క్యాన్సర్ నివారణ సాధ్యమే
ABN, Publish Date - Nov 08 , 2024 | 12:15 AM
క్యాన్సర్ రహిత సమాజ స్థాపనలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ అన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ అవగాహన ర్యాలీ
ఏలూరు టూటౌన్, నవంబరు7 (ఆంధ్రజ్యోతి): క్యాన్సర్ రహిత సమాజ స్థాపనలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ అన్నారు. ఎంపీ క్యాంపు కార్యా లయం లో గురువారం క్యాన్సర్ నిర్దారణ వైద్య శిబిరం నిర్వహించారు. ఎంపీ మహేశ్ మాట్లాడుతూ క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే నివారణ సాధ్యమ న్నారు. క్యాన్సర్ గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్‌ల ద్వారా పేదలకు ఉచిత చికిత్స అందుతుందన్నారు. ప్రతీ నెల క్యాన్సర్ నిర్ధారణ ఉచిత వైద్య శిబిరాలు కొనసాగిస్తామన్నారు. విజయవాడ నుంచి వచ్చిన క్యాన్సర్ వైద్యనిపుణుల బృందం మహిళలకు రొమ్మక్యాన్సర్, గర్భాదయ ముఖద్వారా క్యాన్సర్ స్ర్కినింగ్ పరిక్షలు నిర్వహించారు. ఈ పరిక్షల్లో సుమారు 100మంది మహిళలు పాల్గొన్నారు.
ఆశ్రంలో..
ఆశ్రం ఆసుపత్రిలో శ్రేయస్సు పేరిట పూర్తి స్థాయి వైద్య సేవలందిస్తున్నామని సీఈవో డాక్టర్ హనుమంతరావు తెలిపారు. ఈ నెలలో క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. క్యాన్సర్ వ్యాధి నిశబ్దంగా ప్రభలుతుందని, ముం దుగా నిర్థారణ పరీక్షలతో గుర్తించవచ్చ న్నారు. వైద్యనిపుణులు డాక్టర్ శైలజ, డాక్టర్ సింధూ, డాక్టర్ కన్మని, సీవోవో రాజరాజన్, పాల్గొన్నారు.
పెదపాడు: ప్రతి ఒక్కరూ క్యాన్సర్‌ఫై అవ గాహన ఉండాలని పీహెచ్‌సీ డాక్టర్ అనంతపాల్ తెలిపారు. పీహెచ్‌సీ సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్‌ను నయం చేసే వైద్యం అందుబాటులో ఉందన్నారు.ప్రతి ఒక్కరూ ధైర్యంతో క్యాన్సర్‌ను జయించవచ్చునన్నారు. ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
లింగపాలెం: వైద్యుల సూచనలతో సరైన మందులు వాడితే క్యాన్సర్ నివారించవచ్చని డాక్టర్ కృష్ణకిశోర్ అన్నారు. కె.గోకవరం, లింగ పాలెం, ధర్మాజీగూడెం పీహెచ్‌సీల పరిధిలో సర్వే నిర్వహించారు. 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి ఒక్కరికి క్యాన్సర్‌కు సంబంధించిన పరీక్షలు నిర్వ హించారు. రొమ్ముక్యాన్సర్, నోటి క్యాన్సర్, గర్భాశ య క్యాన్సర్‌లతో పాటు షుగర్, రక్తపోటు పరీక్షలు నిర్యహించారు. గ్రామాలలో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. వైద్యులు సంద్యారాణి, యానీప్రీతి, ప్రియాంక, సిబ్బంది పాల్గొన్నారు.
నిడమర్రు: క్యాన్సర్‌పై అవగాహన కలిగి ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా జీవించాలని పెద నిండ్రకొలను పీహెచ్‌సీ డాక్టర్ పి.తేజశ్రీ అన్నారు. ప్రతి ఒక్కరికీ ఇంటి వద్దనే క్యాన్సర్ స్ర్కీనింగ్ పరీక్షలు చేస్తామన్నారు. అవగాహన ద్వారా నే కాన్సర్ బారిన పడకుండా నివారించవచ్చన్నారు. పి.కృపావరం, ఎస్.ప్రియదర్శిని, జె.మరియమ్మ, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
కొయ్యలగూడెం: క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని పీహెచ్‌సీ డాక్టర్ పి.సత్యనారాయణ అన్నారు. గ్రామంలో ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్ వ్యాధి ని ముందుగా గుర్తిస్తే నివారణ సులభం అన్నా రు. డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Nov 08 , 2024 | 12:15 AM