ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కలెక్టరేట్‌లో ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్‌

ABN, Publish Date - Nov 09 , 2024 | 12:01 AM

లెక్టరేట్‌ రెవెన్యూ విభాగంలో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు పడగా, మరో ఇద్దరు ఉద్యోగులను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి ఉత్త ర్వులు జారీచేశారు.

మరో ఇద్దరిపై బదిలీ వేటు

భీమవరం టౌన్‌, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్‌ రెవెన్యూ విభాగంలో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు పడగా, మరో ఇద్దరు ఉద్యోగులను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి ఉత్త ర్వులు జారీచేశారు. రెవెన్యూ విభాగంలోని కొంతమంది ఉద్యోగులపై వివిధ రకాల ఆరోపణలు వెల్లువెత్తడంతో వాస్తవాలను పరిశీలించేందుకు కలెక్టరేట్‌లోని పలు విభాగాలను కలెక్టర్‌ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. రికార్డులు సరిగా నిర్వహించకపోవడం, నిర్ణీత గడువులోగా ఫైల్స్‌ క్లియర్‌ చేయకపోవడం, సక్రమంగా విధులు నిర్వహించకపో వడం, గ్రీవెన్స్‌ పట్ల నిర్లక్ష్యం వహించడం, తదితర కారణాలతో మెజిస్టీరియల్‌ సెక్షన్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ ఎస్‌.కె.షకీల్‌, కో ఆర్డినేషన్‌ సెక్షన్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ కె.జీవన్‌కుమార్‌, ఎస్టాబ్లిష్మెంట్‌ సెక్షన్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ యు.దివ్య స్మైలీలను సస్పెండ్‌ చేశారు. కో ఆర్డినేషన్‌ సెక్షన్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ ఐవీబీపీ తేజను ఆచంట తహసీల్దార్‌ కార్యాలయానికి, మెజిస్టీరియల్‌ సెక్షన్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ యు.వెంకట్‌కుమార్‌ను పెనుగొండ తహసీల్దార్‌ కార్యాలయానికి బదిలీ చేస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Nov 09 , 2024 | 12:01 AM