కరెంటు బిల్లులు కట్టండి
ABN, Publish Date - Nov 17 , 2024 | 12:20 AM
జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, మునిసిపాల్టీలు, ఆసుపత్రుల విద్యుత్ బకాయి లు పేరుకుపోయాయి. గత ప్రభుత్వ హయాం లో ఐదేళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో రూ. 205.49 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు లెక్క తేల్చారు.
వివిధ శాఖల బకాయిలు రూ.205.49 కోట్లు
వసూలుకు విద్యుత్ శాఖ అధికారుల అవస్థలు
భీమవరం టౌన్, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, మునిసిపాల్టీలు, ఆసుపత్రుల విద్యుత్ బకాయి లు పేరుకుపోయాయి. గత ప్రభుత్వ హయాం లో ఐదేళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో రూ. 205.49 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు లెక్క తేల్చారు. విద్యుత్ శాఖ నోటీసులు ఇస్తున్నా స్పందన కరువవుతోంది. విద్యుత్ శాఖ సిబ్బంది పదేపదే అడుగుతున్నా ఫలితం కనిపించడంలేదు. అదే గృహ వినియోగదారుడు ఒక నెల బిల్లు కట్టకపోతే వెంటనే కరెంట్ సరఫరా నిలు పుదల చేస్తారు. గత ఎన్నికల ముందు పంచాయతీలకు సరఫరా నిలుపుదల చేశారు. పలు మార్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు విద్యుత్ కట్ చేశారు. ఇతర ప్రభుత్వ కార్యాలయాల విషయంలో ఏం చేయలేని పరిస్థితి. పంచాయతీరాజ్, రెవెన్యూ, మునిసిపాల్టీ, విద్య, గిరిజన సంక్షేమం, బీసీ సంక్షేమం, పశు సంవర్ధక, రైల్వే, వ్యవసాయ తదితర శాఖల నుంచి బకాయిలు వసూలు కావాల్సి వుంది. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేనే బకాయిలు వస్తాయని విద్యుత్ శాఖ అధికారులు భావిస్తున్నారు. కూటమి ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాఖల న్నీ ఊపిరి పీల్చుకున్నాయి. అభివృద్ధి కార్యక్రమా లకు నిధులు విడుదల అవుతున్నాయి. పలు పెండింగ్ బిల్లులు క్లియర్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యుత్ బిల్లులు కూడా మంజూ రవుతాయని భావిస్తున్నారు.
కార్యాలయాలు.. బకాయిలు (రూ. కోట్లలో)
పంచాయతీరాజ్ శాఖ 58.80
రెవెన్యూశాఖ 3.27
వైద్య ఆరోగ్య శాఖ 2.52
మునిసిపల్ శాఖ 2.83
నీటిపారుదల శాఖ 2.93
ఇన్ఫర్మేషన్ టెక్నాలజి 1.01
విద్యా శాఖ 1.60
గిరిజన, బీసీ సంక్షేమ శాఖ 0.92
పశు సంవర్ధక శాఖ 0.37
వ్యవసాయ శాఖ 0.63
మైనర్ పంచాయతీలు 112.63
ప్రభుత్వాసుపత్రులు 4.93
ఏపీఐఎస్‌డీసీ 6.92
ఇతర శాఖలు 16.56
ఎస్పీ ఆఫీసు 0.58
హోం శాఖ 0.38
Updated Date - Nov 17 , 2024 | 12:20 AM