ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రైతులకు సత్వర సేవలందించాలి

ABN, Publish Date - Jun 11 , 2024 | 12:10 AM

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైందని, వ్యవసాయ సహాయకులు రైతులకు అందుబాటులో ఉండి సత్వర సేవలందించాలని జిల్లా వ్యవసాయాధికారి షేక్‌ హబీబ్‌ బాషా సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయాధికారి బాషా

సిబ్బందితో జిల్లా వ్యవసాయాధికారి బాషా సమావేశం

బుట్టాయగూడెం, జూన్‌ 10: ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైందని, వ్యవసాయ సహాయకులు రైతులకు అందుబాటులో ఉండి సత్వర సేవలందించాలని జిల్లా వ్యవసాయాధికారి షేక్‌ హబీబ్‌ బాషా సూచించారు. బుట్టాయగూడెం రైతు భరోసా కేంద్రంలో సోమవారం వ్యవసాయ సహాయకులతో జరిగిన సమావే శంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయశాఖ ఆధ్వరర్యంలో రైతులకు సబ్సిడీపై ఇస్తున్న విత్తనాలు సకాలంలో అందేలా చూడాలన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 90 శాతం సబ్సిడీపై రైతులకు విత్తనాలను అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 11 వేల టన్నుల విత్తనాలను రైతులకు ఇచ్చినట్లు తెలిపారు. 6 టన్నులు జీలుగు, రెండున్నర టన్నులు జనుము, రెండున్నర టన్నులు పిల్లిపెసర విత్తనాలు ఉన్నాయన్నారు. డెల్టా, మెట్ట ప్రాంత రైతులకు 50 శాతం సబ్సిడీపై విత్తనాలు ఇస్తుండగా ఏజెన్సీ ప్రాంత రైతులకు 90 శాతం సబ్సిడీపై విత్తనాలను అందజేస్తు న్నామన్నారు. జిల్లాలో 18 వేల టన్నుల వరి విత్తనాలు లక్ష్యం కాగా 22 వేల టన్నుల వరకు ఇచ్చామన్నారు. జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో వరిసాగు అవుతుండగా 60 నుంచి 70 వేల ఎకరాలకు విత్తనాలు ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏడీ బుజ్జిబాబు, ఏవో ముత్యాలరావు వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.

Read more!

Updated Date - Jun 11 , 2024 | 12:10 AM

Advertising
Advertising