ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సమృద్ధిగా భూగర్భ జలం

ABN, Publish Date - Nov 28 , 2024 | 12:14 AM

ఏటా అడుగంటుతున్న భూగర్భ జలాలు ఒక్క సారిగా పెరిగాయి. భూగర్భ జలమట్టం పెరగడంతో సాగు, తాగునీటి ఇబ్బందులు తీరనున్నాయి.

భూగర్భంలో నీరు 4.15 మీటర్లు పెరుగుదల

సాగునీటి ఇబ్బందులకు చెక్‌

మెట్ట ప్రాంతాలకు శుభవార్త

ఏటా అడుగంటుతున్న భూగర్భ జలాలు ఒక్క సారిగా పెరిగాయి. భూగర్భ జలమట్టం పెరగడంతో సాగు, తాగునీటి ఇబ్బందులు తీరనున్నాయి. మెట్ట ప్రాంతంలో బోర్ల ఆధారంగా సాగు జరుగుతోంది. భూగర్భ జల మట్టం పెరగడం వల్ల తక్కువ లోతు నుంచి నీరు తోడుకునే అవకాశం ఉంది. బోర్ల నుంచి నీరు జలజలాపారుతుంది. మెట్టప్రాంత ఉద్యాన పంటల సాగుకు భూగర్భ జలమట్టం పెరుగుదల మంచి పరిణామం అని చెప్పవచ్చు.

ఏలూరుసిటీ, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): ఏటా భూగర్భ జలమట్టం తగ్గుదల ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది గణనీయంగా పెరగడం శుభ పరిణామం. ఏటా వర్షాలు బాగా కురిస్తే ఒకటి నుంచి రెండు మీటర్లు వరకు భూగర్భ జలమట్టం పెరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా జిల్లాలో 4.15 మీటర్ల వరకు భూగర్భ జలమట్టం పెరగడం సాగునీటి కష్టాలు తీరినట్లే.

గణనీయంగా పెరుగుదల

గత ఏడాది అక్టోబరులో జిల్లాలో 19.37 మీటర్ల లోతుకు భూగర్భజల మట్టం ఉంది. ఈ ఏడాది అక్టోబరులో 15.22 మీటర్లు లోతులోనే భూగర్భ జలం ఉంది. గత ఏడాదితో పోలిస్తే 4.15మీటర్లు వరకు పెరిగాయిని భూగర్భ జలవనరుల శాఖ నివేదికలు చెబుతున్నాయి. జిల్లాలో ఎక్కువ లోతులో అంటే 80.54 మీటర్లు లోతులో కొయ్యల గూడెం మండలంలో నీటిమట్టం ఉంది. ఈ ఏడాది అదే కొయ్యలగూడెం మండలంలో 78.49 మీటర్లు లోతులో నీరుంది. అంటే ఆ మండలంలో భూగర్భజలాలు వృద్ధి చెందాయని చెబుతున్నారు. ముసునూరు, దెందులూరు, నూజివీడు, పెదవేగి, చింతలపూడి, ద్వారకాతిరుమల మండలాల్లో ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలతో గణనీయంగా భూగర్భ జలం పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ముసునూరు మండలంలో 28.12 మీటర్లు వరకు భూగర్భ జలం వృద్ది చెందింది. దెందులూరు మండలంలో గత ఏడాది 54.31 మీటర్లు లోతులో నీరుండగా ప్రస్తుతం 41.36 మీటర్లలోనే నీరుంది. నూజివీడు మండలంలో గత ఏడాది 36.02 మీటర్లు లోతున నీరుంటే ప్రస్తుతం 33.45 మీట ర్లకే నీరు లభ్యమవుతోంది. పెదవేగి మండలం లో గత ఏడాది 35.25 మీటర్లు లోతున, ప్రస్తుతం 30.85 మీటర్లకే నీరు అందుతోంది. చింతలపూడి మండలంలో గత ఏడాది 34.64 మీటర్లు లోతులో ప్రస్తుతం 31.49 మీటర్లకు, ద్వారకాతిరుమల మండలంలో గత ఏడాది 33 మీటర్లు, ప్రస్తుతం 32.50 మీటర్లు లోతున నీరందుతోంది.

80 ఫిజోమీటర్లు ద్వారా సేకరణ

జిల్లాలో ఏటా 80 ఫిజోమీటర్లు ద్వారా భూగర్భ జల వనరుల శాఖ సిబ్బంది నీటిమట్టం వివరాలు సేకరిస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో భూగర్భ జలం పెరగడం అనూహ్యమైన పరిణామం. భవిష్యత్‌లో పంటల విస్తీర్ణం పెరగడానికి అవకాశం ఉంది. జిల్లాలో సాధారణ పంటలతో పాటు కొత్త రకాల పంటలు సాగు చేయడానికి కూడా అవకాశం ఏర్పడు తుంది. సాగు, తాగునీటి ఇబ్బందులు తీరటం వల్ల జిల్లా సమగ్రాభివృద్ధిలో ముందుకు సాగే అవకాశాలున్నాయి.

Updated Date - Nov 28 , 2024 | 12:14 AM