ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నన్ను ఎందుకు సస్పెండ్‌ చేశారు ?

ABN, Publish Date - Sep 20 , 2024 | 12:27 AM

వైసీపీ నుంచి తనను ఎందుకు సస్పెండ్‌ చేశారో నాయకులు చెప్పాలని మాజీ ఎమ్మెల్సీ, మాజీ జడ్పీ చైర్మన్‌, టీటీడీ బోర్డు సభ్యుడు మేకా శేషుబాబు ప్రశ్నించారు.

వైసీపీ ఫ్లెక్సీలను దహనం చేస్తున్న ఆయన మద్దతుదారులు..

వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలన్న మాజీ ఎమ్మెల్సీ శేషుబాబు

వైసీపీ జెండాల దహనం

పాలకొల్లు/రూరల్‌, సెప్టెంబరు 19 : వైసీపీ నుంచి తనను ఎందుకు సస్పెండ్‌ చేశారో నాయకులు చెప్పాలని మాజీ ఎమ్మెల్సీ, మాజీ జడ్పీ చైర్మన్‌, టీటీడీ బోర్డు సభ్యుడు మేకా శేషుబాబు ప్రశ్నించారు. పాలకొల్లు మండలం పూలపల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన తండ్రి కోటేశ్వరరావుతో కలిసి శేషుబాబు దంపతులు మాట్లాడారు. ‘కల్లబొల్లి మాటలతో కార్యకర్తలను మోసం చేసిన పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ను ముందుగా సస్పెండ్‌ చేయాలి. ఎన్నికల ఖర్చు నిమిత్తం జగన్‌ ఇచ్చిన రూ.30 కోట్లు ఏం చేసారో సమాధా నం చెప్పాలి. ఎన్నో త్యాగాలను చేయడంతోపాటు అవమా నాలు ఎదుర్కొన్నా. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి మీద ఉన్న అనుబంధంతో పార్టీలో కొనసాగాను’ అని చెప్పారు. కోటేశ్వ రరావు మాట్లాడుతూ జగన్‌ అధికారం కోల్పోయిన తర్వాత బురదలో తిరిగినా ప్రయోజనం లేదని, వైసీపీ సర్వనాశనం అయిపోతుందని అన్నారు.

సస్పెన్షన్‌ వెనుక కారణాలేంటి ?

పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని వచ్చిన పలు ఫిర్యాదు లపై మాజీ జడ్పీ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్సీ శేషుబాబును పార్టీ అధ్యక్షుడు జగన్‌ సస్పెండ్‌ చేశారు. పాలకొల్లు నియోజక వర్గంలో కొన్నేళ్లుగా మూడు గ్రూపులుగా నాయకులు పని చేస్తున్నారు. ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓట మి తర్వాత నాయకుల్లో వర్గ విభేదాలు మరింత పెరిగాయి. లోకల్‌, నాన్‌ లోకల్‌ అన్న అభిప్రాయాలు పెరగడంతో పార్టీ క్యాడర్‌ ఒక్క తాటిపై పనిచేయలేదని అందుకు కారణం శేషు బాబు ఒకరని పార్టీలో ప్రచారం జరిగింది. పార్టీ కార్యక్ర మాలు విడివిడిగా చేయడంతో ప్రస్పుటమైంది. జరిగిన పరి ణామాల నేపథ్యంలో ఇటీవల పార్టీ జిల్లా అధ్యక్షులను మార్చిన అనంతరం శేషుబాబుపై బహిష్కరణ వేటు వేసి నట్లు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో శేషుబాబు అభిమా నులు పూలపల్లిలో గురువారం వైసీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, జగన్‌, పార్టీ నాయకుల ఫొటోలను దహనం చేశారు. మద్దతుదారులు పెద్ద సంఖ్యలో శేషుబాబు నివాసానికి చేరుకున్నారు.

Updated Date - Sep 20 , 2024 | 12:27 AM