ఎవరా.. కేటుగాళ్లు !
ABN, Publish Date - Oct 26 , 2024 | 12:54 AM
రైతులకు తెలియకుండా వారి భూములను లీజు పేరుతో ఓ జాతీయ బ్యాంకులో పెట్టి పెద్ద మొత్తంలో రుణం కొట్టేశారు. తీసుకున్న బాకీ సక్రమంగా చెల్లించకపోవడంతో రైతులకు నోటీసులు ఇచ్చారు. దీంతో ఈ మోసం వెలుగు లోకి వచ్చింది.
మొగల్తూరు రైతుల భూములు తాకట్టు పెట్టి బ్యాంకుకు టోకరా
రుణం కట్టకపోవడంతో రెండేళ్ల క్రితం వెలుగులోకి
సీబీసీఐడీ విచారణ.. నేటికి తేలని నిందితుల మిస్టరీ
నరసాపురం, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): రైతులకు తెలియకుండా వారి భూములను లీజు పేరుతో ఓ జాతీయ బ్యాంకులో పెట్టి పెద్ద మొత్తంలో రుణం కొట్టేశారు. తీసుకున్న బాకీ సక్రమంగా చెల్లించకపోవడంతో రైతులకు నోటీసులు ఇచ్చారు. దీంతో ఈ మోసం వెలుగు లోకి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో మొగ ల్తూరు మండలంలో వెలుగుచూసిన ఈ మో సం అప్పట్లో సంచలనం సృష్టించింది. రెండేళ్లు గడిచినా ఈ మోసానికి పాల్పడిన కేటుగాళ్లు ఎవరో అన్నది నేటికి తెలియలేదు. దర్యాప్తు ఏమైందో ? ఎంత వరకు వచ్చిందో ఎవరికి తెలి యదు. మొగల్తూరు, ముత్యాలపల్లి, పేరుపాలెం ప్రాంతాల్లోని 29 మంది రైతుల భూములను లీజుకు తీసుకుని సాగు చేస్తున్నట్లు చూపించి గణపవరం మండలంలోని ఓ జాతీయ బ్యాం కులో పెద్ద మొత్తం రుణం తీసుకున్నారు. 2022 సెప్టెంబరులో కుంభకోణం వెలుగుచూ సింది. రుణం తీసుకున్నట్లు రైతులకు నోటీ సులు అందాయి. లబోదిబోమని రైతులు అధికా రుల వద్దకు పరుగులు తీశారు. తాము ఎవరికీ లీజుకు ఇవ్వలేదని, తమవి చెరువులు కాదని, భూముల డాక్యుమెంట్లు తమ వద్దే ఉన్నాయని అధికారులకు చూపించారు. దీంతో అప్పటి ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించారు. విచారణ చేపట్టిన సీబీసీఐడీ ముందుగా రైతుల డాక్యు మెంట్లను పరిశీలించింది. లీజు అగ్రిమెంట్‌లో చూపించిన విధంగా అవి చెరువులు కాదు, వ్యవసాయ భూములని నిర్ధారించుకున్న సీబీ సీఐడీ ఆ తర్వాత దర్యాప్తు పురోగతిని రైతులకు తెలియజేయలేదు. ఈ కేసులో మిస్టరీ ఏమిటం టే రైతుల వద్ద వున్న డాక్యుమెంట్లు కేటుగాళ్ల వద్దకు ఎలా చేరాయన్నది మిస్టరీగా మారింది. రుణం తీసుకున్న మోసగాళ్లు ఎవరు ? వారు బ్యాంకుకు చెల్లించాల్సిన మొత్తం చెల్లించారా ? లేదా ? ఈ కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశా రా ? లేదా ? అనే విషయాలు కూడా ఇప్పటి వరకు బయటకు రాలేదు. అసలు ఈ కేసు దర్యాప్తు జరుగుతుందా ? ఫైల్ క్లోజ్ చేసేశారా ? అనే విషయం తెలియడం లేదని రైతులు చెబుతున్నారు.
Updated Date - Oct 26 , 2024 | 12:54 AM