పరిశుభ్రమైన ఆహారం అందించాలి
ABN, Publish Date - Dec 12 , 2024 | 12:24 AM
వ్యాపారులు ప్రజలకు పరిశుభ్రమైన ఆహారాన్ని మా త్రమే అందించాలని, అపరిశుభ్రతపై చర్యలు ఉంటాయని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్ రెడ్డి హెచ్చరించారు.
వ్యాపారులకు జాయింట్ కలెక్టర్ హెచ్చరిక
భీమవరం టౌన్, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): వ్యాపారులు ప్రజలకు పరిశుభ్రమైన ఆహారాన్ని మా త్రమే అందించాలని, అపరిశుభ్రతపై చర్యలు ఉంటాయని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్ రెడ్డి హెచ్చరించారు. కలెక్టరేట్‌లో కేవీజీవీఎం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన పాన్ ఇండియా పోస్టాక్ టైన్రింగ్ కార్యక్రమంలో జేసీ ముఖ్య అతిథిగా పాల్గొ న్నారు. ఆహార విక్రయదారులంతా అవగాహన, అను భవం మాత్రమే కాక భారతీయ ఆహార భద్రత సంస్థ ఇంప్లిమెంటేషన్ కార్యక్రమమైన పోస్టాక్ కోర్సులలో శిక్షణ పొంది ఉండాలన్నారు. ఆహార సంబంధమైన పరిశుభ్రతలలో భాగమైన వ్యక్తిగత పరిశుభ్రత, ఆహా ర నాణ్యత, భద్రత, పరిసరాల పరిశుభ్రత కలిగి వ్యాపారం చేయాలన్నారు. ఫుడ్ లైసెన్స్ తప్పనిసరిగా పొంది ఉండాలన్నారు. భీమవరం పట్టణంలో ఫుడ్ కోర్టు ఏర్పాటుకు చర్యలు చేపట్టామని, ఫుడ్ కోర్టులో వ్యాపారం చేయడానికి శిక్షణ పొందిన వారిలో పరిశు భ్రత పాటిస్తున్న వారికి మాత్రమే అవకాశం కల్పిస్తామని తెలిపారు.
శిక్షణ లేకుంటే చర్యలు
ఆహార సంబంధ వ్యాపారాలు చేసేవారు లైసెన్సు, పోస్టాక్ ట్రైనింగ్ సర్టిఫికెట్ లేకుంటే కఠిన చర్యలు తప్పవని జేసీ హెచ్చరించారు. తినుబండా రంలో కల్తీ లేకుండా చూడడమే లక్ష్యమన్నారు. అనంతరం జేసీ రాహుల్‌కుమార్ రెడ్డి, డీఆర్వో మొగలి వెంకటేశ్వర్లు, పోస్టాక్ ట్రైనింగ్ పార్టనర్ కేవీజీఎం కరపత్రాన్ని ఆవి ష్కరించారు. భీమవరం పట్టణంలో హోటల్స్, బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, చికెన్ సెంటర్లు, టీ స్టాల్స్ వ్యాపారులకు ట్రైనర్ పి.యశోదాదేవి అవగాహన కల్పించారు. సౌత్ ఇండియా కేవీజీవీఎం ఇన్‌చార్జి టి. సింధు, సి.మోహన్ బాబు, జిల్లా టీం హెడ్ వి.మా ధవి, పట్టణంలోని వ్యాపారులు పాల్గొన్నారు.
Updated Date - Dec 12 , 2024 | 12:24 AM