శ్మశానవాటిక కష్టాలు
ABN, Publish Date - Nov 05 , 2024 | 12:26 AM
గొల్లల కోడేరు శివారు గుబ్బలవారిపాలెం, సొడిగుళ్లవారి పాలెం, తుమ్మలగుంటపాలెం వాసులకు ఎవరైన మరణిస్తే ఆ మృతదేహాలను తరలించేందుకు పెద్దయుద్ధమే చేయ్యల్సిన పరిస్థితి.
మృతదేహాన్ని తరలించాలంటే నానాపాట్లు పడాల్సిందే
పాలకోడేరు, నవంబరు4 (ఆంధ్రజ్యోతి): గొల్లల కోడేరు శివారు గుబ్బలవారిపాలెం, సొడిగుళ్లవారి పాలెం, తుమ్మలగుంటపాలెం వాసులకు ఎవరైన మరణిస్తే ఆ మృతదేహాలను తరలించేందుకు పెద్దయుద్ధమే చేయ్యల్సిన పరిస్థితి. గొల్లలకోడేరు పంచాయతీ పరిధిలోని ఈ మూడు పాలాల్లో 1500 మంది జనాభా నివాసిస్తున్నారు. ఈ మూ డు పాలెలకు కలిపి ఇటు తుమ్మకుంటపాలెం అటు సూడుగుళ్ళ వారిపాలానికి మధ్యలో పంట పొలాలకి మధ్యలో వీరికి చెందిన శ్మశానవాటిక ఉంది.
ఈ శ్మశానవాటికకు వెళ్లాలంటే ఎటు నుం చి అయిన పంట పొలాల మధ్య నుంచి అరకిలో మీటరు నడకదారిన మృతదేహాన్ని తీసుకెళ్లా ల్సిందే. ఒకప్పుడు స్మశానవాటికకు వెళ్లేగట్టు మూ డు నుంచి నాలగు అడుగులు ఉండేదని ప్రస్తుతం అడుగుకూడా లేకపోవడంతో మృతదేహాన్ని తీసుకెళ్లాలి అంటే నరకం చూస్తున్నామని వాపో తున్నారు. మృతదేహాన్ని కాల్చేందుకు కట్టెలను సైతం ఎవరికివారు మోసుకొని వెళ్లాల్సి వస్తుంద న్నారు. ప్రభుత్వం స్పందించి శ్మశానవాటికకు వెళ్లేందుకు రోడ్డు ఏర్పాటు చేసి తమ కష్టాలను తీర్చాలని వారు కోరుకుంటున్నారు.
గ్రామం ఏర్పడిన నాటి నుంచి ఇవే కష్టాలు
గుబ్బలవారిపాలెం, తుమ్మగుంటపాలెం, చోడి గూడెంవారిపాలెం గ్రామాలు ఏర్పడిన నాటి నుంచి సుమారు 50 ఏళ్లుగా ఇదే శ్మశానవాటికను ఉపయోగించుకుంటున్నామని గ్రామస్థులు తెలిపా రు. అప్పటి నుంచి తమకు ఇవే కష్టాలు. ఎవరైన చనిపోయారంటే ఆ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. పొలాల మధ్య ఉన్నగట్ల మీద అడుగులో అడుగు వేసుకుంటు మృతదేహాన్ని తీసుకెళ్ళాల్సిన పరిస్థితి. ప్రజాప్రతినిధులు, అధికారులు తమ సమస్యలు గుర్తించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Updated Date - Nov 05 , 2024 | 12:26 AM