ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మాగంటికి బుజ్జగింపు

ABN, Publish Date - Mar 27 , 2024 | 12:59 AM

ఏలూరు పార్లమెంట్‌ స్థానంలో రాజకీయాలు చిత్రవిచిత్రంగా మారుతు న్నాయి. ఇంకోవైపు సీనియర్లను బుజ్జగించడానికి తంటాలు పడుతున్నారు.

అసంతృప్తి చల్లార్చే ప్రయత్నాలు.. ఇంకోవైపు గోపాల్‌ యాదవ్‌ జంప్‌

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

ఏలూరు పార్లమెంట్‌ స్థానంలో రాజకీయాలు చిత్రవిచిత్రంగా మారుతు న్నాయి. ఇంకోవైపు సీనియర్లను బుజ్జగించడానికి తంటాలు పడుతున్నారు. టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ మాగంటి బాబు తీవ్ర అసంతృప్తితో వున్నారు. పార్టీలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సీనియర్‌ అయిన తనను పెద్దగా పట్టించుకోవడం లేదని, ఆఖరుకు ఏలూరు లోక్‌సభ స్థానం అభ్యర్థిని ఖరారు చేసినా, మాట వరసకైనా తనను సంప్రదించలేదనే ఆవేదనతో ఆయన ఉన్నారు. గడచిన మూడు రోజులుగా మాగంటి పార్టీ కార్య క్రమాలకు దూరంగా ఉండడంతో ఆయన పార్టీ మారడం ఖాయమని జిల్లాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనికి తోడు మాగంటి బాబును ఆకర్షించేందుకు వీలైతే పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ నేతలు రాయబారానికి దిగారు. వాస్తవానికి గతంలో రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మాగంటి బాబు ఉన్నప్పుడు అప్పట్లో జరిగిన ఓ ఎన్నిక ఫలితం ప్రతికూలంగా రావడంతో ఆయనను అప్పటికప్పుడు మంత్రివర్గం నుంచి తప్పించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాబు టీడీపీలో చేరారు. ఎంపీగా పలుమార్లు పోటీ చేశారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన అనేక నియోజక వర్గాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. అలాంటి ఇమేజ్‌ ఉన్న సీనియర్‌ నేత పట్ల పార్టీ అవమానకరంగా ప్రవర్తించిందని, ఆయన సేవలు అక్కర్లేక పోతే తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉండవలసిందని ఇప్పుడు మాగంటి అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తొలుత ఏలూరు ఎంపీ స్థానాన్ని ఆయన కూడా ఆశించారు. క్రమక్రమంగా ఆయనను తప్పించి బీసీ నినాదం అందుకున్నారు. దీని ఫలితంగానే మహేష్‌ కుమార్‌ యాదవ్‌ను అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో మాగంటి బాబు ఆయన అనుచర వర్గం కొంత అసంతృప్తిలో మునిగిపోయారు. పార్టీ సీనియర్లు సైతం దూరంగా ఉండడం పార్టీలో అత్యున్నత బాధ్యతలో ఉన్నవారు తమకేం పట్టనట్టు వ్యవహరించిన కారణంగానే మాగంటి బాబు మనస్తాపానికి గురయ్యారనే సమాచారం బయటకు పొక్కింది. ఆ వెనువెంటనే వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. ఒకానొక దశలో ఎంపీ స్థానానికి బాబును ఎంపిక చేస్తారని ఇప్పటికే రంగంలో వున్న సునీల్‌ కుమార్‌ను తప్పిస్తారంటూ ప్రచారం జరిగింది.

బుజ్జగింపులు ఆరంభం

అసంతృప్తి, ఆవేశంలో వున్న సీనియర్‌ నేత మాగంటి బాబును తెలుగుదేశం బుజ్జగించే పనిలోపడింది. మాగంటి ప్రభావం పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలంగా ఉన్నందున, ఎట్టి పరిస్థితిలోనూ ఆయన తీవ్ర నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తపడుతోంది. పార్టీ సీనియర్లు ఇప్పటికే రంగంలోకి దిగారు. మాగంటి బాబును సముదాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన అనుకూలురు మాత్రం సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా బాబుపై ఒత్తిడి పెంచారు. ఏలూరు లోక్‌సభ స్థానంలో టీడీపీలో వున్న సీనియర్లు కూడా తాజా పరిణామాలపై దృష్టి పెట్టారు.

గోపాల్‌ యాదవ్‌ జంప్‌

ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ టిక్కెట్‌ ఆశించిన గోరు ముచ్చు గోపాల్‌ యాదవ్‌ మంగళవారం పార్టీ మార్చేసి వైసీపీలో చేరిపోయారు. తనకు టిక్కెట్‌ ఇవ్వకపోవడంతోపాటు అవమానకర రీతిలో ప్రవర్తించా రని, దీనికి విరుగుడుగానే వైసీపీలో చేరినట్టు గోపాల్‌ యాదవ్‌ ప్రకటించారు.

Updated Date - Mar 27 , 2024 | 12:59 AM

Advertising
Advertising