ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఉప్పు నీటి సరస్సు

ABN, Publish Date - Jun 09 , 2024 | 12:20 AM

ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు ఉప్పు నీటి కాసారంగా మారింది. ఏటా వర్షాకాలం పుష్కలంగా నీరున్నప్పటికీ నీటి నిల్వలకు ఎలాంటి ప్రణాళిక లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

ఉప్పునీటి దెబ్బకు కొల్లేరు సరస్సులో ఎండిపోయిన గుర్రపుడెక్క

కొల్లేరులో దెబ్బతింటున్న భూగర్భ జలాలు

సరస్సులో 12 శాతానికి ఉప్పు నీటి సాంద్రత

కైకలూరు, జూన్‌ 8: ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు ఉప్పు నీటి కాసారంగా మారింది. ఏటా వర్షాకాలం పుష్కలంగా నీరున్నప్పటికీ నీటి నిల్వలకు ఎలాంటి ప్రణాళిక లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. రోజూ సముద్రపు నీరు పోటు ద్వారా ఉప్పుటేరు నుంచి కొల్లేరులోకి చేరడంతో సహజ సిద్ధంగా పెరిగే మత్స్యసంపద, జీవ రాశులు మృత్యువాత పడుతు న్నాయి. ఈ క్రమంలో వేలాది మంది మత్స్యకారులు సైతం తమ ఉపాధిని కోల్పోతున్నారు.

ఉప్పు సాంద్రత

ఏటా వర్షాకాలంలో పది వేల క్యూసెక్కుల నీరు ఎగువ నుంచి కొల్లేరులోకి చేరుతుంది. ఈ నీటిని నిల్వ ఉంచేందుకు రెగ్యులేటర్‌ లేకపోవడంతో పోటుకు సముద్రపు నీరు కొల్లేరులోకి చొచ్చుకొస్తోంది. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండడంతో ఉప్పుటేరులో నీటి ఉప్పు 12 శాతం చేరుకుంది. ఇంత పెద్ద శాతం ఉప్పు ఉండడంతో ఎలాంటి మత్స్యసంపదైనా గుర్రపు డెక్క, తూడు చనిపో తుంది. అనధికారికంగా కొల్లేరులో సాగు చేస్తున్న రొయ్యల చెరువులు, అనేక గ్రామాల్లో రొయ్యల సాగు ఉప్పు నీటిలోనే చేస్తుండడంతో కొల్లేరులోనే కాక ఈ ప్రాంత నేలలు ఉప్పు నీటి కయ్యలుగా మారాయి. గతంలో ఊట బావులు తీసినా, బోర్లు వేసినా 20 నుంచి 30 అడుగులు లోతులో తీపి నీరు వచ్చేది. ప్రస్తుతం భూగర్భ జలాలు ఉప్పుమయంగా మార డంతో 100 అడుగుల లోతు భూమి లోపలకి వెళ్లినా ఉప్పు నీరే వస్తోంది. ఆక్వాలో రొయ్యల సాగు కు ఉప్పు నీరు అనుకూలంగా ఉన్నప్ప టికీ చేపల పరిశ్రమకు తీరని దెబ్బ. ఉప్పు టేరు పరీవాహక ప్రాంత మైన కైకలూరు, కలిదిండి, కృష్ణా జిల్లా బంటుమిల్లి, కృత్తివెన్ను, పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళ, ఆకివీడు తది తర మండలాల్లో రెండు లక్షల ఎకరాలకుపైగా చేపల సాగు జరుగుతోంది. ఎగువ నుంచి నీరు కాల్వల ద్వారా అంద కపోతే ఉప్పుటేరు పరీవాహక ప్రాం తంలోని రైతులంతా ఈ ఏరులోని నీటినే చేపలకు నింపుకుంటుంటారు. ఏటా భారీగా వర్షాలు కురిస్తే ఉప్పుటేరులోకి జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే ఉప్పు నీరు చేరుతుంది. ఇలా చేరే నీటిలో మే నెల దాటే సరికి ఉప్పు సాంద్రత పది శాతం నమోదవుతోంది. దీంతో చేపల పరిశ్రమకు ఏ విధంగానూ ఈ నీరు ఉపయోగపడ డం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

పక్షులు, పశువులకు తాగు నీరు కరువు

కొల్లేరు ఉప్పు నీటి సరస్సుగా మారడంతో పక్షులకు, పశువులకు తాగేందుకు నీరు లేక ఇబ్బందులు పడుతున్నాయి. రైతులు తమ పశువులను కాపాడేందుకు దూర ప్రాంతాల నుంచి మంచినీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. దేశ విదేశాల నుంచి వచ్చే వలస పక్షులు సైతం ఈ ఉప్పునీరు వల్ల సరైన ఆహారం దొరక్క విలవిల లాడుతున్నాయి. సరస్సులోకి ఉప్పు నీరు రావడం వల్ల అనేక రకాల చేపలు కనుమరుగయ్యాయి. తెల్ల, నల్లజాతి చేపలు సైతం ఉప్పు నీటి దెబ్బకు అంతరిం చిపోతున్నాయి. ఉప్పుటేరుపై రెగ్యులేటర్‌ నిర్మాణం చేస్తే వేసవిలో ఉప్పు నీరు వచ్చే సమయంలో సరస్సులోకి చేరకుండా అడ్డుకునేందుకు అవకాశం ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు.

Read more!

Updated Date - Jun 09 , 2024 | 12:20 AM

Advertising
Advertising