ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పడిలేచిన కెరటం

ABN, Publish Date - Nov 20 , 2024 | 12:43 AM

ప్రభుత్వ రంగానికి చెందిన భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ ఎల్‌) పడిలేచిన కెరటంలా మారింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఈ సంస్థ ఒకప్పుడు టెలికాం రంగంలో ఓ వెలుగు వెలిగింది. ల్యాండ్‌ నుంచి సెల్‌ ఫోన్‌ సిమ్స్‌ వరకు సిఫార్సులు ఉంటేగాని కనెక్షన్‌ వచ్చేది కాదు.

బీఎస్‌ఎన్‌ఎల్‌కు పూర్వ వైభవం

జిల్లాలో నెలకు కొత్తగా ఐదు వేల కనెక్షన్లు

టారిఫ్‌ పెంపుతో ప్రైవేటు కంపెనీలకు దెబ్బ

జనవరి నుంచి గ్రామాలకూ విస్తరించనున్న 4జీ సేవలు.. కొత్తగా 50 టవర్లు ఏర్పాటు

ప్రభుత్వ రంగానికి చెందిన భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ ఎల్‌) పడిలేచిన కెరటంలా మారింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఈ సంస్థ ఒకప్పుడు టెలికాం రంగంలో ఓ వెలుగు వెలిగింది. ల్యాండ్‌ నుంచి సెల్‌ ఫోన్‌ సిమ్స్‌ వరకు సిఫార్సులు ఉంటేగాని కనెక్షన్‌ వచ్చేది కాదు. అంత డిమాండ్‌ ఉన్న ఈ సంస్థ 15 ఏళ్ల నుంచి ప్రైవేట్‌ కంపెనీల పోటీల ను తట్టుకోలేక ఢీలా పడింది. ఇటు ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో వినియోగదారుల ఆదరణకు దూర మైంది. నాలుగు నెలల క్రితం ప్రైవేట్‌ కంపెనీలు ఒక్కసారిగా ప్లాన్‌ ఛార్జీలను భారీగా పెంచడంతో మళ్లీ బీఎస్‌ఎన్‌ఎల్‌కు పూర్వ వైభవం సంతరించుకుంది. చాలా మంది వినియోగదారులు ఆ సంస్థ సిమ్‌లను తీసుకునేందుకు పోటీ పడుతున్నారు.

నరసాపురం, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): గత నెలలో ట్రాయ్‌ విడుదల చేసిన టెలికం డేటాలో ప్రైవేట్‌ కంపెనీలకంటే బీఎస్‌ఎన్‌ఎల్‌కే వినియోగదారులు పెరిగారు. ప్రైవేట్‌ కంపెనీల నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు దాదాపు 44 లక్షల మంది మారారు. ఈ డేటా బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఊపిరిపోసింది. ఇటు జిల్లాలో కూడా మూడు నెలల నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులు పెరుగుతూ వచ్చారు. ఆ శాఖ అధికారుల లెక్క ల ప్రకారం ప్రతి నెల ఐదు వేల మంది కొత్త వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు మళ్లుతు న్నారు. కొత్తవారి సంఖ్య పెరుగుతూ పోతే సంస్థకు పూర్వ వైభవం వస్తుందన్న ఽధీమాను సంస్థ ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు.

పెరుగుతున్న నెట్‌వర్క్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ సేవలు జిల్లాలో విస్తరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 300 నెట్‌వర్క్‌ టవర్లు ఉన్నాయి. మరో 50 కొత్త టవర్లను సిద్ధం చేస్తున్నారు. ఇవి కాకుండా పైబర్‌ నెట్‌వర్క్‌ ఎక్సేంజ్‌లు 237 ఉన్నాయి. దీనికి సంబంధించి కస్టమర్ల సంఖ్య ఏడు వేల వరకు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా ఆ సంస్థకు 3.50 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. గడిచిన మూడు నెలల్లో 20 వేల వరకు కొత్త కస్టమర్లు చేరారు. గతంలో పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది కస్టమర్లు ఉన్నారు. అయితే గ్రామీణప్రాంత ప్రజలు ఈ సిమ్‌లవైపు మొగ్గు చూపుతున్నారు. దీనికనుగుణంగా బీఎస్‌ఎన్‌ ఎల్‌ నెట్‌వర్క్‌ సేవలను పెంచుతోంది. మేకిన్‌ ఇన్‌ ఇండియా పిలుపు మేరకు ఇండియన్‌ ఐటీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఆధునిక టెక్నాలజీని అందుబాటులో తీసుకొస్తోంది. వీటితోపాటు 4జీ నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. జనవరి నాటికి జిల్లాలోని అన్ని టవర్లలో 4జీ నెట్‌వర్క్‌ అందుబాటులో ఉండే విధంగా కసరత్తు చేస్తోంది.

తక్కువ ఛార్జీలే కారణం

ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌వైపు వినియోగదారులు మొగ్గు చూపటానికి తక్కువ టారీఫ్‌ ధరలే కారణం. మూడు నెలల క్రితం వరకు ప్రైవేట్‌ కంపెనీల టారీఫ్‌కు బీఎస్‌ఎన్‌ఎల్‌ ధరలకు పెద్దగా తేడా ఉండేది కాదు. జియో, ఎయిర్‌ టెల్‌, వొడాపోన్‌లు ఒక్కసారి గా ప్లాన్‌ ధరల్ని పెంచేశాయి. 28 రోజులకు రీచార్జీ చేయించు కోవా లంటే రూ.349 ఉండాల్సిన పరిస్థితి. అదే మూడు నెలలకు రూ.979 అవు తుంది. ఒక్క సారిగా ధరలు పెరగడంతో ఆ నెట్‌ను వినియోగిస్తున్న చాలామంది కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు యూటర్న్‌ తీసుకున్నారు. దీనికి కారణం నెలవారీ టారిఫ్‌ ధరలు తక్కువ గా ఉండటం. 35 రోజుల ప్లాన్‌కు రూ.107 మాత్రమే అవుతుంది. ఇందులో 200 నిమి షాలు ఉచిత వాయిస్‌ కాల్స్‌, 3 జీబీ డేటా వస్తుంది. అదే రూ.147 ప్లాన్‌ అయితే 30 రోజుల గడువులో 10 జీపీ డేటా, అన్‌ లిమిడెడ్‌ కాల్స్‌ వాడుకోవచ్చు. రూ.153 ప్లాన్‌ అయితే 26 జీబీ డేటాను 26 రోజులపాటు వినియోగించు కోవచ్చు. ఈ ప్లాన్‌లోను అన్‌ లిమిటెడ్‌ కాల్స్‌ ఉన్నాయి. ఈ కారణంగా కొంతమంది విని యోగదారులు పాత సిమ్‌లను పోర్టు పెట్టు కుని బీఎస్‌ ఎన్‌ఎల్‌లోకి మారిపోతున్నారు. ఇంట్లో నలుగురు ప్రైవేట్‌ కంపెనీల సిమ్‌లు వాడుతుంటే నెలకు రూ.1500 ఖర్చు. అదే బీఎస్‌ఎన్‌ఎల్‌ అయితే రూ.600లతో అయి పోతుంది. దీంతో కొందరు రెండు ప్రైవేట్‌ కంపెనీల సిమ్‌లు పెట్టుకుని మిగిలిన రెండిం టిని బీఎస్‌ఎన్‌ఎల్‌లోకి మార్చేస్తున్నారు.

నెల నెలా పెరుగుతున్నారు

మూడు నెలల నుంచి జిల్లాలో బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు కస్టమర్ల సంఖ్య పెరుగుతోంది. దీనికి కారణం ప్రభుత్వరంగ సంస్థ అవ్వడం, టారిఫ్‌ ధరలు ప్రైవేట్‌ కంపెనీలకంటే తక్కువగా ఉండటమే. ఇదే విధంగా కస్టమర్ల సంఖ్య పెరుగుతూ ఉంటే మళ్లీ సంస్థకు పూర్వ వైభవం రావడం తథ్యం. సంస్థ కూడా నెట్‌వర్క్‌ సేవలను విస్తరిస్తోంది. కొత్త టవర్ల ఏర్పాటుతోపాటు జిల్లావ్యాప్తంగా 4జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం.

– కమలాకర్‌, డీఈ, పాలకొల్లు

Updated Date - Nov 20 , 2024 | 12:45 AM