ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Farmers: గాంధీ వర్ధంతి రోజున రోడ్డెక్కిన రైతన్నలు

ABN, Publish Date - Jan 30 , 2024 | 01:58 PM

Andhrapradesh: మహాత్మాగాంధీ వర్ధంతి రోజున అన్నదాతలు రోడ్డెక్కిన ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. మంగళవారం నూజివీడు సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు రైతులు నిరసన ధర్నాకు దిగారు. చింతలపూడి ఎత్తిపోతల పధకం ఫెజ్ 1, 2 పనులు పూర్తి చేయాలంటూ నూజివీడులో రైతులు, రైతు సంఘ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు.

ఏలూరు జిల్లా, జనవరి 26: మహాత్మా గాంధీ వర్ధంతి రోజున అన్నదాతలు రోడ్డెక్కిన ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. మంగళవారం నూజివీడు సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు రైతులు నిరసన ధర్నాకు దిగారు. చింతలపూడి ఎత్తిపోతల పధకం ఫెజ్ 1, 2 పనులు పూర్తి చేయాలంటూ నూజివీడులో రైతులు, రైతు సంఘ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. వర్షాకాలంలో సముద్రంలో వృధాగా పోతున్న గోదావరి జలాలను ఎత్తిపోతల పధకం ద్వారా మెట్ట ప్రాంతాలలోని 15 మండలాల్లో 2 లక్షల ఎకరాలకు సాగునీటి కోసం ప్రభుత్వం నిధులు కేటాయించి పనులు పూర్తి చెయ్యాలని భూమిబిడ్డలు డిమాండ్ చేస్తున్నారు.

గతంలో నాబార్డులో ఆమోదం పొంది ఎన్నికల కోడ్‌తో ఆగిపోయిన రూ.1920 కోట్ల నిధులను వెంటనే విడుదల చెయ్యాలని రాష్ట్ర రైతు సంఘ నాయకులు కోరుతున్నారు. భూగర్భ జలాలు అడుగట్టి చెరువులు ఎండిపోవడంతో పంటలు దెబ్బతిని తీవ్ర నష్టాలను చవిచూస్తున్న రైతాంగంను చింతలపూడి ఎత్తిపోతల పధకం ఫెజ్ 2 పనులు పూర్తి చేసి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. విసన్నపేట, కోటపాడు, చనుబండ, ముసునూరు, చాట్రాయి నూజివీడు, రెడ్డిగూడెం మండల గ్రామాలకు చెందిన మామిడి, అరటి, పామాయిల్, మొక్కజొన్న, పొగాకు, కొబ్బరి, కూరగాయల పంటలు సాగు చేస్తున్న రైతాంగం నిరసన దీక్షలో పాల్గొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 30 , 2024 | 01:58 PM

Advertising
Advertising