ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ధాన్యం దళారుల దందాపై కఠిన చర్యలు

ABN, Publish Date - Dec 04 , 2024 | 12:37 AM

జిల్లాలో ఎక్కడైనా రైతును మభ్యపెట్టి దళారులు అక్రమంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ పి.థాత్రిరెడ్డి హెచ్చరిం చారు.

రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న జేసీ

జాయింట్‌ కలెక్టర్‌ ధాత్రి రెడ్డి పరిశీలన

ద్వారకాతిరుమల, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎక్కడైనా రైతును మభ్యపెట్టి దళారులు అక్రమంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ పి.థాత్రిరెడ్డి హెచ్చరిం చారు. మండలంలోని నారాయణపురం రైతు సేవా, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవా రం ఆమె పరిశీలించారు. ముందుగా ధాన్యం సేకరణ తీరుతెన్నులను తనిఖీ చేశారు. మూడు రోజులుగా వాతావరణ ప్రతికూలత వల్ల ఏర్పడిన పరిస్థితులను సమీక్షించారు. ధాన్యం సేకరణలో రెవెన్యూ సహకారం ఎంత వరకూ ఉందో రైతులను అడిగి తెలుసుకు న్నారు. తేమ 17 శాతం వచ్చేవరకూ ధాన్యాన్ని ఆరబెట్టు కోవాలని సూచించారు. ఈ విధంగా ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అవసర మైన చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలిచ్చారు. తహసీల్దారు సుబ్బారావు, మండల వ్యవసాయాధికారి దుర్గారమేష్‌, వీహెచ్‌ఏ నిహారిక తదితరులు పాల్గొన్నారు.

1.59 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు

పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ శ్రీలక్ష్మి

ఏలూరుసిటీ, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇప్పటివరకు రూ.367.63 కోట్లు విలువైన 1,59,782.960 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ వి.శ్రీలక్ష్మి తెలిపారు. ఉంగుటూరు నియోజకవర్గంలో రూ. 145.20 కోట్లు విలువైన 63,344.240 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. చింతల పూడి నియోజకవర్గంలో 21,094.560 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 2498 మంది రైతుల వద్ద నుంచి కొనుగోలు చేశామన్నారు. తుఫాన్‌ నేపథ్యంలో గరిష్ఠంగా 5 కేజీల తరుగుతో తేమ 25 శాతం ఉన్నా కనీస మద్దతు దరకు కొనుగోలు చేసి రైతు కోరిన రైస్‌మిల్లుకు తరలించినట్లు ఆమె తెలిపారు. ధాన్యాన్ని తరలించిన 48 గంటలలోపే రైతు బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ చేస్తున్నట్లు వివరిం చారు. వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయిలో ఈ–పం ట, ఈ–కేవైసీ ద్వారా రైతుల వివరాలు నమోదు చేశారని, పారదర్శకంగా ధాన్యం కొనుగోలు జరుగుతోందన్నారు. ధాన్యం కొనుగో లు ప్రక్రియను జిల్లా స్థాయిలో కంట్రోల్‌రూమ్‌ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామన్నారు.

Updated Date - Dec 04 , 2024 | 12:37 AM