ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఒక్కటే దుకాణం!

ABN, Publish Date - Nov 08 , 2024 | 12:18 AM

పట్టణంలోని మహాత్మాగాంధీ రైతుబజార్‌లో ఒక్కటే కూరగాయల దుకాణం ఉంది.

రైతుబజార్‌లో ఖాళీగా దుకాణాల ప్లాట్‌ఫామ్స్‌

చింతలపూడి రైతుబజార్‌ నిర్వహణలో నిర్లక్ష్యం

చింతలపూడి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని మహాత్మాగాంధీ రైతుబజార్‌లో ఒక్క టే కూరగాయల దుకాణం ఉంది. వైసీపీ ప్రభు త్వంలో రైతుబజార్లను పట్టించుకున్న దాఖలాలు లేవు. 2016లో చింతలపూడి పాత బస్టాండ్‌ వద్ద మార్కెట్‌ కమిటీ సుమారు రూ.8 లక్షలతో రైతు బజార్‌ ఏర్పాటు చేశారు. కొంతకాలం 18 దుకా ణాలు నడిచాయి. ప్రభుత్వం మారిన తర్వాత రైతుబజార్‌లో ఒక్కొక్క దుకాణం ఎత్తివేశారు. ప్రస్తుతం ఒక్క దుకాణం మాత్రమే ఉంది. రైతు బజార్‌ ఆవరణలో పంచాయతీ చెత్తబండ్లు, వాటర్‌ ట్యాంకు, కారు పార్క్‌ చేస్తున్నారు. కూరగాయల దుకాణాల ప్లాట్‌ఫారాలన్నీ ఖాళీగా ఉన్నాయి. మార్కెట్‌ కమిటీ అధికారులు వీటి ఆలనాపాలనా పట్టించుకోవడంలేదు.

లక్షలు వెచ్చించి రైతుబజార్‌ ఏర్పాటు చేసినా నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం శాపంగా మా రింది. పంచాయతీ పట్టణ స్థాయికి పెరగడంతో రెండు మార్కెట్‌లు అవసరం. ఉన్న రైతు బజారులో అయినా మార్కెట్‌ కమిటీ అధికారులు దుకాణాల నిర్వహణకు చర్యలు చేపడితే పట్టణ ప్రజలు, రైతులకు ప్రయోజకరంగా ఉంటుంది.

అధికారులు నిర్లక్ష్యం వీడాలి : టి.బాబు

మునిసిపల్‌ అధికారులు, మార్కెట్‌ కమిటీ అధికారుల నిర్లక్ష్యం వలనే రైతుబజారు నిరుపయోగమైంది. రోడ్డుపక్కన దుకాణాల వలన ఆక్రమణలు పెరిగాయి. ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రైతులను ప్రోత్సహించి రైతుబజారులో దుకాణాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలి. మునిసిపల్‌ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.

Updated Date - Nov 08 , 2024 | 12:18 AM