ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మత్స్యకారుల వేదన

ABN, Publish Date - May 25 , 2024 | 12:11 AM

సముద్ర వేట నిషేధించి నేటికి 45 రోజులు గడిచింది. అయితే మత్స్యకారులకు నిషేధ సమ యంలో ఇచ్చే భృతి నేటికి అందలేదు. ఖాతాల్లో సొమ్ము జమ అయిందా ? లేదా ? అని వారు రోజూ అకౌంట్లను తనిఖీ చేస్తున్నారు. ఉపాధి లేకపోవడంతో పూట గడవడమే కష్టంగా మారింది. దీంతో ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

సముద్రంలో వేట నిషేధించి 45 రోజులు..

భృతి సొమ్ముకు 1,770 మంది ఎదురుచూపు

నరసాపురం, మే 24 : సముద్ర వేట నిషేధించి నేటికి 45 రోజులు గడిచింది. అయితే మత్స్యకారులకు నిషేధ సమ యంలో ఇచ్చే భృతి నేటికి అందలేదు. ఖాతాల్లో సొమ్ము జమ అయిందా ? లేదా ? అని వారు రోజూ అకౌంట్లను తనిఖీ చేస్తున్నారు. ఉపాధి లేకపోవడంతో పూట గడవడమే కష్టంగా మారింది. దీంతో ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చే నెల 15వ తేదీకి నిషేధ సమయం పూర్తవుతుంది. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో సముద్ర వేట సాగించే మత్స్యకారులు 1,770 మంది ఉన్నా రు. ఏప్రిల్‌ 15 నుంచి సముద్రవేటను నిషేధించారు. దీంతో వీరంతా ఉపాధిని కోల్పోయారు. మరో పనులకు వెళ్లలేక ఇంట్లోనే వలలు బాగు చేసుకుంటున్నారు. ఏటా ప్రభుత్వం ఈ నిషేధ సమయంలో కుటుంబ పోషణకు రూ.10 వేలు చొప్పున సాయం అందిస్తుంది. ఈ రెండు నెలల కాలంలో రూ.20 వేలు సాయం కింద అందనున్నాయి. గతంలో వేట నిషేధం అమల్లోకి వచ్చిన నెల రోజుల్లోనే కనీసం ఒక నెల సొమ్ము జమయ్యేది. నిషేధం పూర్తయ్యే నాటికి రెండు నెలల సొమ్ము పడేది. అయితే ఈ ఏడాది ఈ సీన్‌ కనిపించలేదు. నిషేధం అమల్లోకి వచ్చి నేటికి 45 రోజులు గడిచింది. ఇంత వరకు ఎటువంటి సాయం రాలేదు. అధికారులను అడిగితే మీ వివరాలు పంపించాం. త్వరలోనే మీ ఖాతాల్లో జమ అవుతాయని భరోసా ఇస్తున్నారు. కానీ ఫలితం ఉండటం లేదు. దీంతో బ్యాంకు అకౌంట్లను చూసుకుంటూ రోజులు లెక్కబెడుతున్నారు.

Updated Date - May 25 , 2024 | 12:11 AM

Advertising
Advertising