ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రహదారుల అభివృద్ధికి కూటమి ప్రాధాన్యం

ABN, Publish Date - Nov 03 , 2024 | 12:58 AM

రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని, రోడ్ల అభివృద్ధితో మెరుగైన జీవన విధానం కలగజేసే లక్ష్యంతో ముందుకెళు తున్నామని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి, పశ్చిమ గోదావరి జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికు మార్‌ అన్నారు.

అడవిపాలెం వద్ద పాలకొల్లు–దొడ్డిపట్ల రహదారి మరమ్మతు పనులను ప్రారంభించి పర్యవేక్షిస్తున్న మంత్రి నిమ్మల, మాజీ ఎమ్మెల్సీ అంగర

భీమవరం రూరల్‌, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని, రోడ్ల అభివృద్ధితో మెరుగైన జీవన విధానం కలగజేసే లక్ష్యంతో ముందుకెళు తున్నామని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి, పశ్చిమ గోదావరి జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికు మార్‌ అన్నారు. శనివారం స్థానిక చినఅమిరం కూడలిలో గుంతలు లేని రోడ్లు ఏర్పాటుకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించి ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో రాష్ట్రంలో ఏ రోడ్డు చూసినా పెద్దపెద్ద గోతులతో ప్రయాణానికి వీలు లేని విధంగా తయారయ్యా యన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోడ్లను అభివృద్ధి చేసేం దుకు లక్ష్యంగా నిర్ణయించి, రాష్ట్రవ్యాప్తంగా రహదారుల్లో గుంతలు లేకుండా సమాంతరంగా మరమ్మతులు చేపట్టేందుకు పనులను ప్రారంభిం చామన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ప్రజల పడుతున్న ఇబ్బందులను చూసి రాష్ట్రంలోని రోడ్లు గుంతలను పూడ్చే మరమ్మతు పనులకు రూ.826 కోట్లపైగా నిధులు చేశారన్నారు. జిల్లాలో రూ.1.69 కోట్ల వ్యయంతో ఏడు నియోజకవర్గాల్లోని 74 రోడ్ల మరమ్మతులకు శనివారం శ్రీకారం చుట్టామని, రానున్న వారం రోజుల్లో రూ.3.12 కోట్ల వ్యయంతో మరో 114 రోడ్లకు మరమ్మతులను సంక్రాంతి నాటికి పనులు పూర్తిచేసే లక్ష్యంతో చేపట్టామ న్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంతో ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని దీనికి ప్రజల మద్దతు అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి, ఏపీఐఐసీ చైర్మన్‌ మంతెన రామరాజు, ఎమ్మెల్యే పులపర్తి రామాం జనేయులు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఆర్డీవో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, జిల్లా రహదారులు భవనాల శాఖ అధికారి ఏ శ్రీనివాస్‌, డీఈఈ పీవీ రామరాజు, ఏఈ రాజశేఖర్‌, తహసీల్దార్‌ రావి రవికుమార్‌, కూటమి నాయకులు, అధికారులు, పాల్గొన్నారు.

గుంతలు రహిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతాం : మంత్రి నిమ్మల

యలమంచిలి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి) : రూ.800 కోట్లతో గుంతలు రహిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గుంతలు రహిత ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమంలో భాగంగా పాలకొల్లు–దొడ్డిపట్ల రహదారిలో రూ.30 లక్షల నిధులతో చేపడుతున్న మరమ్మతు పనుల కు అడవిపాలెం వద్ద ఆయన భూమి పూజ చేసి గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని శనివారం ప్రారం భించి మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో మ్యాప్‌ను చూసి కాకుండా గుంతల రోడ్లను చూసి రాష్ర్టాన్ని గుర్తించే స్థాయికి దిగజా ర్చిన ఘనుడు జగన్‌ అని విమర్శించారు. చంద్ర బాబు ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ, వాడవాడకు సీసీ రహదారులు వేసి అభివృద్ధి చేశారన్నారు. గ్రామాల నుంచి మండలాలకు, జిల్లాలకు అను సంధానం చేస్తూ రోడ్లను అభివృద్ధి చేశారన్నారు. వచ్చే సంక్రాంతిలోపు ప్రమాదంలేని రహదారు లుగా తీర్చిదిద్దుతామన్నారు. సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ నేతృత్వంలో ప్రధాని మోదీ సహకారంతో రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకువెళతామన్నారు. మాజీ ఎమ్మె ల్సీ అంగర రామ్మోహన్‌, మామిడిశెట్టి పెద్దిరాజు, చెరుకూరి అంజిబాబు, ఆరుమిల్లి చిన్ని, కడలి గోపి, చిలుకూరి బాలాజీ, రుద్రరాజు సత్య నారాయణ రాజు, తాళ్ల నాగరాజు, పెచ్చెట్టి బాబు పాల్గొన్నారు.

ప్రజలు అభివృద్ధికే ఓటు వేశారు

బటన్‌లు నొక్కే జగన్‌కు ఓటు వేయలేదు : మంత్రి పార్థసారఽథి

దెందులూరు, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చాలా తెలివి కలవారని వ్యక్తిగతంగా జగన్‌రెడ్డి ఎన్ని బటన్‌లు నొక్కినా.. ఓట్లు వేయలేదని అభివృద్ధి, సంక్షేమం రెండింటిని అందించకలిగి రాష్ట్రాన్ని మందుకు తీసువెళ్లకలిగిన చంద్రబాబును ప్రజలు ఎన్ను కున్నారనే విషయం ఇప్పుడైనా వైసీపీ తెలుసు కోవాలని రాష్ట్ర సమాచారశాఖ, గృహ నిర్మాణాశాఖ మంత్రి కొలుసు పార్థసారఽథి అన్నా రు. గోపన్నపాలెం పరిధిలో శనివారం రూ.13 లక్షలతో ఏలూరు– జంగారెడ్డిగూడెం రోడ్డు గుంతల పూడ్చివేత, రోడ్డు మరమ్మతు పనులను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు తట్టపట్టి రాళ్లు మోసి శంకుస్థాపన చేశారు. అనంతరం గోపన్నపాలెం గ్రామ పరిధిలో మండల టీడీపీ అధ్యక్షుడు మాగంటి నారాయణప్రసాద్‌ (మిల్లు బాబు) ఆధ్వర్యంలో జరిగిన గ్రామ సభలో మంత్రి మాట్లాడుతూ రోడ్లు సక్రమంగా లేకపోవడం, అవినీతి చేయడం వల్ల జగన్‌ను జనం పక్కన పెట్టారన్నారు. 2025 జనవరి నాటికి రూ.600 కోట్లతో రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లుగా చేసేందుకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమత్రి పవన్‌ కల్యాణ్‌ నిధులు అందిస్తు న్నారన్నారు. పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు. చింతమనేని మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని పెదవేగిలో అటవీశాఖకు చెందిన 1700 ఎకరాల భూమి ఎటు కాకుండా ఉందని, దీనిని పేద మహిళలకు అరెకరం చొప్పున జీడి మొక్కలు, కూరగాయలు పెంచుకు నేందుకు నామమాత్రపు లీజుతో ఇవ్వాలని మంత్రిని కోరారు. దెందులూరు నియోజక వర్గంలో రూ.22 కోట్లతో రోడ్ల మరమ్మతులు నాణ్యతతో చేయిస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రమ కిశోర్‌, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు మోతుకూరి నానిబాబు తదితర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2024 | 12:58 AM