరోనా విపత్తు సమయం నుంచి కొనసాగుతోంది. 2021లో కరోనా కారణం గా ప్రవేశాల్లో జాప్యం జరిగింది. తర్వాతి సం వత్సరం నుంచి కూడా ఏదో కారణంతో జాప్య మవుతోంది. గత ఏడాది నవంబర్‌లో కౌన్సెలింగ్‌ జరిగింది. ప్రస్తుతం ఫార్మసీ కౌన్సిల్‌ అనుమ తుల్లో ప్రతిష్టంభన కారణంగా జాతీయ స్థాయి లోనే జాప్యమైందని పలువురు చెబుతున్నారు. రెండు వారాల క్రితం ఫార్మసీ కౌన్సిల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినా ప్రభుత్వం కౌన్సెలింగ్‌ ప్రకటన ఇవ్వలేదు. ప్రవేశాల జాప్యంతో విద్యార్థులకు కోర్సు సెమిస్టర్‌ పరీక్షలు బాగా వెనుకగా సాగుతున్నాయి. విద్యా సంవత్సర విధానమే మారిపోయింది.

ఒకేసారి కౌన్సెలింగ్‌ చేపట్టాలి

బి ఫార్మసీ కౌల్సింగ్‌ తీవ్ర జాప్యమైంది. ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్‌ విడుదల చేసినా కౌన్సిలింగ్‌ ప్రక్రియకు 15 రోజులు పడుతుంది. డిసెంబర్‌ నెలాఖరుకు గానీ ప్రవేశాలు పూర్తి కావు. జనవరిలో తరగతులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఏపీఈఏపీ సెట్‌ రాసిన ఎం పీసీ, బైపీసీ రెండు విభాగాల విద్యార్ధులకు ఒకే సారి కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మూడు నెలలుగా ఎదురుచూస్తున్నా

ఫార్మసీ చదవాలనుకుంటున్నాను. మూడు నెలలు నుంచి కౌన్సెలింగ్‌ కోసం ఎదురు చూస్తున్నాను. కౌన్సిలింగ్‌ తేదీ కూడా ప్రకటించ లేదు. తల్లిదండ్రులు వేరే కోర్సులలో చేరాలని ఒత్తిడి తెస్తున్నారు. బి ఫార్మసీ చదివితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.

కె.సుజన, బైపీసీ విద్యార్థిని

తల్లిదండ్రులకు ఒత్తిడి

బిఫార్మసీలో ప్రవేశానికి విద్యార్థులు నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రోజూ ఎన్నో ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయి. ఇంకా ఎన్ని రోజులు పడుతుందని అడుగుతున్నారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపడితే వారిలో ఒత్తిడి తగ్గుతుంది.

– డి.రాఘవ, ప్రిన్సిపాల్‌, కేజీఆర్‌ఎల్‌ ఫార్మసీ కళాశాల

Updated Date - Nov 27 , 2024 | 12:11 AM