ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉచిత గ్యాస్‌కు భారీ బుకింగ్స్‌

ABN, Publish Date - Nov 06 , 2024 | 12:40 AM

ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్‌ పంపిణీ అమలుతో అర్హుల ఇళ్లకు గ్యాస్‌ సిలిండర్‌ చేరింది.

బుక్‌ చేసుకున్న వారు 82,750 మంది

71,259 మందికి గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ

33,156 మంది లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ

ఏలూరుసిటీ, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్‌ పంపిణీ అమలుతో అర్హుల ఇళ్లకు గ్యాస్‌ సిలిండర్‌ చేరింది. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఇంతవరకు ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ కోసం 82,750 మంది బుకింగ్‌ చేసు కున్నారు. ఇప్పటివరకు 71,259 మందికి గ్యాస్‌ సిలిండర్లు డెలివరీ చేశారు. వారిలో ఇంతవరకు 33,156 మందికి గ్యాస్‌ సిలిండర్‌కు చెల్లించిన మొత్తం వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయింది. మిగిలిన వారికి గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ చేసిన 48 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాలకు సడ్సిడీ సొమ్ములు జమ చేయటం జరుగుతోందని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారులు చెబుతున్నారు.

జిల్లాలో 6,44,222 గ్యాస్‌ కనెక్షన్లు

జిల్లాలో మొత్తం గ్యాస్‌ కనెక్షన్లు 6,44,222 ఉన్నాయి. దీపం కనెక్షన్లు 1,92,212 ఉండగా ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్లు 27,639 ఉన్నాయి. ఇవి గాక సీఎస్‌ఆర్‌ గ్యాస్‌ కనెక్షన్లు 18,243 వరకు ఉన్నామని జిల్లా పౌరసరఫరాల శాఖ నివేదికలు చెబుతున్నాయి. సాధారణ గ్యాస్‌ కనెక్షన్లు 4,06,128 వరకు ఉన్నాయి. దీపం, ఉజ్వల, సీఎస్‌ ఆర్‌ పథకాలు లేని సమయంలో తెల్లకార్డుదా రులు తమ అవసరాల కోసం సాధారణ గ్యాస్‌ కనెక్షన్లును పొందాల్సి వచ్చింది.

ఖాతాలో నగదు జమ కాకుంటే..

ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ అయిన 48 గంటల్లోపు సబ్సిడీ సొమ్ము జమ కాలేదని ము గ్గురు వినియోగదారులు తమకు ఫిర్యాదు చేశారని, వెంటనే సమస్యను పరిష్కరించి వారి సొమ్ములను బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు డిఎస్‌ఓ ఆర్‌ఎస్‌ఎస్‌ సత్యనారాయణ రాజు తెలి పారు. కొన్ని కారణాల వల్ల సబ్సిడీ సొమ్ములు వెంటనే జమ కాకపోయినా పరిష్కరిస్తున్నామని ఆయన తెలిపారు. 2025 మార్చి వరకు మొదటి విడత గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారని, అర్హులైన వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Updated Date - Nov 06 , 2024 | 12:40 AM