కొల్లేరు ముంపు పాపం ప్రభుత్వాలదే
ABN, Publish Date - Nov 16 , 2024 | 12:28 AM
కొల్లేరు ముంపు పాపం ప్రభుత్వాలదేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. కొల్లేరు పరిరక్షణలో భాగంగా శుక్రవారం పెను మాకలంక గ్రామాన్ని సందర్శించారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ
మండవల్లి, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): కొల్లేరు ముంపు పాపం ప్రభుత్వాలదేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. కొల్లేరు పరిరక్షణలో భాగంగా శుక్రవారం పెను మాకలంక గ్రామాన్ని సందర్శించారు. బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు ప్రవాహాలు కొల్లేరులో కలిసే ప్రాంతాన్ని బోటుపై నారాయణ పరిశీ లించారు. అనంతరం పెనుమాకలంక గ్రామ కూడలిలో గ్రామస్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కొల్లేరు లంక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నారా యణ మాట్లాడుతూ కొల్లేరు మాఫియా కబంధ హస్తాలలో కొట్టుమిట్టాడుతుందని ధ్వజమెత్తారు. వందల ఎకరాలలో నిబంధనలు విరుద్ధంగా అక్రమంగా చేపల చెరువులు తవ్వి, సహజ సిద్ధమైన కొల్లేరును నాశనం చేశారని మండి పడ్డారు. బుడమేరు ముఖ ద్వారం నుంచి ఉప్పు టేరు వరకు కాలువలు పూడుకుపోయి నీటి పారుదల సౌకర్యం లేక వరదలు వచ్చినప్పుడు లంక గ్రామాలు నీట మునిగి ప్రజల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన లంక గ్రామాలలో మెరుగైన రవాణా సౌకర్యాల కోసం రహ దారులు నిర్మించాలని డిమాండ్ చేశారు. కొల్లేరు సమస్యలు పరిష్కారం కాని పక్షంలో ఫిబ్రవరి 1నుంచి దీక్షలకు సిద్ధమని నారా యణ ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డేగా ప్రభాకర్, సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమి షన్ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, వరకా శ్యామల, సీపీఐ ఏలూరు కార్యదర్శి హేమశంకర్ పాల్గొన్నారు.
జగన్ రాజీనామా చేయాలి
ఏలూరు కార్పొరేషన్: జగన్ అసెంబ్లీకి రాకుండా ఉండడం ప్రజలను వ్యతిరేకించడమే నని, అసెంబ్లీకైనా రావాలి లేదా ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఏలూ రులో సీపీఐ భవనం వద్ద జరిగిన సభకు సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిఽథిగా హాజరైన నారాయణ మాట్లాడుతూ కొల్లేరు సరస్సును ఐదవ కాంటూరు వరకు కొనసాగించాల్సిందే నన్నారు. బుడమేరు ముఖ ద్వారం నుంచి ఉప్పు టేరు వరకు పూడిక పనులు చేసి ఆక్రమణలు తొలగించాలని డిమాండ్ చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ ప్రజా సమస్యలను ఎందుకు పరిష్కరించడంలేదంటూ ప్రశ్నించారు. 2006లో నే సుప్రీంకోర్టు కొల్లేరు పరిరక్షణకై తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. కొల్లేరు ప్రాంతాల్లోని ప్రజలు కొల్లేరులో చేపలు పట్టుకుని అమ్ముకోవాలంటే రోడ్డు మార్గం కూడాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Updated Date - Nov 16 , 2024 | 12:28 AM