ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వంట గదిలో దీపం

ABN, Publish Date - Nov 02 , 2024 | 12:51 AM

పేదల వంట గదిలో ప్రభుత్వం ‘దీపం’ వెలిగించింది.

లబ్ధిదారులకు ఉచిత గ్యాస్‌ అందజేసిన మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యేలు

చింతలపూడి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): పేదల వంట గదిలో ప్రభుత్వం ‘దీపం’ వెలిగించింది. దీపం–2 పథకంలో ఉచిత గ్యాస్‌ సిలిండర్లను మంత్రి కొలుసు పార్ధసారథి శుక్రవారం పంపిణీ చేశారు. చింతలపూడిలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి మూడు సిలిండర్లు పంపిణీ చేసే కార్యక్రమంలో ఈ పథకం అమలు చేశామన్నారు. కూటమికి 164 సీట్లు అప్పగించి ప్రజలు పెద్ద బాధ్యత ఇచ్చారన్నారు. పిల్లల భవిష్యత్‌ కోసం మహిళలు ఆలోచన చేసి తమను నమ్మారని, కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలో చేపట్టబోయే ఐదు నీటి ప్రాజెక్టుల్లో చింతలపూడి ఎత్తిపోతల పథకం కూడా ఉందన్నారు. ఈ పథకానికి గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో కొత్త రోడ్లకు రూ.6 కోట్లు కేటాయించామని, ఎమ్మెల్యే రోషన్‌కుమార్‌ అభ్యర్థన మేరకు తాను రూ.కోటి ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రతీ కుటుంబం తలసరి ఆదాయం పెరగాలని, చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు.

ఎమ్మెల్యే రోషన్‌కుమార్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, నిధులు అధికంగా కేటాయించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి మాట్లాడారు. ఆర్డీవో వాణి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి చంద్రశేషు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్‌ కిశోర్‌, జగ్గవరపు ముత్తారెడ్డి, మాటూరి వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు టూటౌన్‌: కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్‌–6 పథకాల్లో ఒకటైన ఉచిత గ్యాస్‌ ఎమ్మెల్యే బడేటి చంటి పంపిణీ చేశారు. శివగోపాలపురం గంగా నమ్మ ఆలయం వద్ద ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని ఎమ్మెల్యే మహిళలకు శుక్రవారం పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం మహిళా పక్షపాతి అన్నారు. దీపావళి నాడు పేదల ఇళ్లలో గ్యాస్‌సిలిండర్ల పథకంతో వెలుగు నింపుతున్నా మన్నారు. నియోజకవర్గంలో 61,853 మంది లబ్ధి దారులను గుర్తించామన్నారు. సంవత్సరానికి 3గ్యాస్‌సిలిండర్లు ఉచితంగా అందజేస్తామన్నారు. మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌, కమిషనర్‌ భానుప్ర తాప్‌, తహసీల్దార్‌ జీవీ.శేషగిరి, డీటీ రమేష్‌కు మార్‌, ఎస్‌ఎంఆర్‌.పెదబాబు, కార్పొరేట ర్లు పప్పు ఉమామహేశ్వరరావు, నున్నా స్వాతి, ఆర్నేపల్లి తిరుపతి, బొద్దాని శ్రీనివాస్‌, మారం హనుమంత రావు, వందనాల శ్రీనివాసరావు, నున్నా కిశోర్‌, తదితరులు పాల్గొన్నారు.

దెందులూరు: కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. దెందులూరులో ఉచిత గ్యాస్‌ సిలిండర్లను ఆయన పంపిణీ చేశా రు. పథకాన్ని ప్రారంభించారు. ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు కలిగి గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్నవారందరికీ దీపం పథకలో ఏడాదికి మూడు గ్యాస్‌ బండలను అందిస్తామన్నారు. సంక్రాంతి నాటికి దెందులూ రు–పంగిడిగూడెం రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామ న్నారు ,జాతీయ రహదారి నుండి ఉండ్రావరం రోడ్డు, కొవ్వలిలో పుంతల ముసలమ్మ రోడ్డు సైతం నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు మాగంటి నారాయణప్రసాద్‌, గారపాటి కొండయ్యచౌదరి, యిప్పిలి వెంకటేశ్వర రావు, సర్పంచ్‌ తోట ఏసమ్మ, ఎంపీటీసీ శేషార త్నం, మోతుకూరి నాని, కలపాల చంద్రశేఖర్‌, పెనుబోయిన మహేష్‌ యాదవ్‌, పసుమర్తి మధు బాబు, నాగనబోయిన సత్యనారాయణ, బొడ్డేటి మోహన్‌బాబు, నున్న లక్ష్మాణ్‌. అధికారులు తది తరులు పాల్గొన్నారు. తహసీల్దార్‌ సుమతి, ఎంపీడీవో శ్రీదేవి, సర్పంచ్‌ ఏసమ్మ, తాతా సత్యనారాయణ, బొప్పన సుధ, తదితరులతో కలిసి వెలమపేటలో చింతమనేని ప్రభాకర్‌ గ్యాస్‌ బండలను పంపిణీ చేశారు.

కొయ్యలగూడెం: ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని ట్రైకార్‌ చైర్మన్‌ బొరగం శ్రీనివాస్‌ అన్నారు. దీపం పథకం లో అందజేస్తున్న ఉచిత గ్యాస్‌ సిలిండర్లను కొయ్యలగూడెంలో ఆయన పంపిణీ చేశారు. ఏ ఎంసీ మాజీ చైర్మన్‌ రామారావు, తెలుగు మహిళ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి మేఘలాదేవి, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు చింతల వెంకటర మణ, బెల్లాని శ్రీను, గొలిశెట్టి శ్రీను ఉన్నారు.

నిడమర్రు: ఉచిత గ్యాస్‌ సిలెండర్లు పంపిణీ ద్వారా మహిళలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హమీలు నిలబెట్టుకొందని ఎమ్యెల్యే పత్స మట్ల ధర్మరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు అన్నారు. నిడమర్రులో లబ్ధిదా రులకు శుక్రవారం గ్యాస్‌ సిలిండర్లు అందజేశారు. జనసేన నాయకులు వంగా రఘు, చింతలపాటి బాసిరాజు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2024 | 12:51 AM