ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పల్లెలు పరిశుభ్రంగా..

ABN, Publish Date - Nov 07 , 2024 | 12:55 AM

:పల్లెల్లో చెత్త సేకరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రోడ్ల పక్కన వున్న చెత్తను తొలగించడంతోపాటు.. చెత్త నుంచి సంపద ఇచ్చేందుకు గతంలో ఏర్పాటు చేసిన డంపింగ్‌ యార్డులను అందుబాటులో తీసుకురానుంది.

చెత్త నుంచి సంపద సృష్టించేలా..

జిల్లాలో 368 డంపింగ్‌ యార్డులు

తొలుత 72 గ్రామాలు.. ఆపై 296 గ్రామాల్లో చెత్త సేకరణ

గ్రీన్‌ అంబాసిడర్లు, వాహనాలపై దృష్టి

ప్లాస్టిక్‌ కవర్లు విక్రయాలపై నిఘా

భీమవరం రూరల్‌, నవంబరు 6(ఆంధ్ర జ్యోతి):పల్లెల్లో చెత్త సేకరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రోడ్ల పక్కన వున్న చెత్తను తొలగించడంతోపాటు.. చెత్త నుంచి సంపద ఇచ్చేందుకు గతంలో ఏర్పాటు చేసిన డంపింగ్‌ యార్డులను అందుబాటులో తీసుకురానుంది. జిల్లాలోని 368 డంపింగ్‌ యార్డులకు గాను తొలుత 72 యార్డుల్లో చెత్త సేకరణ చేపట్టాలని జిల్లా పంచాయతీరాజ్‌ అధికారులు నిర్ణయించా రు. ఈ మేరకు చెత్త సేకరణ పనులపై గ్రామా ల్లో కదలిక వచ్చింది. 72 గ్రామాల్లోని పొడి చెత్త, తడి చెత్తను సేకరించి డంపింగ్‌యార్డులకు తర లించి తడి చెత్తతో కంపోస్టు ఎరువును తయారు చేస్తారు. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభు త్వ హయాంలో చెత్త నుంచి సంపద చేపట్టేందు కు డంపింగ్‌ యార్డులు ఏర్పాటుచేసింది. ఒక్కొ క్కయార్డు నిర్మాణానికి రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలు వెచ్చించింది. చెత్త సేకరణకు బ్యాటరీ వాహనాలను తెచ్చింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వీటి నిర్వహణను నిర్వీర్యం చేసింది. ఫలితంగా చెత్తతో సంపద కేంద్రాలు కాస్తా చాలాచోట్ల చెత్త వేసుకునే ప్రదేశాలుగా, మరికొన్ని నిరుపయోగంగా మారాయి.

చెత్త సేకరణకు నిధులు

గ్రామాల్లో చెత్త సేకరణ, చెత్త నుం చి సంపద సృష్టించే పనులను ఆర్థిక సంఘం నిధులతో చేసుకోవచ్చు. కాని, వైసీపీ ప్రభుత్వం అర్ధంతరంగా నిలిపివేసి ఈ నిధులను పంచాయతీలలో వాడుకునే అవకా శం లేకుండా చేయడంతో పల్లెసీమలు కుదేలయ్యాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 15వ ఆర్థిక సంఘం నిధులు అందుబాటులోకి వచ్చాయి. చెత్త సేకరణ చేసే గ్రీన్‌ అంబాసిడర్‌కు సుమారు రూ.6 వేల వరకు ఇవ్వాలి. వీటిని ఆర్థిక సంఘం లేదా జనరల్‌ ఫండ్‌ నుంచి ఇవ్వవచ్చు.

కొత్త వాహనాలు కొనాలి

వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చెత్త సేకరణకు ఉపయోగించే వాహనాలపై చిన్నచూపు చూసిం ది. దీంతో గ్రామంలో బ్యాటరీ చెత్త సేకరణ వాహనాలు మూలన పడ్డా యి. పూర్తిగా తుప్పుపట్టాయి. లక్షలు వృథా అయ్యాయి. వాటిని రిపేరు చేయడానికి పనికిరావు. ఇప్పుడు చెత్త సేకరణకు వాహనాలు కొనాల్సిందే. కూటమి ప్రభుత్వం వీటిని తిరిగి అందుబాటులోకి తీసుకువస్తోంది. 393 గ్రామాల నుంచి రోజుకు నాలుగు టన్నుల చెత్త వస్తుందని అధికారుల అంచనా వేస్తున్నారు.

గ్రామాలలో ప్లాస్లిక్‌, పాల్‌థిన్‌ కవర్‌ వాడకంపైన యంత్రాంగం దృష్టి సారించింది. పల్లెల్లోని షాపులలో బ్యాన్‌ చేసిన ప్లాస్టిక్‌ను అమ్మరాదని నోటీసులు ఇవ్వనున్నారు. నిషేధిత ప్లాస్టిక్‌ పూర్తిస్ధాయిలో నివారించే చర్యలపైన అధికారులు ఉన్నారు.

Updated Date - Nov 07 , 2024 | 12:57 AM