ఏటిగట్టు పనులు గాలికొదిలేశారు
ABN, Publish Date - Sep 05 , 2024 | 12:09 AM
వర్షాకాలం గోదావరి పరీవాహక ప్రాంత వాసులను వరద భయం వెంటాడుతుంది. లంక గ్రామాలు ముంపు బారిన పడతాయి.
గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకం
భారీ వరద వస్తే ముప్పు
యలమంచిలి, సెప్టెంబరు 4: వర్షాకాలం గోదావరి పరీవాహక ప్రాంత వాసులను వరద భయం వెంటాడుతుంది. లంక గ్రామాలు ముంపు బారిన పడతాయి. మండలంలోని పలుచోట్ల ఏటిగట్టు తక్కువ ఎత్తులో ఉండడం, మరికొన్నిచోట్ల బలహీనంగా ఉండడంతో ఏటి గట్టు వెలుపల గ్రామాల ప్రజలు భయంతో వణుకు తున్నారు. గడచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏటి గట్టును పటిష్టం చేయడం, ఎత్తు పెంచడంలో ఎలాంటి చర్యలు చేపట్టకుండా గాలికొదిలేసింది. వరదల సమ యంలో తాత్కాలిక పనులు చేపట్టడం.. వరద తగ్గిన తరువాత ఏటిగట్టు పటిష్టతను పట్టించుకున్న నాధుడే కరువయ్యారని స్థానికంగా విమర్శలు వినిపించాయి.
2007లో అప్పటి ప్రభుత్వం ఏటిగట్టు పటిష్టతకు పనులు ప్రారంభించి దాదాపు 2011లో పనులు ముగిం చారు. మండలంలోని వాకలగరువు, దొడ్డిపట్ల, అబ్బిరాజు పాలెం, గంగడపాలెం, లక్ష్మీపాలెం, యలమంచిలి, చించి నాడ గ్రామాల్లో కొన్నిచోట్ల ఏటిగట్టు ఎత్తు పెంచకుండా వదిలేశారు. వాకలగరువు, దొడ్డిపట్ల ప్రాంతంలో సుమా రు 700మీటర్ల మేర, అబ్బిరాజుపాలెం, గంగడపాలెం, లక్ష్మీపాలెం, యలమంచిలి, చించినాడ గ్రామాల పరిధిలో సుమారు 1.8 కిలోమీటర్ల మేర ఏటిగట్టు ఎత్తును పెంచి పటిష్టం చేయాల్సి ఉంది. భారీ వరద వస్తే గట్టుపై నుంచి పొంగిపొర్లే ప్రమాదం ఉందని స్థానికులు వాపో తున్నారు. 2022లో భారీ వరద సమయంలో ఇదే పరిస్థితి ఏర్పడింది. ప్రజలు, యువత ఏటిగట్టుపై ఇసుక బస్తాలు వేసి వరద ముప్పు ను అడ్డుకున్నారు. ఇంత జరి గినా అప్పటి వైసీపీ ప్రభు త్వం శాశ్వత ప్రాతిపదికన ఏటిగట్టు పనులు చేపట్టిన దాఖలాలు లేవు.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లో జల వనరుల శాఖా మం త్రి నిమ్మల రామానాయుడు చొరవతో మండలంలో ఏటిగుట్టు పటిష్టతకు హెడ్‌వర్క్స్ అధికారులు రూ.6.7 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. తాత్కాలికంగా ఏటిగట్టు పనులు చేపట్టేందుకు రూ.కోటి నిధులు మంజూర య్యాయి. వర్షాలు తగ్గిన అనంతరం ఈ పనులు చేపడ తామని హెడ్‌వర్క్స్ ఏఈ కె.సుబ్బారావు తెలిపారు.
Updated Date - Sep 05 , 2024 | 12:09 AM