ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జడ్పీ.. సాగునీటి సలహా మండలి సమావేశాలు రద్దు

ABN, Publish Date - Nov 14 , 2024 | 01:19 AM

కీలక, సాధారణ నిర్ణయాలు తీసుకోవడంలో అధికారులు తడబుడుతున్నారు. జిల్లా స్థాయి సమావేశాల ఏర్పాటులో రాష్ట్రస్థాయి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుని ఆనక నాలుక కరుచుకుని తూచ్‌ అంటున్నారు.

ఈ వారంలో రెండు ప్రభుత్వం శాఖల తీరు ప్రశ్నార్థకం

ఎన్నికల కోడ్‌ ఉన్నా జడ్పీ ప్రత్యేక సమావేశానికి ఓకే

ఆనక సమావేశం రద్దు

అదే బాటలో సాగునీటి సలహా మండలి సమావేశం

కీలక, సాధారణ నిర్ణయాలు తీసుకోవడంలో అధికారులు తడబుడుతున్నారు. జిల్లా స్థాయి సమావేశాల ఏర్పాటులో రాష్ట్రస్థాయి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుని ఆనక నాలుక కరుచుకుని తూచ్‌ అంటున్నారు. జడ్పీ సమావేశం జరుగుతుందని ఉమ్మడి జిల్లా సభ్యులందరికీ వర్తమానం ఇచ్చారు. తీరా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణమంటూ సమావేశం జరిగే రోజు సడెన్‌గా రద్దు చేశారు. తర్వాత సాగునీటి సలహా మండలి సమావేశం అన్నారు. ఆనక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ఈ సమావేశం రద్దు అన్నారు..!

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

ఒక కీలక అంశంపై నిర్ణయం తీసుకోడానికి అధికారు లు తడబడుతున్నారు. ముందు నిర్ణయం తీసుకుని ఆనక తూచ్‌ అంటున్నారు. ఈ నెల 11న జిల్లా పరిషత్‌ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్టు జడ్పీ సీఈవో సభ్యులందరికీ రెండు రోజులు ముందుగానే వర్తమానం పంపించారు. సోమవారం ఉదయం 9 సమావేశమని సభ్యులకు సమా చారం ఇవ్వడంతో దూర ప్రాంతాల వారంతా ఆదివారం రాత్రికి ఏలూరు చేరుకుని హోటళ్లలో బస చేశారు. తీరా సమావేశాన్ని రద్దు చేస్తున్నామంటూ అకస్మాత్తుగా ప్రక టించారు. దీంతో విసుగెత్తిన జడ్పీటీసీ సభ్యులంతా నిరస నకు దిగారు. తామంతా ఏలూరు చేరుకున్న తరువాత సమావేశం రద్దు అంటూ ఎందుకు కబురు పంపారని నిలదీశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలు లో ఉన్నందున సమావేశం రద్దు చేసినట్టు సీఈవో సభ్యులకు జవాబు ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాజాగా సాటునీటి సలహా మండలి సమావేశం మంగళవారం జరగబోతుం దని ముందస్తుగా ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో సమాంతరంగా జిల్లాల్లో సమావేశం సరికాదని సాగునీటి సలహా మండలి సమావేశాన్ని రద్దు చేశారు.

కోడ్‌ నిబంధనలు తెలిసీ..!

వాస్తవానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఈనెల 11 నుంచి అమలులోకి వస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ ముందే ప్రకటించారు. దీనికనుగుణంగా అధికారులు వ్యవహరించాలని సూచించారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీపై పంచాయతీరాజ్‌ చట్టం అనుగుణంగా అనర్హత వేటువేయాలని వైసీపీ సభ్యులంతా పట్టుపడు తున్నారు. ప్రత్యేక సమావేశంలో ప్రస్తావించాలని ఆ పార్టీ సభ్యులు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో ఈనెల 11న జడ్పీ సమావేశం సమాచారం విడుదల చేశారు. సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌కు నివేదించారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పుడు ప్రత్యేక సమావేశం ఎలా నిర్వహి స్తారని కలెక్టర్‌ అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో అధికారులు నాలుక కరుచు కుని సమావేశం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నికల కోడ్‌ అమలుపై జడ్పీ అధికారులకు అవగాహన లేకపోవడం, సభ్యులే గట్టిగా నిలదీసినప్పుడు సమాధానం చెప్పలేక నీళ్లు నమలాల్సి వచ్చింది. వాస్తవానికి జిల్లా పరిషత్‌లో ఇలాంటి విషయాల్లో పరస్పరం చర్చించుకున్న తరువాతే తుది నిర్ణయా నికి వస్తారు. జడ్పీ చైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా సమావేశం పెట్టాలని నిర్ణయించినప్పుడు జడ్పీలో అధికారులు ఎందు కు తడబడ్డారో, జడ్పీటీసీల ముందు ఎందుకు చులకన య్యారనేదే ప్రశ్న.

అసెంబ్లీ సమావేశాల వేళ..!

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ జిల్లా స్థాయిలో సమావేశం నిర్వహించదలిస్తే ముందస్తుగా ఇన్‌చార్జ్‌ మంత్రి, జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై స్పష్టత వచ్చిన తరువాతే కీలక సమావేశం నిర్వహణ తప్పదనుకున్న ప్పుడు తుది నిర్ణయం తీసుకుంటారు. ఇరిగేషన్‌ అధికా రులు మాత్రం నేరుగా జిల్లా సాగునీటి సలహా మండలి సమవేశాన్ని ఈ నెల 12న నిర్వహించనున్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమావేశానికి డెల్టా పరిధి లో ఎమ్మెల్యేలు హాజరుకావాల్సి ఉంది. ఒకవైపు అసెంబ్లీ, ఇంకోవైపు ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల అధికారిక సమావేశాలకు ఎమ్మెల్యేలు హాజరుకావాల్సి వచ్చింది. దీంతో సాగునీటి సలహా మండలి సమావేశాన్ని అర్ధాంత రంగా రద్దు చేయాల్సి వచ్చింది. జడ్పీ అధికారుల మాది రి ఇరిగేషన్‌ అధికారులు కూడా తడబడినట్టే చెబుతు న్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఒకటికి రెండుసార్లు మంత్రులు, ఎమ్మెల్యేల రాక అనుమతులు తీసుకుని సమావేశ తేదీలను నిర్ణయించాల్సి ఉంది. కాని జిల్లాలో అలా జరుగుతున్నట్టు కనిపించలేదు. సమావేశం నిర్వహిస్తామని ఒకసారి, రద్దు చేస్తున్నట్టు ఇంకోసారి ప్రకటించాల్సి వచ్చింది. అసెంబ్లీ సమావేశాల వేళ ముఖ్య మైన జిల్లా స్థాయి సమావేశాలు ఉంటే శని, ఆదివారాల్లో కూడా ఇంతకుముందు నిర్వహించిన దాఖలాలు లేకపో లేదు. జిల్లాలు విడిపోయిన తరువాత ఇలాంటి తడబాటు వ్యవహారాలు పునరావృతమవుతున్నట్టు కనిపిస్తుంది.

Updated Date - Nov 14 , 2024 | 01:19 AM