ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రైతుల ఉరుకులు.. పరుగులు

ABN, Publish Date - Nov 13 , 2024 | 01:00 AM

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి రైతులను పరుగులు పెట్టించింది. పంట చేతి కొచ్చే సమయంలో వస్తున్న ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోతున్నారు.

కైకలూరు మండలం తామరకొల్లులో నేలకొరిగిన వరి

బంగాళాఖాతంలో అల్పపీడనం.. జిల్లా వ్యాప్తంగా వర్షాలు

మబ్బులు, చిరుజల్లులతో పంట కాపాడుకునే ప్రయత్నాలు

24 గంటల్లో భారీ వర్ష సూచన

వాతావరణ శాఖ హెచ్చరిక

మాసూళ్లు వాయిదా వేయాలని రైతులకు అధికారుల సలహా

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి రైతులను పరుగులు పెట్టించింది. పంట చేతి కొచ్చే సమయంలో వస్తున్న ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోతున్నారు. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక, జిల్లాలో మంగళవారం మబ్బుల వాతావరణం రైతులను కంగారు పెట్టింది. వర్షాల బారిన పడకుండా రైతులు పంట రక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మాసూళ్లు రెండు మూడు రోజులు వాయిదా వేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

ఏలూరుసిటీ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): సార్వా ఆరంభం నుంచి రైతులు ప్రతికూల వాతా వరణంతో నష్టపోయారు. నారుమడులు, నాట్లు సమయంలో భారీ వర్షాలకు రైతులు కొంత నష్ట పోయారు. ప్రస్తుతం పంట చేతి కొచ్చే సమయం లో మబ్బుల వాతావరణంతో రైతుల్లో గుబులు మొదలైంది. సార్వా సాగులో ఆశించిన దిగుబడు లు వస్తాయని భావిస్తున్న తరుణంలో వర్షాలు ముంచుతాయని రైతులు భయపడుతున్నారు. వర్షాల నుంచి ధాన్యం కాపాడుకోడానికి రైతులు బస్తాలు, బరకాలు సిద్ధంగా ఉంచుకోవాలని వ్యవసాయ శాఖాధికారులు సూచించారు. వరి కోతలు ఈ నెల 15 వరకు వాయిదా వేసుకోవా లని, ఆరబెట్టుకున్న ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాల్లో నిల్వ చేయాలని సూచించారు.

జిల్లాలో జోరుగా మాసూళ్లు

జిల్లాలో వరి మాసూళ్లు జోరుగా సాగుతున్నా యి. మబ్బులతో కూడిన వాతావరణంలో కళ్లాలపై ధాన్యం రక్షించుకోడానికి రైతులు పాట్లు పడుతు న్నారు. ప్రస్తుతం భీమడోలు, ఉంగుటూరు, దెందు లూరు, నిడమర్రు మండలాలతో పాటు ఏలూరు రూరల్‌ మండలంలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. రహదారులపై ఆరబెట్టుకుంటు న్న తరుణంలో వర్షాలు కురిస్తే పంట పూర్తిగా తడిసి పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రైతులు కోసిన వరిని కుప్పలుగా వేసి టార్పాలిన్‌లు కప్పుతున్నారు. కొంతమంది వ్యవసాయ శాఖాధికారుల సూచనలతో వరి మాసూళ్లను వాయిదా వేసుకున్నారు. కళ్లాల్లో ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. ఆరబెట్టిన ధాన్యాన్ని కూడా సంచులతో నింపి వాటిని కూడా సురక్షిత ప్రదేశాలకు తరలిస్తు న్నారు. జిల్లాలో వాతావరణ హెచ్చరికలతో రైతులు వరి కోత కార్యక్రమాలను కొన్ని రోజులు వాయిదా వేసుకుంటున్నారు.

నాలుగు వేల హెక్టార్లలో పూర్తి

జిల్లాలో ఇప్పటివరకు 4144.4 హెక్టార్లలో వరి మాసూళ్లు పూర్తయ్యాయి. ఫైన్‌ వెరైటీ 803 హెక్టా ర్లు, కామన్‌ వెరైటీ 3341.4 హెక్టార్లలో మాసూలు పూర్తయింది. వేలేరుపాడు, కుక్కునూరు, టి.నర సాపురం, ఏలూరురూరల్‌, ఆగిరిపల్లి మండలాల్లో మాసూళ్లు ఇంకా చేపట్టలేదు. ఉంగుటూరు మం డలం 1558 హెక్టార్లు, ద్వారకాతిరుమల మండ లంలో 817 హెక్టార్లు, చాట్రాయి మండలంలో 364 హెక్టార్లు, జంగారెడ్డిగూడెం మండలంలో 266 హెక్టార్లు, దెందులూరు మండలంలో 160 హెకా ర్లు, భీమడోలు మండలంలో 120 హెక్టార్లు, కొయ్య లగూడెం మండలంలో 263 హెక్టార్లు, పెదపాడు మండలంలో 118.4 హెక్టార్లలో వరి మాసూళ్లు పూర్తయ్యాయని జిల్లా వ్యవసాయ శాఖ నివేదిక లు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా మిగిలిన ప్రాంతాల్లో కూడా మాసూళ్లు ఊపందుకుంటున్న తరుణంలో భారీ వర్షాలు కురిస్తే వరి పంట పూర్తిగా దెబ్బతింటుందని రైతులు వాపోతున్నారు.

కైకలూరులో భారీ వర్షం

కైకలూరు, పెదపాడు, చాట్రాయి, చింతల పూడి: వాతావరణం రైతులతో దోబుచూలాడు తోంది. కైకలూరు మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం పడింది. తామరకొల్లు, వేమవరప్పాడు గ్రామాల్లో ముమ్మరంగా వరి కోతలు నిర్వహిస్తు న్నారు. ఆకస్మిక వర్షంతో పనలపై ఉన్న పంట తడిసిపోయింది, వందలాది ఎకరాల్లో పంట నేలకొరిగింది. రైతులు దిక్కుతోచక ఎక్కడి పనలు అక్కడే వదిలివేశారు పెదపాడు మండలంలో యంత్రాలతో వరి మాసూళ్లు ముమ్మరంగా సాగు తున్న వేళ రైతులు వర్షం నుంచి పంట కాపాడు కునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంటీయూ 1318 రకం వరి చేలు గింజ పాలుపోసుకుని గట్టిపడే దశలో ఉంది. మరో రెండు వారాల్లో ఈ రకం పంట కోతకొచ్చే అవకాశం ఉంది. ఎంటీయూ 7029 (స్వర్ణ) రకం ఎకరానికి 35–40 బస్తాలు, సంపద స్వర్ణ 33–35 బస్తాల దిగుబడులు వస్తాయని, దీనికి వాతావరణం కూడా అనుకూ లించాలని రైతులు చెబుతున్నారు. చాట్రాయి మండలంలో చిరుజల్లులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం పెద్ద మొత్తంలో కల్లాల పై ఉంది. వర్షాలు పడితే ధాన్యం తడిచి తీవ్రంగా నష్టపోతామని అన్నదాతలు వాపోతున్నారు. చింతలపూడిలో వరి చేలను పరిశీలించిన ఏవో మీనాకుమారి వరి కోతలు వాయిదా వేయాలని రైతులకు సూచించారు.

కోసిన పంటను రక్షిత ప్రదేశాల్లో నిల్వ చేయాలి

జిల్లాలో వరి మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు జరుగుతోంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం, వర్షాల హెచ్చరిక నేపథ్యంలో రైతులు వరి పంటను సురక్షిత ప్రదేశాల్లో నిల్వ చేసుకోవాలి. ఆరబెట్టుకున్న ధాన్యాన్ని బస్తాలలో నింపి వాటిపై బరకాలు, టార్పాలిన్‌ కప్పాలి. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున్న కొన్ని రోజులు వరి మాసూళ్లు వాయిదా వేసుకుంటే మంచిది. ఈ నెల 15 వరకు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వరి కోతలు నిలిపివేయాలి. కోసిన వరి పంటను కుప్పలుగా వేసి వాటిపై టార్పాలిన్‌లు కప్పాలి. కళ్లాల్లో ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాల్లో నిల్వ చేసుకోవాలి.

షేక్‌ హబీబ్‌ బాషా, జిల్లా వ్యవసాయ శాఖాధికారి

Updated Date - Nov 13 , 2024 | 01:00 AM