ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వీడని విభజన కష్టాలు

ABN, Publish Date - Dec 01 , 2024 | 11:49 PM

పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా జిల్లాల పరిధిని విభజించారు. స్థానిక అవసరాలు, భౌగో ళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోలేదు. పాల న పరంగా ఇంకా సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. పేరుకే విభజన తప్పా కొత్తగా ఒరిం గేదేమీ లేదన్న భావన జనంలో బలంగా నాటుకు పోయింది. విభజనతో పశ్చిమకు అనేక నష్టాలు వాటిల్లాయి.

పాలనా సమస్యలు

నిధులు కేటాయింపులోనూ వ్యత్యాసం

నష్టపోతున్న పశ్చిమ

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా జిల్లాల పరిధిని విభజించారు. స్థానిక అవసరాలు, భౌగో ళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోలేదు. పాల న పరంగా ఇంకా సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. పేరుకే విభజన తప్పా కొత్తగా ఒరిం గేదేమీ లేదన్న భావన జనంలో బలంగా నాటుకు పోయింది. విభజనతో పశ్చిమకు అనేక నష్టాలు వాటిల్లాయి. ముఖ్యంగా ఖనిజ సంపదపై హక్కు లేకుండా పోయింది. ప్రధానంగా ఇసుక పెద్ద సమస్యగా మారిపోయింది. జిల్లాలో రీచ్‌లు లేవు. ర్యాంప్‌లు లేవు. గతంలో జిల్లా పరిధిలో నిడదవోలు, కొవ్వూరు ర్యాంప్‌లు ఉండేవి. ఇసుక అందుబాటులో ఉండేది. తాజాగా పర్యావరణ కారణాలతో జిల్లాలో ఇసుక ర్యాంప్‌లకు అను మతి లేకుండా పోయింది. దాంతో తూర్పు గోదా వరి జిల్లాపై ఆధారపడాల్సి వస్తోంది. అక్కడ అవసరాలకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ తర్వాతే జిల్లా అవసరాలకు ఇసుక సరఫరా చేసే పరిస్థితి నెలకొంది. అధిక ధరలు, దళారుల ప్రమే యంపైనా జిల్లా అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. చెప్పుకుంటే పోతే ఇటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి.

నిధుల విడుదలలోనూ వ్యత్యాసం

నిధుల మంజూరులోనూ వ్యత్యాసం కనిపిస్తో ంది. ప్రధానంగా జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో జిల్లా యూనిట్‌గా నిధులు కేటాయి స్తారు. మానవ వనరులతో చేపట్టే పనులను పరిగణలోకి తీసుకుని సిమెంట్‌, ఇసుక, చిప్స్‌, యంత్ర పరికరాలను ఉపయోగించి అభివృద్ధి చేసే పనులకు నిధులు కేటాయిస్తారు. మానవ వనరులను అంటే లేబర్‌ను ఉపయోగించి రూ. 100 కోట్లు పనిచేస్తే అందులో 40శాతం నిధు లను సీసీ రహదారులు, డ్రెయిన్‌లు ఇతర పను లకు నిధులు కేటాయిస్తారు. పశ్చిమగోదావరి ముఖ్యంగా డెల్టాతో ఏర్పడింది. విభజనలో పూర్తి గా మెట్ట ప్రాంతాన్ని కోల్పోయారు. మెట్టలోనే లేబర్‌ను ఉపయోగించి పనులు నిర్వహిస్తు ంటారు. గతంలో జిల్లా యూనిట్‌గా పూర్వ పశ్చిమ గోదావరి జిల్లాను లెక్కకట్టేవారు. దాని ఆధారంగానే రహదారులు, డ్రెయిన్‌లు, ఇతర అభివృద్ధి పనులకు 40శాతం నిధులు కేటాయిం చేవారు. ప్రతినియోజకవర్గానికి సమానంగా నిధులు ఇచ్చే పరిస్థితి ఉండేది. తాజాగా విభజన వల్ల జిల్లాలో లేబర్‌ను వినియోగించే పనులు తగ్గిపోయాయి. ఫలితంగా రహదారుల అభివృద్ధికి ఉపాధి నిధులను మంజూరు చేయడంలోనూ వ్యత్యాసం ఏర్పడింది. ఏలూరు జిల్లాలో ప్రతి నియోకజవర్గానికి దాదాపు రూ. 20 కోట్లు వంతు న మంజూరయ్యాయి. అదే పశ్చిమగోదావరి జిల్లాలో నియోజకవర్గానికి రూ. 7.00 కోట్లు వంతున కేటాయించారు. ఇదే విషయమై జిల్లాకు చెందిన ప్రజాప్రతినిఽధులు ఘొల్లుమంటున్నారు. కొన్ని రంగాలు ఇప్పటికీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోనే ఉన్నాయి. అందుకే నిధుల విషయంలోనూ ఉమ్మడి జిల్లా యూనిట్‌గా పరిగణించాలంటూ జిల్లా ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేస్తున్నారు.

జిల్లా ఆసుపత్రి ఎక్కడ ?

పూర్వ పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరులో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ వైద్యకళాశాల ఉన్నచోట జిల్లా ఆసుపత్రి ఉండకూడదు. దాంతో తణుకులో జిల్లా ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. అక్కడే అభివృద్ధి చేశారు. విభజన తర్వాత జిల్లా ఆసుపత్రిని అక్కడే అభివృద్ధి చేస్తూ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఆసుపత్రిగా తణుకు ఏరి యా ఆసుపత్రి చెలా మణీ అవుతోంది. నిర్ణ యాలు తీసుకుంటున్నారు. ఇదికూడా రెండు జిల్లాల సమస్యగా మారింది. జిల్లాల విభజన తర్వాత జిల్లా ఆసుపత్రి తణుకులో శాశ్వతంగా ఉంటుందా లేదా అనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఇలా జిల్లా ఆసుపత్రి విషయ ంలోనూ గత వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకో లేక పోయింది.

పాలనలో ఇబ్బందులు

జిల్లాల విభజనలో ఏడు నియోకజవర్గాలు పశ్చిమలో, ఏడు నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలో ఉన్నాయి. ఉంగుటూరు నియోకవర్గం ఏలూరులో ఉన్నాసరే అందులో ఒక మండలం అయిన గణపవరాన్ని భీమవరంలో విలీనం చేశారు. అక్కడ ఎమ్మెల్యే ఒకరైతే, అధికారులు వేరే జిల్లాకు చెందిన వారయ్యారు. స్థానిక ప్రజల సమ్మతితో వైసీపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ప్రకటించింది. రెవిన్యూ డివిజన్‌కు వచ్చేసరికి గణపవరం భీమవరంలో ఉంది. నియోజకవర్గ పరంగా ఉంగుటూరు పరిధిలోకి వెళ్లింది. ఇలా ఒకే మండలం రెండు జిల్లాల పాలనలో కొనసాగుతోంది. నిధుల కేటాయింపు, పాలనలోనూ ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

అభివృద్ధి ఏదీ..

జిల్లా విభజన తర్వాత పశ్చిమ పట్టణ కేంద్రీకృతంగా ఏర్పాటైంది. జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలు, నగరప ంచాయతీలున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే అన్ని రకాల నిధులు విడుదల అవుతున్నాయి. పట్టణాలకు మాత్రం ఇబ్బ ందులు తప్పడం లేదు. నిధుల విషయం లోనూ పట్టణాలపై భారం పడుతోంది. అమృత్‌ పథకంలో నిధులు కేటాయిం చినా సరే మునిసిపాలిటీలు తమ వంతు గా పన్నులతో సహా 30శాతం భరించాల్సి వస్తోంది. మరోవైపు ఏలూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలోనే జిల్లా అంతా విలీనం అయి ఉంది. అంటే ప్లాన్‌లు మం జూరు కావాలంటే ఏలూరు డెవలప్‌ మెంట్‌ అథారిటీపై అధారపడాల్సి వస్తోం ది. విభజన తర్వాత ఊడా అక్కడకే జిల్లా ప్రజలు అనుమతులకు వెళ్లే పరిస్థితి నెలకొంది.

ఏలూరుపైనే ఆధారం

ఇప్పటికీ జిల్లా కోసం అవసరమైన సా ధారణ ఖర్చులకు ఏలూరుపైనే ఆధారపడు తున్నారు. ఏలూరుకు బడ్జెట్‌ కేటాయిస్తు న్నారు. అక్కడ నుంచే జిల్లాలో పరిపాలన నిర్వహణకోసం నిధులు రాబట్టుకోవాల్సి వ స్తోంది. గతంలో జిల్లా కలెక్టర్‌ ఇదే విష యంపై ప్రభుత్వానికి ప్రతిపాదన పం పారు. నేరుగా నిధులు ఇవ్వాలని కోరారు. అయినా చర్యలు తీసుకోలేదు. ఇప్పటికీ జిల్లాలో అదే పరిస్థితి నెలకొంది. బదిలీల వ్వవహారంలో కొన్ని శాఖలకు ఇప్పటికీ అధికారాలు లేవు. విద్యాశాఖలో సిబ్బంది, ఉపాధ్యాయుల బదిలీ అంతా ఏలూరు విద్యాశాఖ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. పాలన మాత్రం జిల్లా విద్యాశాఖ నిర్వహి స్తోంది. నీటి పారుదల శాఖలోనూ అదే పరిస్థితి. డెల్టా ప్రాంతమంతా జిల్లా పరి ధిలో ఉంది. కానీ ఇక్కడ నుంచి ప్రతిపా దనలు నే రుగా ప్రభుత్వానికి పంపడానికి లేదు. ఏలూరు సర్కిల్‌ కార్యాలయానికి పంపాలి. కేవలం పరిమితమైన పాలనకే జిల్లాల విభజన ఉపయోగపడుతోంది. అంతే తప్పా బదిలీలు, నిధులు విషయ ంలో ఏలూరుపైనే ఇప్పటికీ ఆధారపడు తున్నారు.

Updated Date - Dec 01 , 2024 | 11:49 PM