ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

క్యూఆర్‌ కోడ్‌తో అక్రమార్కులను పట్టేస్తాం..

ABN, Publish Date - Mar 16 , 2024 | 12:42 AM

పదో తరగతి పరీ క్షలు ఈనెల 18నుంచి 30వ తేదీ వరకు జరగనున్న నేప థ్యంలో పరీక్షల్లో అక్రమాలు నిరోధించే చర్యల్లో భాగంగా ప్రతీ ప్రశ్నపత్రం పైనా క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించారని, ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు తలెత్తితే సంబంధిత పరీక్షా కేంద్రాన్ని ఇట్టే పసిగట్టేయడమేగాక బాధ్యులపై చట్టపర చర్యలు తీసుకోవడానికి వీలుంటుందని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ హెచ్చరించారు.

టెన్త్‌ పరీక్షల నిర్వహణపై కలెక్టర్‌ సమీక్ష

ఏలూరు ఎడ్యుకేషన్‌, మార్చి 15 : పదో తరగతి పరీ క్షలు ఈనెల 18నుంచి 30వ తేదీ వరకు జరగనున్న నేప థ్యంలో పరీక్షల్లో అక్రమాలు నిరోధించే చర్యల్లో భాగంగా ప్రతీ ప్రశ్నపత్రం పైనా క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించారని, ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు తలెత్తితే సంబంధిత పరీక్షా కేంద్రాన్ని ఇట్టే పసిగట్టేయడమేగాక బాధ్యులపై చట్టపర చర్యలు తీసుకోవడానికి వీలుంటుందని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ హెచ్చరించారు. ఎస్‌ఎస్‌సీ పరీక్షల నిర్వ హణ ఏర్పాట్లపై అన్ని శాఖల జిల్లా అధికారులతో కలెక్ట రేట్‌లో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లా డుతూ.. ‘పరీక్ష ప్రారంభ సమయం తర్వాత ఏ ఒక్క విద్యార్థిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోరు. జిల్లాలో పరీక్షలు జరిగే 139 కేంద్రాలను ముందుగానే తనిఖీ చేసి లోటుపాట్లు ఏవైనాఉంటే చక్కదిద్దండి. పరీక్ష కేంద్రాలను ‘నో సెల్‌ ఫోన్‌’ జోన్‌గా ప్రకటించాం. పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడితే మూడేళ్ల వరకు జైలుశిక్ష విధిస్తా రు. జిల్లాలో 32,355 మంది రెగ్యులర్‌, ప్రైవేటు విభాగాల్లో దరఖాస్తు చేసుకున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్‌ అమల్లో ఉం టుంది.’ అని సూచించారు. ఏఎస్పీ శేఖర్‌, డీఈవో అబ్ర హం, డీఎంహెచ్‌వో డాక్టర్‌ శర్మిష్ట, డీటీసీ శాంతకుమారి, ఎస్డీసీ ముక్కంటి, ట్రాన్స్‌కో ఎసీఈ సాల్మన్‌రాజు, ఆర్టీసీ ఆర్‌ఎం వరప్రసాదరావు, జడ్పీ సీఈవో నిర్మలజ్యోతి, తపాలా శాఖ, రిజర్వ్‌ పోలీసు విభాగం అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2024 | 12:42 AM

Advertising
Advertising