ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గోదావరి దూకుడు

ABN, Publish Date - Sep 05 , 2024 | 12:24 AM

అంతకంతకు గోదావరి తరుము కొస్తోంది. భద్రాచలం వద్ద గంట గంటకు నీటి మట్టం పెరుగుతూ బుధ వారం మధ్యాహ్నం నాటికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే స్థాయికి చేరింది. గురు వారం నాటికి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి కి పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.

కుక్కునూరు తీర ప్రాంతంలో గోదావరి ఉధృతి

బిక్కుబిక్కుమంటున్న ముంపు మండలాలు

సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు యత్నాలు

రెండు నెలలకే మళ్లీ టెన్షన్‌

ఏజెన్సీలో పొంగుతున్న కొండవాగులు

కొల్లేరుకు పోటెత్తిన వరద

ముంపు భయంలో లంక గ్రామాలు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

అంతకంతకు గోదావరి తరుము కొస్తోంది. భద్రాచలం వద్ద గంట గంటకు నీటి మట్టం పెరుగుతూ బుధ వారం మధ్యాహ్నం నాటికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే స్థాయికి చేరింది. గురు వారం నాటికి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి కి పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. పరిస్థితిని యంత్రాంగం అంచనా వేస్తూ ప్రజలను అప్ర మత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలిం చేందుకు రంగం సిద్ధం చేసింది. ఏజెన్సీలో కొండవాగులు దూసు కొస్తున్నాయి. కొల్లేరు లోను వరద పోటెత్తింది. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలకు అవకాశం ఉండడంతో అంతా ఆందోళనలో ఉన్నారు.

పట్టుమని రెండు నెలలు గడవకమునుపే..

సరిగ్గా రెండు నెలల క్రితం ఇదే సమయంలో గోదావరి పోటెత్తింది. భద్రాచలం వద్ద అనూహ్యంగా పెరిగి రెండురోజుల వ్యవధిలోనే వరద ఉధృతంగా దూసుకొచ్చింది. ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడులలో పరిస్థితి దీనావస్థకు చేర్చింది. తిరిగి మళ్ళీ ఊళ్ళ మీద పడే దిశగా వరద ఉధృతి మరింత పెరుగుతోంది. ఈ రెండు ముంపు మండలాల్లోను ఒకవైపు గోదావరి, మరోవైపు వాగులు, వంకలు రోడ్డు మార్గాలను ఇప్పటికే చిన్నాభిన్నం చేశాయి. పెదవాగు పొంగి ప్రవహిం చడంతో ఆఖరుకి ప్రాజెక్టు అప్రోచ్‌ రోడ్డు కొట్టుకుపోగా మిగిల్చిన నష్టం ఇంకా మరువకముందే మళ్ళీ భారీ వర్షాల తాకిడికి వరద కమ్ముకొస్తూనే ఉంది. ఇప్పటికే వేలేరుపాడు, కుక్కునూరు రెండు మండలాల్లోను జన జీవనం అస్తవ్యస్తంగానే మారింది. సరైన మార్గం లేక, రోజువారి అవసరాలు తీరక జనం పడే అవస్థలు అన్నీఇన్నీకావు. ఈ నేపథ్యంలోనే అధికారులు గిరి జనులు, గిరిజనేతరులను వరద ముంచుకు రాకముందే సురక్షిత ప్రాంతాలకు తరలిరావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. కాని వరదలన్నా, నీరన్నా భయంలేని అనేక మంది ఎప్పటి కప్పుడు ఎదురయ్యే పరిస్థితులను తేలిగ్గానే తీసుకుంటున్నా ఇంకోవైపు రోజువారి కష్టాలు మాత్రం వీరిని వీడడంలేదు. వాస్తవానికి ఆగస్టు పూర్తయ్యే నాటికి గోదావరి వరదలు తగ్గుముఖం పడతాయని ఇప్పటి వరకు స్థానికులు ధీమాగా ఉన్నారు. కాని వారి ధీమాను పటాపంచలు చేస్తూ సెప్టెం బరు మొదటి వారంలోను గోదావరి వరద కమ్ముకొస్తుండ డంతో వీరంతా విలవిలలాడుతున్నారు. మండలంలో స్పెషల్‌ అధికారులను రంగంలోకి దింపారు. గోదావరికి రెండో ప్రమా ద హెచ్చరిక అతి చేరువలో ఉండడంతో తక్షణ సహాయ చర్యలకు వీలుగా సహాయ శిబిరాల ఏర్పాటుకు ప్రయత్నిస్తు న్నారు. గడిచిన రెండునెలల క్రితం ముంచెత్తిన వరదలతో దాదాపు 25 గ్రామాలు విలవిలలాడగా ఈసారి కూడా ఆయా గ్రామాలన్నింటినీ మరింత అప్రమత్తం చేశారు. వరద నుంచి కాపాడేందుకు తక్షణం రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మరోవైపు పోలవరం మండలంలోని కొవ్వాడ కాల్వ నీరు ఉధృతంగా ప్రవహిస్తూ గోదావరిలో కలుస్తోంది. పట్టిసీమ క్షేత్రంలో భారీగా వరద చేరింది.

ఎందుకీ వైపరీత్యం

ఇప్పటికే ఖరీఫ్‌ సీజన్‌ అంతంత మాత్రంగా ప్రారంభమైన తరుణంలోనే ఇంకోవైపు భారీ వర్షాలు, వరదలు ముంచెత్త డంతో రైతులు విలవిలలాడుతున్నారు. పోలవరం వద్ద కడెమ్మ స్లూయిజ్‌ నుంచి కొండవాగుల నీరు ఉధృతంగా గోదా వరిలోకి ప్రవహిస్తోంది. రామిలేరు పరిసర ప్రాంతాల్లో కూడా రైతులు ఇప్పటికే భయం గుప్పెట్లో ఉన్నారు. దీనికి తోడు బుడమేరు ప్రభావం కృష్ణ కాల్వ మీద కూడా పడింది. ఇప్పటి కిప్పుడు కృష్ణకాలువకు పెద్ద ప్రమాదం ఏమీలేదని అధికారు లు చెబుతున్నా భారీ వర్షాలు పునరావృతమైతే మాత్రం పంటకునష్టం తప్పదని రైతులు భయపడుతున్నారు. అందు కనే కృష్ణా కాల్వ పరీవాహకంలో తాజా పరిస్థితిని అధికారులు పరిగణనలోకి తీసుకుంటున్నారు. బుడమేరు పెరుగుతుండ డమే దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. తమ్మిలేరులో నీటి ప్రవాహం కొంత తగ్గినట్టే తగ్గి బుధవారం సాయంత్రం నాటికి మళ్ళీ పుంజుకుంది. ఏలూరు తూర్పు లాకులు, పడమర లాకుల వద్ద తమ్మిలేరు దూకుడుగా ఉంది.

వరద నీటితో కొల్లేరు ఉరకలు

కొల్లేరు సరస్సు వరద నీటితో ఉరకలేస్తోంది. ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని విధంగా అటు బుడమేరు నుంచి, ఇటు రామిలేరు, తమ్మిలేరు నుంచి భారీ ఎత్తున వరద కొల్లేరుకు చేరుతోంది. మూడో కంటికి తెలియకుండా కొల్లేరులో కొందరు కొంత భూమిని ఆక్రమించి చెరువులు తవ్వారు. ఇప్పుడు అవే అతి పెద్ద తప్పిదంగా మరోసారి మారబోతుంది. ఇంకోవైపు బుడమేరులో వరద తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతుండడం, ఇంకోవైపు భారీ వర్షాల సంకేతాలు జారీకావడంతో ఇప్పటికే కొల్లేరులో ఉన్న నీటి నిల్వ మరింత పెరిగే అవకాశం ఉంది. పలు లంకలను చుట్టిముట్టి రాకపోకలు స్తంభించే ప్రమాదం పొంచి ఉంది. పెదఎడ్లగాడి, చినఎడ్లగాడి వద్ద కొల్లేరు నుంచి వరద ఉధృతంగా ఉప్పుటేరులోకి చేరుతుంది. నాలుగేళ్ల క్రితం నాటి వరద ఈసారి కూడా కళ్ళకు కట్టినట్టుగా ఏలూరు–కైకలూరు మార్గం మీద రోడ్డుపైకి చేరింది. ఇప్పటికే మిగిలిన వాగుల నుంచి వరద కొల్లేరువైపు వస్తుండడంతో రాబోయే 24 గంటల్లోనే మరిన్ని లంక గ్రామాలకు వెళ్ళే మార్గాలన్నీ ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. కైక లూరు మండలం ఆటపాక పక్షుల కేంద్రం ముంపునకు గురయ్యే పరిస్ధితులు నెలకొన్నాయి. పక్షుల కేంద్రానికి ఆనుకొని ఉన్న పోల్‌రాజ్‌ డ్రెయిన్‌ ఉధృ తంగా ప్రవహిస్తూ కొల్లేరులో కలుస్తోంది. పందిరిపల్లిగూడెంలోని సర్కారు కాల్వ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కొల్లేరు గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది.

శిబిరాలకు తరలిరండి : జేసీ

కుక్కునూరు/వేలేరుపాడు/బుట్టాయగూడెం : భద్రాచలం వద్ద బుధవారం రాత్రికి 44.3 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరడంతో తెలంగాణ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. తెలంగాణ ఎగువన ప్రాజెక్టులన్ని నిండి ఉండడంతో కిందికి నీటిని విడుదల చేయడంతో గోదా వరి నెమ్మదిగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచ నా వేస్తున్నారు. ఈ క్రమంలో జేసీ ధాత్రిరెడ్డి మండలంలో ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న గొమ్ముగూడెంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. వరద రాకముందే పునరావాస శిబిరాలకు తరలి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని గ్రామస్థుల కు సూచించారు. అనంతరం దాచారం పునరావాస కాలనీకి వెళ్లి ఏర్పాట్లు పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ప్రత్యేకాధికారి బాబ్జీ, తహసీల్దార్‌ పెద్దిరాజు, ఎంపీడీవో నరసింహారావు ఇతర అధికారులు పాల్గొన్నారు. వేలేరుపాడు మండ లంలో వేలేరుపాడు, రుద్రమ్మకోట మధ్య రహదారిపైకి వరద చేరుకుంది. వేలేరుపాడు, కోయిదా రహదారి మధ్య గల ఎద్దువాగు, టేకూరువాగు బ్రిడ్జీల పైకి వరద చేరుకోవడంతో ఈ ప్రాంతాల్లో రాకపోకలు స్తంబించిపోయాయి. అత్యవసర పనులకు ఉపయోగించుకునేలా అధికారులు ఇక్కడ నాటుపడవలను అందుబాటులో ఉంచారు.

పొంగుతున్న కొండవాగులు

పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు ఎడతెరిపిలేకుండా కురిసిన భారీవర్షానికి మన్యంలోని కొండవాగులు ప్రమాదకరస్థాయి లో పొంగి ప్రవహించాయి.బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం–వీరన్నపాలెం మధ్య ఉన్న జల్లేరు కొండ వాగులు, కేఆర్‌ పురం తూర్పు కాల్వ, పద్మవారిగూడెం, రాచూరు సమీపంలోని వాగులు ప్రమాదకరంగా ప్రవహి స్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కుండపోత వర్షానికి వరదనీరు రోడ్లపైనే ప్రవహించడంతో జనజీవనం అస్థవ్యస్థంగా మారింది. అటవీ ప్రాంతంలోని అధికశాతం కొండరెడ్డి గ్రామాలు విద్యుత్‌ సరఫరా లేక అంధకారంలోనే ఉన్నాయి. జిల్లా అధికారులు ఆదేశాల మేరకు వాగుల వద్ద పోలీస్‌, రెవెన్యూ అధికారులు, సిబ్బందిని పహారా ఉంచినట్టు తహసీల్దార్‌ రమేష్‌ తెలిపారు.మరోవైపు శ్రీ గుబ్బల మంగ మ్మతల్లి జల్లేరు జలాశయానికి కొండవాగుల ద్వారా 250 క్యూసెక్కుల వరదనీరు వస్తుండగా ముందు జాగ్రత్త చర్యగా గేట్లు ఎత్తి 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు ఏఈ తులసీ తెలిపారు.

Updated Date - Sep 05 , 2024 | 12:24 AM

Advertising
Advertising