జిల్లాలో ఐవీఆర్ సర్వే
ABN, Publish Date - Apr 08 , 2024 | 11:46 PM
ఉండి నియోజకవర్గంపై కూటమిలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యే రామరాజుకు టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి పిలుపువచ్చింది.
ఎమ్మెల్యే రామరాజుకు చంద్రబాబు పిలుపు.. హైదరాబాద్‌లో బేటీ.. రెండు రోజుల్లో పూర్తి స్పష్టత
(భీమవరం–ఆంధ్ర జ్యోతి)
ఉండి నియోజకవర్గంపై కూటమిలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యే రామరాజుకు టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి పిలుపువచ్చింది. అధినేతను కలిసేందుకు ఆయన సోమవారం హైదరాబాద్ పయనమ య్యారు. చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి ఎంపీ రఘురామకృష్ణంరాజు పోటీ చేస్తారంటూ ప్రచారం సాగు తోంది. చంద్రబాబు నుంచి జిల్లా ముఖ్య నేతలకు ఆ దిశగా సంకేతాలం దాయి. ఈ నేపథ్యంలో రామరాజుకు చంద్రబాబు నుంచి పిలుపు రావడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి ఉండి టీడీపీకి కంచుకోట. ఈ దఫా కూడా ఆ పార్టీకే విజయవకాశాలు స్పష్టంగా ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి. అయితే ఎంపీ రఘురామకు నర్సాపురం ఎంపీ టిక్కెట్ దక్కకపోవడంతో స్థానికంగా అంతా ఆత్మరక్షణలో పడ్డారు. వైసీపీ పైన, జగన్‌పైనా పోరాటం చేస్తూ వచ్చిన ఆయనకు టిక్కెట్ ఇవ్వక పోవడంపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చే నడిచింది. నిజానికి బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల్లోని ఏదో పార్టీ నుంచి ఆయనకు ఇక్కడ ఎంపీ టిక్కెట్‌పై పోటీ చేస్తారని అంతా భావించారు. కాని, బీజేపీ నుంచి వర్మకు టిక్కెట్ కేటాయించారు. ఇక ఎంపీ టిక్కెట్‌కు అవకాశం లేకపోవడంతో చివరకు ఎమ్మెల్యే టిక్కెట్ అయినా ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. నర్సాపురం పరిధిలోని ఉండిపైనే అధినేత దృష్టి పెట్టారని చర్చ సాగుతోంది. మరోవైపు రఘురామ పార్లమెంట్‌కు పోటీ చేస్తే బాగుంటుందా ? ఎమ్మెల్యేకు పోటీ చేస్తే మంచిదా ? అంటూ సోమవారం జిల్లాలో ఐవీఆర్ సర్వే నిర్వహిం చారు. కాని, రఘురామ మాత్రం మొదటి ప్రాధాన్యత ఎంపీగా పోటీ చేసేందుకే మక్కువ చూపుతున్నారు. అయితే టీడీపీ అధిష్ఠానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేయకతప్పదంటూ ఇది వరకే స్పష్టం చేశారు. ఆ దిశగానే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఒకటి, రెండు రోజుల్లో ఈ స్థానంపై పూర్తి స్పష్టత రానుంది.
మంత్రి కొట్టును మారుస్తున్నారా ?
తాడేపల్లిగూడెం వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి కొట్టు సత్యనారా యణను పార్టీ అధిష్టానం ప్రకటించడం తో ఆయన ఇప్పటికే ప్రచారం చేసుకుం టున్నారు. అయితే నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేక గాలులు వీస్తున్నా యని, ఈ మేరకు నివేదికలు వెళ్లాయని, టికెట్ మార్పు ఖాయమంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో ఇటీవలే ఆ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యేకు ఇస్తారని అంతా భావిస్తున్నారు. ఆ నేత తన అనుచరవర్గంతో సంప్రదింపులు జరుపుతున్నారు. తనకే టిక్కెట్ అంటూ ఆయన ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కేడర్ గందరగోళంలో పడింది. మరోవైపు అభ్యర్థి అనుకున్న ఒప్పందం ప్రకారం పార్టీ వద్ద సొమ్ములు డిపాజిట్ చేయలేదని సమాచారం. ఎంపీ అభ్యర్థి వ్యయంలోనూ ఇతర నియోజకవర్గాల మాదిరిగా ఆయన సహకరించాల్సి వుంది. ఏది ఏమైనప్పటికి పార్టీ తనకే టిక్కెట్ ఇస్తుందని ఆ మాజీ ఎమ్మెల్యే విశ్వ సిస్తున్నారు. ఆయన ధీమాగా చెప్పడంతోనే మంత్రి కొట్టు టిక్కెట్‌పై పార్టీ శ్రేణుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Updated Date - Apr 08 , 2024 | 11:46 PM