పల్లెపండుగ పనులు పూర్తవ్వాలి
ABN, Publish Date - Nov 24 , 2024 | 12:02 AM
పల్లె పండుగలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తవ్వాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో డ్వామా, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షిం చారు.
భీమవరం టౌన్/రూరల్, నవంబరు 23(ఆంధ్రజ్యోతి):పల్లె పండుగలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తవ్వాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో డ్వామా, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షిం చారు. పాలకొల్లు, అత్తిలి మండలాల్లో రోడ్ల నిర్మాణ పనులను, తణుకు, యలమంచిలి మండలాల్లో క్యాటిల్ షెడ్స్ నిర్మాణ పనుల్లో పురోగతి పెంచాలని ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యం తదితర అంశాలపై జరిగిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అంగన్‌వాడీ సెంటర్లలో 150 మరుగుదొడ్ల నిర్మాణాలకు 20 మాత్రమే పూర్తి చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు మంచినీటిని టెస్టింగ్ ల్యాబ్‌కు పరీక్షలకు పంపించి, సక్రమంగా ఉన్నట్లు ధృవీకరణ అయిన తరువాత ప్రజలకు మంచినీటిని అందించాలన్నారు. వచ్చే నెల 7న జరగనున్న సాయుధ దళాల పతాక ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ నాగరాణి, జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారి కేవీఎస్ ప్రసాదరావు ఫ్లాగ్ డే స్టిక్కర్లు, కారు ప్లాగ్స్‌ను ఆవిష్కరించారు.
Updated Date - Nov 24 , 2024 | 12:04 AM