ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పంట కాల్వలకు మోక్షం

ABN, Publish Date - Nov 20 , 2024 | 12:49 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన పంట కాల్వలకు కూటమి ప్రభుత్వంలో మోక్షం లభిస్తోంది. పంట కాల్వలను ప్రక్షాళన చేసి శివారు ప్రాంతాలకు సాగు నీరందించాలన్న ఉద్దేశంతో సబ్‌ డివిజన్‌ పరిధిలోని మేజర్‌, మైన ర్‌ ఛానల్స్‌ పూడికతీత పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

రూ.5 కోట్లతో పూడికతీత పనులు

వేసవిలో పనులు ప్రారంభం

నరసాపురం రూరల్‌, నవంబరు 19(ఆంధ్ర జ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన పంట కాల్వలకు కూటమి ప్రభుత్వంలో మోక్షం లభిస్తోంది. పంట కాల్వలను ప్రక్షాళన చేసి శివారు ప్రాంతాలకు సాగు నీరందించాలన్న ఉద్దేశంతో సబ్‌ డివిజన్‌ పరిధిలోని మేజర్‌, మైన ర్‌ ఛానల్స్‌ పూడికతీత పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకు ప్రభు త్వం 34 మేజర్‌, మైనర్‌ పనులకు రూ.5 కోట్లు మంజూరుచేసింది. టెండర్ల ప్రక్రియ పూర్తవగానే ఈ వేసవిలో పనులు చేపట్టేందుకు ఇరిగేషన్‌ అధికారులు సిద్ధం అవుతున్నారు. గత ప్రభుత్వం పంట కాల్వల్లో కనీసం తట్ట మట్టి తీయలేదు. ఈ కారణంగా ప్రధాన పంట కాల్వలతోపాటు సబ్‌ ఛానల్స్‌ కాల్వలు పూర్తిగా పూడుకుపోయా యి. అనేకమార్లు రైతులు ఉద్యమాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ కారణంగా ఏటా సార్వా, దాళ్వా పంటల్లో రైతులు సాగు నీటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. కొంతమంది రైతులు సాగు చేయలేక స్వస్తి చెప్పారు.

కాల్వల ప్రక్షాళనకు మోక్షం..

ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా కూట మి ప్రభుత్వం రాగానే పంట కాల్వలను ప్రక్షాళన శ్రీకారం చుట్టింది. సబ్‌ డివిజన్‌లోని 34 మేజర్‌, మైనర్‌ పంట కాల్వల్లో పూడిక పనులు చేపట్టేం దుకు ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించింది. టెండర్ల ప్రక్రియ పూర్తి కాగానే వేసవిలో పనులు చేపట్టనుంది. పాలకొల్లు, చించినాడు, రాపాక, నరసాపురం, మొగల్తూరు, వేములదీవి, జున్నూ రు, లక్ష్మిపాలెం, దొంగరావిపాలెం, వడ్డిలంక ఛానల్స్‌లోని పూడుకుపోయిన మట్టిని తొలగి స్తారు. ఈ పనులు పూర్తయితే డివిజన్‌లో సాగు విస్తీర్ణ శాతం పెరగడంతోపాటు శివారు ప్రాంత వ్యవసాయ భూములకు సాగు నీరు అందుతుం ది. ఇటు పంట కాల్వల వెంబడి వున్న అక్రమ ణలను తొలగించేందుకు ఇరిగేషన్‌ అధికారులు సర్వే చేపట్టనున్నారు. డివిజన్‌ పరిధిలోని అన్ని కాల్వల వెంబడి సర్వే చేసేందుకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనున్నారు. సర్వేను జిల్లా ఉన్నతాధికా రులకు నివేదించిన తర్వాత గట్టుపై వున్న ఆక్రమణలను తొలగించనున్నారు. ‘వచ్చే ఏడాది వేసవిలో సబ్‌ డివిజన్‌ పరిధిలోని 34 పంట కాల్వలను పూడికతీత పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్దం చేశాం. వీటికి ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించింది. టెండర్ల ప్రక్రియ పూర్తికాగానే పనులు చేపడతాం. రబీ పంటకు సాగు నీటి ఇబ్బందులు తలెత్తకుండా కొన్ని ఛానల్స్‌లో తూడు, డెక్క పనుల్ని ప్రారంభించాం. ఇటు కాల్వ వెంబడి వున్న ఆక్రమణలను త్వరలో తొలగిస్తాం’ అని ఇరిగేషన్‌ డీఈ వెంకటరమణ తెలిపారు.

Updated Date - Nov 20 , 2024 | 12:49 AM