ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫ్రీ బుకింగ్‌..!

ABN, Publish Date - Oct 30 , 2024 | 12:29 AM

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూట మి ప్రభుత్వం దీపావళికి ఉచిత గ్యాస్‌ అం దించనుంది. దీపం, ఉజ్వల, సీఎస్‌ఆర్‌ గ్యాస్‌ కనెకన్లతో పాటు అర్హత ఉన్న ప్రతి తెల్లకార్డు దారులకు ఉచిత గ్యాస్‌ అందించే విధంగా మార్గదర్శకాలు విడుదల చేయడంతో పాటు మంగళవారం గ్యాస్‌ బుకింగ్‌ ప్రారంభించారు.

రేపు ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీ

తొలి రోజు భారీగా స్పందన

సొమ్ము చెల్లించి తీసుకుంటే.. రెండు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో జమ

ఆధార్‌తో బ్యాంకు ఖాతా, గ్యాస్‌ కనెక్షన్‌ లింకు అయితేనే లబ్ధి

భీమవరం టౌన్‌, అక్టోబరు 29 (ఆంరఽధ జ్యోతి):ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూట మి ప్రభుత్వం దీపావళికి ఉచిత గ్యాస్‌ అం దించనుంది. దీపం, ఉజ్వల, సీఎస్‌ఆర్‌ గ్యాస్‌ కనెకన్లతో పాటు అర్హత ఉన్న ప్రతి తెల్లకార్డు దారులకు ఉచిత గ్యాస్‌ అందించే విధంగా మార్గదర్శకాలు విడుదల చేయడంతో పాటు మంగళవారం గ్యాస్‌ బుకింగ్‌ ప్రారంభించారు. దీపావళి పండుగ నాడు ఉచిత గ్యాస్‌ లబ్ధిదా రులకు అందనుంది. ప్రస్తుతం ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధర చెల్లించిన వెంటనే సబ్సిడీ మొత్తం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఉచిత గ్యాస్‌ కోసం మంగళవారం నుంచి బుక్‌ చేసుకోవాలని ప్రభుత్వం సూచిం చడంతో మొదటి రోజు జిల్లాలో అధిక సంఖ్య లో బుకింగ్స్‌ నమోదయ్యాయి. నమోదైన బు కింగ్స్‌ వివరాలు అధికార యంత్రాంగం సేకరిం చనుంది. దీపావళి పండుగ రోజున ఉచిత గ్యాస్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనం గా ప్రారంభిస్తారు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు పొందడం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి రూ.2,520 ఆదా అవుతుంది.

మార్గదర్శకాలు

ఉచిత గ్యాస్‌ పొందడానికి అర్హతలపై ప్రభు త్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రధానంగా ఆధార్‌కార్డు, బియ్యం కార్డు కలిగి ఉండాలి. ఆధార్‌ నెంబర్‌తో లింక్‌ చేయబడిన బ్యాంకు ఖాతా నెంబరు, గ్యాస్‌ కనెక్షను కలిగి ఉండాలి. ఈ వివరాలు ఉన్న అర్హుల జాబితా సంబంధిత గ్యాస్‌ ఏజెన్సీల వద్ద సిద్ధంగా ఉంది. వారు గ్యాస్‌ బుకింగ్‌ చేసుకుని సిలిండర్‌ పొందిన తర్వాత యథాప్రకారం ఏజెన్సీకి సొమ్ము చెల్లించాలి. ఉచిత గ్యాస్‌ పొందడానికి అర్హులైతే మొబైల్‌ నెంబరుకు మెసేజ్‌ వస్తుంది. మెసేజ్‌ వచ్చిన లబ్దిదారు ఖాతాలో గ్యాస్‌ సిలిం డర్‌కు చెల్లించిన మొత్తం రెండు రోజుల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. తర్వాతి ఐదు నెలల్లో ఏ రోజు అయినా బుకింగ్‌ చేసుకునే అవకాశం కల్పించారు.

జిల్లాలో అర్హులు 5 లక్షల 67 వేలు

ఉచిత గ్యాస్‌ పథకంలో జిల్లాలోని తెలు పు రంగు రేషన్‌ కార్డుదారులు ఐదు లక్షల 67 వేల మంది అర్హులు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అధికారులతో మంగళవారం రాత్రి సమీక్షించారు. దీపావళి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకం అమలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో అక్టో బరు 31 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 మధ్య కాలంలో ఒక సిలిండర్‌ ఇవ్వనున్న ట్లు తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్‌ 1 నుంచి జూలై 31వ తేదీ వరకు మొదటి సిలిండర్‌, ఆగస్టు ఒకటి నుంచి నవంబరు 31 మధ్య ఒక సిలిండర్‌, డిసెంబరు 1 నుంచి 2026 మార్చి 31 మధ్యలో మూడో సిలిండర్‌ ఇవ్వనున్నా రు. లబ్ధిదారులు గమనించి సిలిండర్లను బుక్‌ చేసుకోవాలని కోరారు. ఎల్‌పీజీ గ్యాస్‌కు తెలుపు రంగు రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, బ్యాంకు అకౌంట్‌ కనెక్షన్‌ వివరాలతో అనుసంధానమై ఉండాలన్నారు.

Updated Date - Oct 30 , 2024 | 12:29 AM