ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జీవో 117 ఉత్తర్వులు రద్దు చేయాలి

ABN, Publish Date - Jun 11 , 2024 | 12:15 AM

ప్రభుత్వ పాఠశాలల మనుగడకు ఆటంకంగా వున్న జీవో 117 ఉత్తర్వులను రాష్ట్రంలో నూతనంగా కొలువు దీర నున్న కూటమి ప్రభుత్వం రద్దుచేయాలని యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.ఎస్‌ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.

మాట్లాడుతున్న యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌

యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌

ఏలూరు ఎడ్యుకేషన్‌, జూన్‌ 10 : ప్రభుత్వ పాఠశాలల మనుగడకు ఆటంకంగా వున్న జీవో 117 ఉత్తర్వులను రాష్ట్రంలో నూతనంగా కొలువు దీర నున్న కూటమి ప్రభుత్వం రద్దుచేయాలని యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.ఎస్‌ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ఏలూరులోని సంఘ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మధ్యంతర కౌన్సిల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించిన ప్రభు త్వాన్ని ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించారని, కొత్తగా ఏర్పడ నున్న ప్రభుత్వంపై విద్యావ్యవస్థను బాగుచేసే బాధ్యత ఉందన్నారు. సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వాలను మార్చేశక్తి ఉందని మరోసారి ఈ ఎన్నికలు రుజువు చేశాయని వివరించారు. యూటీఎఫ్‌ జిల్లా నాయకులు షేక్‌ ముస్తఫా అలీ, సుభాషిణి, రంగాచారి, శ్యాంబాబు, వెంకటేశ్వరరావు, రంగమోహన్‌, విక్టర్‌, రాజు, అనురాద, రాంబాబు, సుధారాణి, కమల్‌కుమార్‌, మోహన్‌రావు, దేవానందరావు, బేతాళరావు, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, జిల్లా కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Read more!

Updated Date - Jun 11 , 2024 | 12:15 AM

Advertising
Advertising