ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రక్షణ కల్పించండి

ABN, Publish Date - Dec 18 , 2024 | 12:44 AM

భీమడోలు మండలం చెట్టున్న పాడు దళిత కుటుంబాల్లో 18 మంది గ్రామ పెద్దల వల్ల ఆర్థిక, సామాజిక, మానసిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని దళితులు వాపోయారు.

కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహిస్తున్న చెట్టున్నపాడు దళిత కుటుంబాలు

గ్రామ పెద్దలతో ఇబ్బందులు

చెట్టున్నపాడు దళితుల ఆందోళన

కలెక్టరేట్‌ వద్ద ధర్నా

డీఎస్పీ కార్యాలయంలో వినతి

ఏలూరు రూరల్‌ / క్రైం, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): భీమడోలు మండలం చెట్టున్న పాడు దళిత కుటుంబాల్లో 18 మంది గ్రామ పెద్దల వల్ల ఆర్థిక, సామాజిక, మానసిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని దళితులు వాపోయారు. వారి నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ పలు దళిత కుటుంబాల వారు మంగళవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్వోను కలిసి వినతిపత్రం అందజేశారు.

గ్రామంలో 2013 నుంచి నేటి వరకు 18మంది గ్రామపెద్దలు తమ అభిప్రాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. అగ్రవర్ణాల వారు, ఆగ డాల లంక నుంచి వలసవచ్చిన వారితో చేపల చెరువు లీజు వ్యవహారాల్లో స్వార్ధపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రశాంతంగా జీవిస్తున్న దళితుల మధ్య చిచ్చుపెడుతున్నారని వాపోయారు. గ్రామంలో ఇరు వర్గాల దళితుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొందన్నారు. ఒక వర్గం దళితులు మరో వర్గం దళితుల్లో ముగ్గురి ని హత్యచేసే స్థాయికి తెచ్చారన్నారు. 18 మంది కుల పెద్దల నుంచి తమకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. మెజార్టీ కుటుంబాలను చెరు వుల వాటాల నుంచి తప్పించి ఆర్థిక ఇబ్బందు లకు గురి చేయటమే కాకుండా సాంఘిక కుల బహిష్కరణ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చేపలచెరువు లీజు, ఏడాదికి రూ.3కోట్లు వస్తుం టే కుల పెద్దలుగా చెప్పుకునే గ్రామపెద్దలు ఇతరులతో చేతులు కలిపి తమను మోసం చేస్తున్నారని న్యాయం చేయాలని కోరారు.

అక్కడి నుంచి ఏలూరు డీఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌కు వినతిపత్రం అందించా రు. ఇబ్బందులకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో చిగురు పాటి శ్రీనివాసరావు, యర్లపాటి ప్రకాశరావు, దండే సురేష్‌కుమార్‌, సిహెచ్‌ రత్నాకర్‌, దండే రాణి, జయమణి, దేవదాసి అనిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2024 | 12:44 AM