వామ్మో.. జ్వరం
ABN, Publish Date - Dec 09 , 2024 | 12:26 AM
మండలంలో సీజనల్ వ్యాధులు పట్టి పీడిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో ప్రజ లను జ్వరాలు వణికిస్తున్నాయి.
పెరుగుతున్న బాధితులు
ఫీవర్ సర్వే ఎక్కడ..?
అత్తిలి, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): మండలంలో సీజనల్ వ్యాధులు పట్టి పీడిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో ప్రజ లను జ్వరాలు వణికిస్తున్నాయి. దోమలు పెరగడం వ్యాధులు వ్యాప్తికి ప్రధాన కారణం. సమీపంలో ఆర్‌ఎంపీ, పీఎంపీల వద్ద వైద్య సేవలు పొందుతున్నారు. మం చిలి పీహెచ్‌సీ పరిధిలోని ఆరవల్లి, ఉని కిలి, స్కిన్నెరపురం తదితర గ్రామాల్లో జ్వరాల బాధితులు అధికంగా ఉన్నారు. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగు తుండడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణ వైరల్ ఫీవర్, మలేరియా కేసులు కూడా ఉన్నట్లు సమాచారం.
ఆర్‌ఎంపీ, పీఎంపీలే శరణ్యం
ప్రతి గ్రామంలో ఆర్‌ఎంపీ, పీఎంపీల వద్ద ప్రతి రోజు వందల మంది జ్వరాలతో చికిత్స పొందుతున్నారు. దీనితో బాధితుల వివరాలు పూర్తిస్థాయిలో నమోదు కావ డం లేదు. మండలంలో వ్యాధుల బారిన పడినవారు ఇతర ప్రాంతాలలో చికిత్స పొందుతున్నారు.
జాడలేని ఫీవర్ సర్వే!
వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ఎప్పటికప్పుడు గ్రామాల్లో జ్వరాల పరిస్థితి అవగాహన కోసం ఫీవర్ సర్వే నిర్వహించాల్సి ఉంది. కుటుంబంలో ఎవరికైనా జ్వరాలు, వ్యాధు లు ఉన్నాయా తెలుకునే అవకాశం ఉంది. కాని ప్రస్తుతం పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఎంతో మందికి వైరల్ ఫీవర్ ఉందో కూడా అధికారికంగా లెక్కలు తేలడం లేదు. కేవలం ప్రభుత్వ వైద్యశాల లకు వచ్చిన కేసులు నమోదు చేసుకుని మమ అనిపిస్తున్నారు.
Updated Date - Dec 09 , 2024 | 12:26 AM