Sankranti 2024: ఆయ్.. గోదారోళ్లంటే మామూలుగా ఉండదు మరి...
ABN, Publish Date - Jan 15 , 2024 | 02:52 PM
Andhrapradesh: అతిధి మర్యాదలకు పెట్టింది పేరు గోదావరి జిల్లాలు. అటువంటి గోదావరి జిల్లాల ఘనమైన మర్యాదను విజయవాడకు చెందిన లోకేష్ సాయి అనే వ్యక్తి తన అత్తవారింటికి వచ్చి దక్కించుకున్నాడు.
పోలవరం, జనవరి 15: అతిధి మర్యాదలకు పెట్టింది పేరు గోదావరి జిల్లాలు. అటువంటి గోదావరి జిల్లాల ఘనమైన మర్యాదను విజయవాడకు చెందిన లోకేష్ సాయి అనే వ్యక్తి తన అత్తవారింటికి వచ్చి దక్కించుకున్నాడు. వివరాలలోకి వెళ్తే.. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామానికి చెందిన కాకి నాగేశ్వరరావు, లక్ష్మి దంపతుల కుమార్తె జ్యోత్స్నను పది నెలల క్రితం విజయవాడకు చెందిన లోకేష్ సాయి అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. లోకేష్ సాయి బెంగుళూరులో బిజినెస్ చేస్తున్నారు.
సంక్రాంతి పండగ సందర్భంగా అత్త, మామల ఆహ్వానం మేరకు లోకేష్ సాయి తన భార్య ను తీసుకుని రాజవరం వచ్చారు. అత్తవారింటికి వచ్చిన అల్లుడికి కాకి నాగేశ్వరరావు దంపతులు ఘనమైన స్వాగతం పలికి అపురూపమైన రీతిలో మర్యాదలు చేశారు. భోగి పండగ రోజు భోజనాన్ని అల్లుడు జీవితంలో మర్చిపోలేని విధంగా 225 రకాల వంటకాలతో వడ్డించి ఘనంగా మర్యాదలు చేశారు. 225 రకాల వంటకాలను చూసి అల్లుడు లోకేష్ సాయి ఆశ్చర్యానందాలకు లోనయ్యాడు. తమ కుమారుడికి అత్త, మామలు వడ్డించిన విందు భోజనం చూసి లోకేష్ సాయి తల్లి దీప్తి మాట్లాడుతూ.. ఇది గోదావరి జిల్లాల ప్రేమ, సాంప్రదాయం, గౌరవ మర్యాదలకు నిదర్శనం అంటూ సంతోషం వ్యక్తం చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jan 15 , 2024 | 03:35 PM