ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేలకొరిగిన వరి.. తడిచిన ధాన్యం

ABN, Publish Date - Dec 02 , 2024 | 12:08 AM

తుఫాన్‌ ప్రభావంతో ఈదురు గాలులు వర్షానికి వందలాది ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి నేలనంటింది.

కలిదిండి మండలంలో నేలనంటిన వరి

వీడని వర్షం.. అన్నదాత గగ్గోలు

97,523 ఎకరాల్లో వరి కోతలు

రహదారులపై ధాన్యం రాశుల్లో నీరు

తేమశాతంతో ధరపై ఆందోళన

పంట కాపాడుకోడానికి రైతుల పాట్లు

వ్యసాయాధికారుల పరిశీలన

ముదినేపల్లి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ ప్రభావంతో ఈదురు గాలులు వర్షానికి వందలాది ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి నేలనంటింది. మాసూలు చేసిన ధాన్యం రాశులు తడిచి మొలక వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికందే తరుణంలో వేలాది ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. ముదినేపల్లి, కలిదిండి, కైకలూరు మండలాల్లో ఆదివారం జిల్లా వ్యసాయాధికారి హబీబ్‌ బాషా పర్యటించి ధాన్యం రాశులు పరిశీలించారు. బరకా లతో కప్పిఉంచిన ధాన్యం పరిశీలించి రైతులకు సూచనలు ఇచ్చారు. కోరుకొల్లులో పంట పొలాల్లో ధాన్యపు రాశులను తరలించడం కష్టతరమైతే రాశులపై పరదాలు కప్పి ఉంచాలన్నారు. వరి కోతలు తాత్కాలికంగా నిలుపుదల చేయాలన్నారు. రహదారులపై ధాన్యాన్ని ఆరబెట్టవద్దన్నారు. చింతలపూడి, మండలంలో 1224 రకం వరి పంట కోత దశకు రాలేదు. మాసూళ్లయిన చోట్ల పలు గ్రామాల్లో ధాన్యం రాశులపై బరకాలు కప్పి రైతులు కాపలా ఉంటున్నారు. పోలవరం మండ లంలో గూటాల, కొత్త పట్టిసీమ, పట్టిసీమ, పోలవరం, ప్రగడపల్లి, వింజరం, ఇటుకలకోట, ఎల్‌ఎన్‌డీ.పేట, కోండ్రుకోట గ్రామాల లో రైతులు పంట ఒబ్బిడి చేసుకునే పనిలో ఉన్నారు. కొంతమంది రైతులు అయిన కాడికి ధాన్యం విక్రయిస్తు న్నారు. ఏలూరు రూరల్‌ మండలంలో రైతులు నానా పాట్లు పడుతున్నారు. రెండు రోజుల నుంచి ధాన్యపు రాశుల పై ఉన్న బరకాలు తొలగించి ఆరబె ట్టుకునే ప్రయత్నం చేశారు. మళ్ళీ వర్షం కురవడంతో కొంత తడిచి పోయింది. ఆరిన ధాన్యాన్ని బస్తాలకు ఎత్తుకుని రోడ్డుపక్కనే ఉంచి బరకాలు కప్పారు. మల్కా పురం, తదితర గ్రామాల్లో వరిపైరు నేలకొరిగింది. కొన్ని చోట్ల కోసిన వరి పనలు, కుప్పలపై ఉంది. చలి గాలులు, చినుకులతో రైతులు ధాన్యం తరలిం చడానికి పాట్లు పడ్డారు. పెదవేగి, మండలంలో 6 వేల ఎకరా ల్లో వరి సాగు చేపట్టగా 1860 ఎకరా ల్లో వరి మాసూలు చేశారు. 4వేల మెట్రిక్‌ టన్ను ల ధాన్యాన్ని కొనుగోలు చేసి, మిల్లులకు తరలించ గా 600 మెట్రిక్‌ టన్నులు ధాన్యం రైతుల వద్ద ఉంది. కొంత పంట కుప్పలు, మరికొంత పంట పనలపై ఉంది. దుగ్గిరాల వద్ద జాతీయ రహదారి పక్కన బరకాలు కప్పిన ధాన్యం రాశులపై వర్షపు నీరు నిలిచింది. ధాన్యం తడవకుండా తల్లీ కొడు కులు రాశి పైనుంచి వర్షపు నీటిని తోడి కాపా డుకునే పనులు చేపట్టారు. కొయ్యలగూడెం మండలంలో ఆర్డీవో ఎంవీ.రమణ పొంగుటూరు, గవరవరం గ్రామాలలో పర్యటించారు. రైతులు, అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. రైతులకు ఇబ్బందులు ఎదురైతే టోల్‌ఫ్రీ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని ఆమె తెలిపారు. ఆమె వెంట తహసీల్దార్‌ చెల్లన్నదొర, వ్యవసాయ శాఖ, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

Updated Date - Dec 02 , 2024 | 12:08 AM