మోకాళ్ల నొప్పులు తగ్గిస్తానంటూ..
ABN, Publish Date - Nov 10 , 2024 | 12:53 AM
‘మీకు మోకాళ్ల నొప్పులా..? ఎన్నో ఏళ్లుగా బాధిస్తున్నాయా ? ఆపరేషన్ చేయాలని చెబుతున్నారా ? మీరేం దిగులు చెందకండి. మా వద్దకు వస్తే రోజుల వ్యవధిలో తగ్గిస్తాం’ అంటూ ఓ నకిలీ వైద్యుడు భారీ ఎత్తున స్టెరా యిడ్స్, ఫెయిన్ కిల్లర్స్ వాడుతున్న వైనం శనివారం బట్టబయలైంది.
పెనుగొండ, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): ‘మీకు మోకాళ్ల నొప్పులా..? ఎన్నో ఏళ్లుగా బాధిస్తున్నాయా ? ఆపరేషన్ చేయాలని చెబుతున్నారా ? మీరేం దిగులు చెందకండి. మా వద్దకు వస్తే రోజుల వ్యవధిలో తగ్గిస్తాం’ అంటూ ఓ నకిలీ వైద్యుడు భారీ ఎత్తున స్టెరా యిడ్స్, ఫెయిన్ కిల్లర్స్ వాడుతున్న వైనం శనివారం బట్టబయలైంది. పెనుగొండ మండలం సోమరాజు చెరువులో కె.కృష్ణతేజ కొన్నేళ్లుగా తేజ మెడికల్స్ అండ్ జనరల్ స్టోర్స్ నిర్వహిస్తున్నాడు. ఆయన మోకాళ్లు నొప్పులు తగ్గిస్తానంటూ ప్రచారం చేసుకోవడంతో పెద్ద సంఖ్యలో వైద్యం కోసం పెద్ద ఎత్తున వస్తున్నారు. వచ్చిన వారికి స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ ఇస్తూ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తున్నారు. దీంతో ఆ నోటా, ఈ నోటా ఆపరేషన్ లేకుండా నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందని ప్రచారం జరిగింది. ఆయన వైద్యంపై అనుమానం వచ్చిన కొందరు ఆరా తీశారు. వైద్య విద్యకు సంబంధించి ఎలాంటి సర్టిఫికెట్లు లేవని తేలడంతో.. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని డీఎంహెచ్‌వో ఆదేశాల మేరకు పెనుగొండ పీహెచ్‌సీ వైద్యుడు డాక్టర్ వినోద్‌కుమార్ శనివారం మందుల షాపు ను, ఆసుపత్రిని తనిఖీ చేశారు. అధికంగా స్టెరా యిడ్స్, పెయిన్ కిల్లర్స్ ఉన్నట్లు గుర్తించి వాటికి తాళాలు వేశారు. పూర్తి నివేదికను జిల్లా అధికా రులకు సమర్పిస్తానని విలేకరులకు తెలిపారు. స్టెరాయిడ్స్ వాడకంపై వైద్యాధికారులకు కొంద రు గతంలోనే ఫిర్యాదుచేశారు. కాని, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీని వెను క లాబీయింగ్ నడిచినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాము ఎన్ని ఆసుపత్రిల చుట్టు తిరిగినా నయం కాని మోకాలి నొప్పులకు ఇక్కడ ఉపశమనం కలిగిందని కొందరు చెప్పడం విశేషం.
Updated Date - Nov 10 , 2024 | 12:53 AM