నరసింహుడే నడిపించాడు
ABN, Publish Date - Nov 02 , 2024 | 01:07 AM
‘నేను త్రికరణశుద్ధిగా నమ్మి ఆరాధించిన జగన్నాఽథ పురం లక్ష్మీ నరసింహుడే నన్ను విజయపథాన నడిపిం చాడు. ఇటువంటి మహత్తర పుణ్య క్షేత్రానికి తగినన్ని హంగులు కల్పించడమే కాదు పర్యాటకంగా తీర్చిదిద్దాల ని నిర్ణయించాన’ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్ ప్రకటించారు.
పధ్నాలుగేళ్లు సుదీర్ఘ పరీక్ష పెట్టారు
ఐఎస్ జగన్నాథపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
‘నేను త్రికరణశుద్ధిగా నమ్మి ఆరాధించిన జగన్నాఽథ పురం లక్ష్మీ నరసింహుడే నన్ను విజయపథాన నడిపిం చాడు. ఇటువంటి మహత్తర పుణ్య క్షేత్రానికి తగినన్ని హంగులు కల్పించడమే కాదు పర్యాటకంగా తీర్చిదిద్దాల ని నిర్ణయించాన’ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్ ప్రకటించారు. ఆ మేరకు ఆయన లక్ష్మీనరసింహుని కొండపై ప్రత్యేకంగా యాగం చేశారు. అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయ అభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలపై ఉన్నతాధికా రులతో కొంతసేపు ముఖాముఖి చర్చించారు. ద్వారకా తిరుమల మండలం ఐ.ఎస్.జగన్నాఽథపురానికి శుక్రవారం విచ్చేసిన ఆయన దీపం–2 గ్యాస్ సిలిండర్లను పంపిణీని ఆయన ప్రారంభించారు. తర్వాత జరిగిన సభలో ఆయన లక్ష్మీనరసింహస్వామికి తనకున్న అనుబంధాన్ని బయట పెట్టారు. ‘ఈ ఊరు మా గురువు గారిది. శక్తివంతమైన నేల. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని నేను పదేపదే ఇక్కడి లక్ష్మీనరసింహస్వామికి మొక్కాను. 2009లో తొలిసారి స్వామిని దర్శించి నాకు తగినంత శక్తినివ్వాలని కోరుకు న్నా. స్వామి అంత తేలిగ్గా కటాక్షించరు. పధ్నాలుగేళ్లు పరీక్ష పెట్టారు. చిమ్మచీకట్లో నేను ఎటు వెళ్తున్నానో తెలి యని పరిస్థితి. ఎక్కడా వెలుతురు లేదు. దీపం వెలిగిస్తే ఆ వెలుగే అత్యద్భుతం. అత్యంత బలమైనది. ఇక్కడా అదే జరిగింది. ఎన్‌డీఏను నిలబెట్టేటంత స్థాయికి స్వామి తీసుకెళ్లారు’ అంటూ తన జ్ఞాపకాలను ప్రజల ముందుం చారు. ఆలయ అభివృద్ధికి అధికారులతో మాట్లాడిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు. గుడి ప్రాకారం పనులకు మూడు నెలల సమయం పడుతుం దని కలెక్టర్ వెట్రి సెల్వి చెప్పినట్లు తెలిపారు. చిక్కుల్లో ఉన్న ఆలయ పరిధిలోని 50 ఎకరాల భూమిని మ్యూటే షన్ జరిపి ఎండోమెంట్‌కు అప్పగిస్తామన్నారు. సనాతన ధర్మ పరిరక్షణకు ఈ నేలే నన్ను ప్రేరేపించిందని పవన్ చెప్పారు. అంతకుముందు అధికారులతో ఈ ఆలయానికి సంబంధించి అభివృద్ధి, సంక్షేమంపై ఏవేమి చర్యలు తీసుకోవాలో పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీకృష్ణ తేజ, దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ కొమ్మి శివప్రతాప కిశోర్, జేసీ ధాత్రిరెడ్డిలతో సుదీర్ఘంగా సమావేశమయ్యానని చెప్పారు. ఇక్కడ ఉన్న కొండ భూమిని సమీపాన ఉన్న హైవే నిర్మాణానికి వినియోగిస్తున్నామని చెప్పి భారీగా తవ్వుకుపోతున్నారని, అసలు ఈ కొండ తవ్వకం ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, నిజంగానే హైవే నిర్మాణానికి చేస్తున్నారా నిగ్గు తేల్చాలని అధికారులను కోరారు. వారంలోగా నివేదిక సమర్పించాల్సిందిగా కలెక్టర్‌కు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దేవదాయ శాఖ పరిధిలోని ఆస్తుల రక్షణపై దృష్టి పెట్టాలని, అన్యాక్రాంతమైన భూమెంతనే వివరాలు తనకు తెలపాలని దేవదాయ శాఖ కమిషనర్‌కు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా గోతులున్న రోడ్లను పూడ్చి వేసేందుకు శనివారం నుంచి ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు మంత్రి పవన్ ప్రకటించారు. జగన్ ఖజానాను ఖాళీ చేస్తే చంద్ర బాబు, పవన్, మోదీ పట్టాలు తప్పిన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించినట్లు మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. దీపం–2 పథకం ఆరంభానికి ఉప ముఖ్యమంత్రి పవన్ ఇక్కడకు రావడం చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్యే మద్దిపాటి వెంక ట్రాజు అన్నారు.
అభిమానుల సందడి
పవన్‌ను చూసేందుకు అభిమానులు, జనసేన కార్య కర్తలు పోటీలు పడ్డారు. మండు టెండను లెక్క చేయకుండా భారీగా సభాస్థలికి తరలివచ్చారు. తమకు న్యాయం చేయాలని ప్లకార్డులు చూపిన జి.కొత్తపల్లికి చెందిన వారి వద్దకు మంత్రి పవన్ పీఏ స్వయంగా వెళ్లి ఆరా తీశారు. మూత్ర పిండాలు, లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న తమకు న్యాయం చేయాలని వారు కోరడంతో న్యాయం చేస్తానని సభావేదిక మీద పవన్ ప్రకటించారు. మంత్రి కొలుసు పార్ధసారధి, జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీప్రసాద్, ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు, చిర్రి బాలరాజు, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 02 , 2024 | 01:07 AM