గుండుగొలను వంతెన నిర్మాణం అసంపూర్తి
ABN, Publish Date - Dec 04 , 2024 | 12:30 AM
గుండుగొలను (శింగగూడెం) వంతెన నిర్మాణం లో జాప్యం పరిసర గ్రామాల ప్రజలకు శాపంగా మారింది.
పనులు చేపట్టి రెండేళ్లు గడిచింది
50 శాతం కూడా పూర్తి కాలేదు
15 గ్రామాలకు ముప్పు
దెందులూరు, డిసెంబరు 3 (ఆంద్రజ్యోతి): గుండుగొలను (శింగగూడెం) వంతెన నిర్మాణంలో జాప్యం పరిసర గ్రామాల ప్రజలకు శాపంగా మారింది. గత వైసీపీ పాలనలో ప్రజా ప్రతినిధులు, అధికారులకు ముందుచూపు కొరవడ డంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో రెండేళ్లుగా గుండుగొలను వంతెన నిర్మాణ పనులు కనీసం సగం కూడా పూర్తి కాలేదు.
శింగగూడెం వద్ద వంతెన లేకపోవడంతో గుండుగొలను, పోతునూరు, లక్ష్మీపురం, భోగాపు రంతో పాటు 15 గ్రామాల ప్రజలు జాతీయ రహదారిపై సుమారు 600 మీటర్లు రాంగ్ రూట్ లో వెళ్లాల్సి ఉంది. నిబంధనలకు విరుద్ధమైన రాకపోకలతో రెండేళ్ల వ్యవధిలో 11 ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదాల్లో 16 మంది గాయాల పాలయ్యారు. విద్యార్థులు సైతం రాంగ్ రూట్‌లో వెళ్లాల్సి రావడంతో తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వంలో వంతెన నిర్మాణానికి పనులు ప్రారంభమైనప్పటికి కాంట్రాక్లర్, హైవే అధికారులు పట్టనట్లు వ్యవహ రించారు. కాలువలో నీటి ప్రవాహం సమస్య, భారీ క్రేన్లు దొరకడం లేదని సాకులు చూపుతు న్నారు. ఏడాది క్రితం గోదావరి కాలువ రెండు వైపులా వంతెన నిర్మాణానికి పిల్లర్స్ పూర్తి చేశా రు. ఎనిమిది నెలల క్రితం ఆ పిల్లర్స్‌పై మూడు భారీ గడ్డర్స్ నిర్మాణం పూర్తి చేశారు. కాలువలో నీటి ప్రవాహం ద్వారా రైతులు ఇబ్బందులు పడకుండా ఇరిగేషన్ శాఖ ద్వారా భారీ పైపులు వేసి రోడ్డు నిర్మించారు. క్రేన్లతో గడ్డర్స్ తీసుకు వచ్చి పిల్లర్స్‌పై వంతెన నిర్మాణం చేయాల్సి ఉంది. తూరలు తీసుకుని వచ్చి పక్కన ఉంచి రెండు నెలలు గడుస్తున్నాయి. ప్రస్తుతం కాంట్రా క్టర్ పనులు చేస్తున్నప్పటికి నత్తడనడన సాగుతుండడంతో నిర్మాణం మరింత సమయం పట్టే ఆవకాశం ఉంది. కాల్వ ద్వారా సాగునీరు అందించడానికి ముందే వంతెన పనులు పూర్తి చేయాలని 15 గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.
15 గ్రామాల సమస్య
గుండుగొలను వంతెన 15 గ్రామాల ప్రజల సమస్యకు పరిష్కాం. విద్యార్థులు, ఆక్వా రైతు లు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నాం. రెండు రోజుల నుంచి పని వేగం పెం చారు. మరింత పెంచి వంతెన పూర్తి చేయాలి. పనులు చేపట్టి రెండేళ్లు గడిచినా ఇంతవరకు 50 శాతం పనులు కూడా పూర్తి కాలేదు.
– టి.సుమన్, చైర్మన్, గుండుగొలను వంతెన సాధన కమిటీ
పనులు చేపట్టి రెండేళ్లు గడిచింది
50 శాతం కూడా పూర్తి కాలేదు
15 గ్రామాలకు ముప్పు
దెందులూరు, డిసెంబరు 3 (ఆంద్రజ్యోతి): గుండుగొలను (శింగగూడెం) వంతెన నిర్మాణం లో జాప్యం పరిసర గ్రామాల ప్రజలకు శాపంగా మారింది. గత వైసీపీ పాలనలో ప్రజా ప్రతిని ధులు, అధికారులకు ముందుచూపు కొరవడ డంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో రెండేళ్లుగా గుండుగొలను వంతెన నిర్మాణ పనులు కనీసం సగం కూడా పూర్తి కాలేదు.
శింగగూడెం వద్ద వంతెన లేకపోవడంతో గుండుగొలను, పోతునూరు, లక్ష్మీపురం, భోగాపు రంతో పాటు 15 గ్రామాల ప్రజలు జాతీయ రహదారిపై సుమారు 600 మీటర్లు రాంగ్ రూట్ లో వెళ్లాల్సి ఉంది. నిబంధనలకు విరుద్ధమైన రాకపోకలతో రెండేళ్ల వ్యవధిలో 11 ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదాల్లో 16 మంది గాయాల పాలయ్యారు. విద్యార్థులు సైతం రాంగ్ రూట్‌లో వెళ్లాల్సి రావడంతో తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వంలో వంతెన నిర్మాణానికి పనులు ప్రారంభమైనప్పటికి కాంట్రాక్లర్, హైవే అధికారులు పట్టనట్లు వ్యవహ రించారు. కాలువలో నీటి ప్రవాహం సమస్య, భారీ క్రేన్లు దొరకడం లేదని సాకులు చూపుతు న్నారు. ఏడాది క్రితం గోదావరి కాలువ రెండు వైపులా వంతెన నిర్మాణానికి పిల్లర్స్ పూర్తి చేశా రు. ఎనిమిది నెలల క్రితం ఆ పిల్లర్స్‌పై మూడు భారీ గడ్డర్స్ నిర్మాణం పూర్తి చేశారు. కాలువలో నీటి ప్రవాహం ద్వారా రైతులు ఇబ్బందులు పడకుండా ఇరిగేషన్ శాఖ ద్వారా భారీ పైపులు వేసి రోడ్డు నిర్మించారు. క్రేన్లతో గడ్డర్స్ తీసుకు వచ్చి పిల్లర్స్‌పై వంతెన నిర్మాణం చేయాల్సి ఉంది. తూరలు తీసుకుని వచ్చి పక్కన ఉంచి రెండు నెలలు గడుస్తున్నాయి. ప్రస్తుతం కాంట్రా క్టర్ పనులు చేస్తున్నప్పటికి నత్తడనడన సాగుతుండడంతో నిర్మాణం మరింత సమయం పట్టే ఆవకాశం ఉంది. కాల్వ ద్వారా సాగునీరు అందించడానికి ముందే వంతెన పనులు పూర్తి చేయాలని 15 గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.
15 గ్రామాల సమస్య
గుండుగొలను వంతెన 15 గ్రామాల ప్రజల సమస్యకు పరిష్కాం. విద్యార్థులు, ఆక్వా రైతు లు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నాం. రెండు రోజుల నుంచి పని వేగం పెం చారు. మరింత పెంచి వంతెన పూర్తి చేయాలి. పనులు చేపట్టి రెండేళ్లు గడిచినా ఇంతవరకు 50 శాతం పనులు కూడా పూర్తి కాలేదు.
– టి.సుమన్, చైర్మన్, గుండుగొలను వంతెన సాధన కమిటీ
Updated Date - Dec 04 , 2024 | 12:33 AM