ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నచ్చినవారికి ఓటేయనివ్వరా..?

ABN, Publish Date - Apr 06 , 2024 | 02:28 AM

కొల్లేరు గ్రామాల కట్టుబాట్ల మధ్య ఒక పార్టీకే మద్దతు తెలపాలని కొంతమంది నాయకులు చేస్తున్న ప్రయత్నాలకు పోలీసులు సైతం పరోక్షంగా మద్దతు తెలపడం విమర్శలకు తావిస్తోంది.

శృంగవరప్పాడులో సమావేశం అడ్డుకుంటున్న పోలీసులు

తమకు నచ్చినవారికి వేస్తామన్న పలువురు.. వాగ్వాదం

శృంగవరప్పాడు గ్రామ సమావేశాన్ని అడ్డుకున్న పోలీసులు

కైకలూరు, ఏప్రిల్‌ 5: కొల్లేరు గ్రామాల కట్టుబాట్ల మధ్య ఒక పార్టీకే మద్దతు తెలపాలని కొంతమంది నాయకులు చేస్తున్న ప్రయత్నాలకు పోలీసులు సైతం పరోక్షంగా మద్దతు తెలపడం విమర్శలకు తావిస్తోంది. గురువారం రాత్రి కైకలూరు మండలం శృంగవరప్పాడులో గ్రామ సమావేశాన్ని నిర్వహించారు. గతంలో వైఎస్సార్‌ సంపూర్ణ గ్రామాలుగా ప్రకటించి ప్రజలు మద్దతు ఇచ్చారు. అయితే ఆశించిన మేర గ్రామ అభివృద్ధి జరగలేదని, సార్వత్రిక ఎన్నికల్లో స్వేచ్ఛగా తమకు నచ్చిన వారికి ఓటు వేసుకుంటామని సమావేశంలో పలువురు పేర్కొన్నారు. దీంతో సర్పంచ్‌ ఘంటసాల భాగ్యలక్ష్మి భర్త జగన్నాథం దానికి ఒప్పుకోమని వైఎస్సార్‌ సంపూర్ణ గ్రామాలుగానే ఉండాలని పట్టుబట్టారు. గ్రామ కట్టుబాట్ల మధ్య తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా ఒక వర్గం పట్టుబట్టి అధికార పక్షానికి పట్టం కట్టాలని ప్రయత్నించడాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకించా రు. సమావేశం జరుగుతున్న సమాచారం తెలుసుకున్న కైకలూరు రూరల్‌ పోలీసులు రంగప్రవేశం చేసి సమావేశాన్ని మధ్యలోనే నిలిపివేశారు. అనుమతు ల్లేకుండా సమావేశాలు నిర్వహించవద్దంటూ పోలీసులు అడ్డుకున్నా రు. దీంతో గ్రామస్థులు ఒక వర్గం చెప్పిన విధంగా ఓట్లు వేయాలనడం తగదని ఎన్నికల సమావేశం కాదని గ్రామ సమావేశం మాత్రమే నిర్వహిస్తున్నామని దీనిని పోలీ సులు అడ్డుకోవడం సబబు కాదని పదేపదే వారించారు. గ్రామాన్ని వైఎస్సార్‌ సంపూర్ణ గ్రామంగా తీసేసి ఎవరికి నచ్చిన విధంగా వారికి ఓటు వేసుకునే విధంగా ఉండాలన్నారు. పోలీసులు సమావేశం జరిగేందుకు ఒప్పు కోకపో వడంతో వైసీపీ నాయకులు ఉద్ధేశపూర్వకంగానే పోలీసులను పంపించా రని పోలీసులు సైతం అధికార పక్షానికి మొగ్గు చూపుతూ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దీంతో గ్రామస్థులు పోలీసులపై తోపులాటకు దిగారు. సమావేశం అర్ధంతరంగా ముగిసింది. తాము స్వేచ్ఛగా ఓటేసేలా ఎన్నికల కమిషన్‌ చర్యలు చూడాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.

Updated Date - Apr 06 , 2024 | 02:28 AM

Advertising
Advertising