ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నియోజకవర్గానికో డయాలసిస్‌ సెంటర్‌

ABN, Publish Date - Nov 03 , 2024 | 01:04 AM

సంక్షేమ పథకాలు చిట్టచివరి లబ్ధిదారుకు చేరే లక్ష్యంతో అందరూ పనిచేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్‌, రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ కోరారు.

చివరి లబ్ధిదారుకు సంక్షేమం అందాలి

అధికారులు బాధ్యతగా పనిచేయాలి

డీఆర్సీ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు వర్మ, గొట్టిపాటి, నిమ్మల

భీమవరం టౌన్‌, నవంబరు 2(ఆంధ్రజ్యోతి):సంక్షేమ పథకాలు చిట్టచివరి లబ్ధిదారుకు చేరే లక్ష్యంతో అందరూ పనిచేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్‌, రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ కోరారు. కలెక్టరేట్‌లో శనివారం ఆయన అధ్యక్షతన జరిగిన జిల్లా సమీక్ష కమిటీ (డీఆర్సీ) సమావేశం మాట్లాడుతూ సమస్యల పై ఎమ్మెల్యేల నుంచి వచ్చిన దరఖాస్తులను రికార్డు చేసి, వాటిని ఎంత వరకు పరిష్కరిం చామో ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. వ్యవసాయం, ఆక్వా కల్చర్‌ జిల్లాలో స్థిరీకరించే చర్యలను చేపట్టాలన్నారు. ప్రజలకు ఇసుక సౌకర్యవంతంగా అందేలా ప్రత్యేక దృష్టి సారిం చాలని సూచించారు. ఆక్వాతోపాటు గృహావస రాలకు చేస్తున్న విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందు లను పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు అమలు చేయని సంక్షేమ పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయన్నారు. ఈ పథకాలపై కొందరు అధికారులకు అవగా హన లేకపోవడం గమనార్హమన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి అధికారులు వారదులుగా పనిచే యాలన్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టరు నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ఒక డయాలసిస్‌ సెంట రు ఏర్పాటుకు సీఎస్‌ఆర్‌ నిధులు మంజూరు చేస్తానని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ హామీ ఇవ్వడం శుభపరిణామన్నారు. అధికారులు దీనిపై ప్రణాళిక రూపొందించి నివేదిక ఇవ్వా లని ఆదేశించారు.

ఇసుక సమస్యను పరిష్కరించాలి

భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనే యులు మాట్లాడుతూ భీమవరానికి డయాల సిస్‌ సెంటర్‌ ఏర్పాటుకు దాతలు సిద్ధంగా వున్నారని, అనుమతులు ఇవ్వాలని కోరారు. ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరా జు మాట్లాడుతూ డ్రెయిన్లు, కాల్వల పూడికతీత పనులను నీటి సంఘాలకు అప్పగించాలన్నారు. ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ ఉచిత ఇసుక సమస్యను పరిష్క రించాలన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలి శెట్టి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఎర్ర కాల్వ గట్లను తక్షణం పటిష్టం చేయాలని కోరారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకులో జిల్లా ఆసుపత్రిలో ఖాళీగా వున్న భవనంలో డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌ మాట్లాడుతూ సబ్‌ స్టేషన్‌ నిర్మించి, లో ఓల్టేజ్‌ సమస్య పరిష్కరించాలని కోరారు. తణుకులో డయాలసిస్‌ కేంద్రం ఏర్పా టుకు అవసరమైన మిషనరీని అందజేస్తామని ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాధ్‌ తెలిపారు. ఏపీఐ ఐసీ చైర్మన్‌ మంతెన రామరాజు, ఏపీఎస్‌సీ పీసీ చైర్మన్‌ పీతల సుజాత పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు.

ఇసుక ఆన్‌లైన్‌ బుకింగ్‌ విధానంలో కొంత సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని, వీటిని అధిగమిం చాలని అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. ఎన్‌ఆర్‌ జీఎస్‌ మెటీరియల్‌ కాంపోనెంట్‌ ఉమ్మడి జిల్లా ల పరిధిలో పంపకాలు జరిగాయని, ఇదే విధా నం కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు చెప్పారు. సమావేశంలో ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి, జేసీ టి.రాహు ల్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, కేఆర్సీ డిప్యూటీ కలెక్టరు బి.శివనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2024 | 01:04 AM