ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రహదారి మరమ్మతులు

ABN, Publish Date - Nov 09 , 2024 | 12:18 AM

సంక్రాంతి నాటికి పూర్తిస్థాయిలో రహదారి నిర్మా ణ పనులు, మరమ్మతు పనులను పూర్తి చేయడా నికి తగిన చర్యలు తీసుకున్నట్లుగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని తెలిపారు.

పెదపాడులో రోడ్డు పనులు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే చింతమనేని

సంక్రాంతికి పనులు పూర్తి : ఎమ్మెల్యే చింతమనేని

పెదపాడు, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి నాటికి పూర్తిస్థాయిలో రహదారి నిర్మా ణ పనులు, మరమ్మతు పనులను పూర్తి చేయడా నికి తగిన చర్యలు తీసుకున్నట్లుగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని తెలిపారు. పెదపాడు మం డలంలో కొత్తూరు, అందేఖాన్‌చెరువు, పెదపాడు, రామచంద్రపురం, తోటగూడెం, వసంతవాడ గ్రామాల్లో రహదారి పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. పల్లె పండుగ సహా ఇతర కార్యక్ర మాల ద్వారా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపం లేకుండా చూడాలని స్థానిక నాయకులకు సూచించారు.

ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత

పెదవేగి: ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో కేన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న కొల్లి వనజాక్షికి సీఎం సహాయనిధినుంచి వైద్య చికిత్సకు అవసరమైన రూ.1.25 లక్షల ఎల్‌వోసీ ఎమ్మెల్యే అందించారు. బొప్పన సుధాకర్‌, తాతా సత్యనారాయణ, మాగంటి నారాయణప్రసాద్‌, లావేటి శ్రీనివాసరావు, నంబూరి నాగరాజు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి : బడేటి

ఏలూరు టూటౌన్‌, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. బడేటి క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరి ష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశిం చారు. కూటమి ప్రభుత్వం ప్రజల అవసరాలు తీర్చడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. చోడే వెంకటరత్నం, పూజారి నిరంజన్‌, జీ.నారాయణ రావు, బొద్దాని శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

సమస్యలను తక్షణం పరిష్కరించాలి

ఉంగుటూరు, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): జనసేన జనవాణి కార్యక్రమంలో శుక్రవారం మంగళగిరి కార్యాలయంలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి అర్జీలు స్వీకరించారు. సంబంధిత అధి కారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకట లక్ష్మి, మండలి రాజేష్‌, పార్టీ లీగల్‌ సెల్‌ కార్యదర్శి బయ్యవరపు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్లను కలుసుకుని నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్ళ వ్యవహారం గురించి చర్చించారు.

సీఎం సహాయ నిధి చెక్‌ పంపిణీ

లింగపాలెం, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల పక్షపాతి అని ఎమ్మెల్యే రోషన్‌కుమార్‌ అన్నారు. మండలంలోని ఆసన్నడూడెం గ్రామానికి చెందిన ఏనుగు మేరీ అనారోగ్యంతో బాధపడుతోంది. వైద్య ఖర్చుల కోసం స్థానిక నాయకుల ద్వారా ఎమ్మెల్యే రోషన్‌ కుమార్‌ దృష్టికి తేవడంతో ఆయన సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా రూ.97,016 చెక్‌ను మేరీ కుటుంబ సభ్యులకు అందజేశారు.

Updated Date - Nov 09 , 2024 | 12:18 AM