ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చిన వెంకన్న అంతరాలయం స్వర్ణశోభితం

ABN, Publish Date - Dec 16 , 2024 | 12:32 AM

వేంకటేశ్వరస్వామి గర్భాలయం పసిడి కాంతులతో శోభిల్లుతోంది.

బంగారు కాంతులతో గర్భాలయం

దాతల సాయంతో అంతరాలయం, ముఖద్వారం స్వర్ణమయం

రూ.1.64 కోట్లు ఖర్చు చేసిన కృష్ణా జిల్లాకు చెందిన సంస్థ

265 గ్రాముల బంగారం, 148 కేజీల రాగి రేకులు అందించిన జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌

ద్వారకాతిరుమల, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): వేంకటేశ్వరస్వామి గర్భాలయం పసిడి కాంతులతో శోభిల్లుతోంది. ధగధగలాడుతూ దేదీప్యమానంగా వెలుగొందుతున్న బంగారు వాకిలి నుంచి చిన వెంకన్న దివ్య మంగళస్వరూపాన్ని వీక్షిస్తున్న భక్తులు తన్వయత్వం పొందుతున్నారు. గోవిందా.. గోవిందా.. అంటూ పరవశిస్తున్నారు. నిత్యం వేలాది భక్తులతో కళకళలాడే శ్రీవారి ఆలయం శని, ఆదివారాల్లో మరింత రద్దీగా ఉంటుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా దాతలు సైతం స్పందించి ఆలయ అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు. శ్రీవారికి బంగారు వాకిలి ఏర్పాటు చేసేందుకు పలువురు దాతలు ముందు కొచ్చారు. 2021లో జిల్లా రైస్‌మిల్లర్ల అసోసియేషన్‌ సుమారు 265 గ్రాముల బంగారం, 148 కేజీల రాగి రేకులతో ఆలయ ప్రధాన ముఖద్వారానికి, తలుపులు, అంతరాలయ ద్వారానికి బంగారు తాపడం చేయించారు. తరువాత అంతరాలయాన్ని స్వర్ణశోభితం చేయడానికి కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరుకు చెందిన దీపక్‌ నెక్స్‌జెన్‌ ఫీడ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ ఎండి అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం, డైరెక్టర్లు కలసి రూ.1.64 కోట్లు ఖర్చు చేశారు. శ్రీవారి గర్భగుడి బంగారు రేకులతో శిల్పకళ ఉట్టిపడేలా తయారుచేయించారు. బంగారు వాకిలిని ఆలయ చైర్మన్‌ రాజా ఎస్‌వి సుధాకరరావు, అనువంశిక ధర్మకర్త ఎస్‌వి నివృతరావు అక్టోబరు 4న ప్రారంభించారు. స్వర్ణశోభిత బంగారువాకిలి భక్తులకు కనువిందు చేస్తోంది. శ్రీవారి ఆలయ విమాన గోపురం కూడా స్వర్ణమయం చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - Dec 16 , 2024 | 12:32 AM