ధాన్యం కొనుగోళ్లకు సన్నాహాలు
ABN, Publish Date - Oct 21 , 2024 | 12:20 AM
జిల్లాలో సార్వా వరి సాగుకు సంబంధించి మాసూళ్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 22న ఉంగుటూరులో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు.
రేపటి నుంచి ప్రారంభం
250 రైతు సేవాకేంద్రాలు
ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం 3.40 లక్షల మెట్రిక్ టన్నులు
కొనుగోలు సిబ్బందికి శిక్షణ
ఊపందుకున్న వరి కోతలు
జిల్లాలో సార్వా వరి సాగుకు సంబంధించి మాసూళ్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 22న ఉంగుటూరులో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. జిల్లాలో 250 రైతు సేవా కేంద్రాల ద్వారా సార్వా ధాన్యం సేకరణ చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. కొనుగోలు లక్ష్యాలను కూడా నిర్దేశించుకున్నది.
ఏలూరు సిటీ, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అధికారులు ఏర్పా ట్లు పూర్తి చేశారు. సార్వాలో 5.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని ప్రాథ మిక అంచనా వేశారు. దీనికి అనుగుణంగా జిల్లాలో రైతుల నుంచి 3.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రస్తుతం వరి కోతలు ప్రారంభమైన ప్రాంతాల్లో సార్వా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం అవుతాయని జిల్లా పౌరసరఫరాల సంస్థ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
రైతు సేవాకేంద్రాలకు అనుబంధంగా ఈ సార్వా ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిర్వహించ డానికి 127 సొసైటీలను గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను అనుస రించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం కామన్ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2300, ఎ–గ్రేడ్ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2320 మద్దతు ధరగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధాన్యాన్ని రైతుల కళ్ళాల నుంచి కొనుగోలు చేసి వారు ఎంపిక చేసుకున్న సమీప రైస్‌మిల్లులకు ధాన్యాన్ని తరలిస్తారు.
కొనుగోలు సిబ్బందికి శిక్షణ పూర్తి
ఽధాన్యం కొనుగోళ్లు సమర్ధవంతంగా నిర్వహించడానికి సాంకేతిక సిబ్బందికి, ధాన్యం కొనుగోలు చేసే సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో తేమ శాతం లెక్కించడం, ధాన్యం తూకం, వాహనాల ద్వారా రైస్ మిల్లుకు పంపడం, తదితర అంశాలపై సం బంధిత వ్యవసాయ శాఖాధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులు, కస్టోడియన్ అధికా రులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, టెక్నికల్ అసి స్టెంట్లు, హెల్పర్లు, తదితర సిబ్బందికి ఈ శిక్షణ కార్యక్రమాల్లో టీసీఎస్ సంస్థ ద్వారా సాంకేతిక పరమైన శిక్షణ ఇవ్వడం జరిగింది. ధాన్యం కొను గోలు కేంద్రాల వద్ద కొనుగోలుకు సంబంధించి అన్ని పరికరాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తేమ కొలిచే యంత్రాన్ని, తూకం యంత్రాలను ఏర్పాటు చేశారు. రైతులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలుకు సంబంధించి గోనె సంచులు సిద్ధ్దం చేశారు. రవాణాకు సంబంధించి వాహనాలను ఏర్పాటు చేశారు.
వరి కోతలు
జిల్లాలో సార్వా సీజన్‌కు లక్షా 96వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. జిల్లాలో ముందస్తు వరి సాగు చేసిన ప్రాంతాల్లో వరి మాసూళ్లు ప్రారంభమయ్యాయి. మాసూళ్లు పూర్తయిన ప్రాంతాల్లో కొనుగోలు ప్రారంభి స్తారు. జిల్లాలోని ఉంగుటూరు, భీమడోలు తదితర ప్రాంతాల్లో వరి కోతలు ప్రారంభం కాగా దెందులూరు, పెదపాడు, నిడమర్రు మండలాల్లో కూడా కొద్ది రోజుల్లో వరి కోతలు ప్రారంభం కానున్నాయి.
ధాన్యం కొనుగోలు లక్ష్యం 3.40లక్షల మెట్రిక్ టన్నులు
జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో లక్షా 80వేల ఎకరాల్లో వరి సాగు చేయగా 5.60 లక్షల మెట్రి క్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని భావిస్తున్నారు. ఈ సీజన్‌లో సుమారు 3.40 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి తెలిపారు. జిల్లాలో సహకార సంఘాలు, డీసీఎంఎస్‌లు, రైతుల ఉత్పత్తి సంస్థలు (ఎఫ్‌పీవో)ల ద్వారా 250 రైతు సేవా కేంద్రాలలో ధాన్యం కొనుగో లుకు ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. దాదాపు 12 లక్షల గోనె సంచులను సిద్ధంగా ఉంచామన్నారు. లారీ యూనియన్లు, రైస్ మిల్లర్లు, ఇతర ప్రైవేటు వాహన యజమానుల ద్వారా జీపిఎస్ పరికరం అమర్చిన వాహనా లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతు లు సొంత వాహనం ద్వారా ధాన్యాన్ని రవాణా చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు జేసీ తెలిపారు. రైతు కళ్లాల నుంచి కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించామని, అవసరమమయ్యే ఖర్చులు ప్రభుత్వం రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ భరిస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై పర్యవేక్షణకు మండలాల వారీగా ప్రత్యేకాధికా రులను నియమించినట్లు తెలిపారు. కొనుగోలు సమస్యలపై కంట్రోలు రూమ్‌లో 08812 230448, టోల్ ప్రీ నెంబర్ 18004256453 నెంబర్లలో సంప్రదించవచ్చునన్నారు. జిల్లాలో ఈ నెల 22 నుంచి ఏపి రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందన్నారు. అనగా క్వింటాలుకు కామన్ రకం ధాన్యం రూ. 2300, గ్రేడ్–ఎ రకం ధాన్యం రూ. 2320 ధరకు రైతుల నుంచి కొనుగోలు చేయనున్నట్లు జేసీ వివరించారు. ధాన్యం కొనుగోలు నిమిత్తం హమాలీల ఖర్చులు, గోనె సంచుల వినియోగ రుసుంను ప్రభుత్వం భరిస్తుందన్నారు. ధాన్యం ఖరీదుతో పాటు ఆయా ధరలను సంబంధిత రైతుల ఖాతాలకు చెల్లించబడుతుందన్నారు. ఈ విషయంలో ఆసక్తి గల రైతులు సమీపంలోని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి ప్రభుత్వం వారు అందించే సదుపాయాన్ని వినియోగించుకోవా లన్నారు. రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం కనీస మద్దతు ధరకు విక్రయించుకోవాలని జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి తెలియజేశారు.
Updated Date - Oct 21 , 2024 | 12:20 AM