ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైసీపీ ఇన్‌చార్జి కొట్టును మార్చకుంటే పార్టీకి రాం రాం

ABN, Publish Date - Dec 04 , 2024 | 12:29 AM

తాడేపల్లిగూడెం నియోజక వర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌ కొట్టు సత్యనారాయణను మార్చకపోతే తాము పార్టీకి రాజీనామా చేసేందుకు వెనుకాడబోమని ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు స్పష్టం చేశారు.

మాట్లాడుతున్న వైసీపీ నాయకులు

తాడేపల్లిగూడెం రూరల్‌, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి):తాడేపల్లిగూడెం నియోజక వర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌ కొట్టు సత్యనారాయణను మార్చకపోతే తాము పార్టీకి రాజీనామా చేసేందుకు వెనుకాడబోమని ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెంలోని ఓ హోటల్‌లో మంగళవారం సమావేశమ య్యారు. తాడేపల్లిగూడెం, పెంటపాడు జడ్పీటీసీలు ముత్యాల ఆంజనేయులు, ఉప్పులూరి వరలక్ష్మి, ఎంపీపీ పి.శేషులత, పట్టణ అధ్యక్షుడు గుండుబోగుల నాగు నాయకత్వం వహించారు. నాయకులు మాట్లాడుతూ పార్టీ అధికారంలో ఉన్నప్పు డు పార్టీ కోసం పనిచేసిన తమను వేధించారని, అయినా పార్టీ కోసం పనిచేశా మని చివరికి గుర్తింపు లేకుండా మాజీ మంత్రి వ్యవహరించారని ఆరోపించారు. తాడేపల్లిగూడెంలో నాయకత్వ మార్పు చేస్తే తాము పార్టీలో కొనసాగుతామని లేదంటే పార్టీని వీడటానికి వెనకాడమని హెచ్చరించారు. తాడేపల్లిగూడెం నియో జకవర్గంలోని ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, వార్డు ఇన్‌చార్జ్‌లు, ముఖ్య నాయకులు ధిక్కార స్వరం వినిపించారు.

Updated Date - Dec 04 , 2024 | 12:29 AM