ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అమ్మో.. ఆ నేతను భరించలేం

ABN, Publish Date - Mar 31 , 2024 | 12:03 AM

రాష్ట్రస్థాయిలో ప్రాతినిధ్యం వహించిన సదరు నేతకు కుడి భుజంగా వున్న ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. నియోజకవర్గంలో పార్టీ ఆర్థిక వ్యవహారాలను చూసిన ఆయనకు అభ్యర్థి నుంచి ఊహించని షాక్‌ తగిలింది.

వెళితే చేతి చమురు వదలడం ఖాయం

తీసుకున్నవే ఇవ్వలేదు.. మళ్లీ డబ్బులు కావాలట

ముఖం చాటేస్తున్న ముఖ్య నాయకులు..

ఎన్నికల వేళ అధికార పార్టీకి ఒక్కొక్కరు దూరం

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

రాష్ట్రస్థాయిలో ప్రాతినిధ్యం వహించిన సదరు నేతకు కుడి భుజంగా వున్న ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. నియోజకవర్గంలో పార్టీ ఆర్థిక వ్యవహారాలను చూసిన ఆయనకు అభ్యర్థి నుంచి ఊహించని షాక్‌ తగిలింది. ఒక సెటిల్‌మెంట్‌లో సమకూరిన రూ.4 కోట్లు తెచ్చి తనకు ఇవ్వాలంటూ హుకుం జారీచేశారు. అప్పటికే కొంత మొత్తం పార్టీ కార్యక్రమాలకు ఖర్చయ్యింది. ఇదే విషయంపై లెక్కలు చెబితే అధికార పార్టీ అభ్యర్థికి రుచించలేదు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య చెడింది. పార్టీలో అన్నీ తానై వ్యవహరించిన పారిశ్రామిక వేత్త, వైసీపీ నాయకుడు ఆ పార్టీకి రాజీనామా చేసి ఇటీవల బీజేపీలో చేరారు. రూరల్‌ మండలానికి చెందిన ఓ ప్రముఖ బిల్డర్‌ పార్టీకి దూరమయ్యారు. సదరు బిల్డర్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా భీమవరంలో వ్యాపారాలు నిర్వహించేవారు. వైసీపీ నేతల నుంచి ఆయనకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. వ్యాపారాల్లో నష్టం చవిచూశారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుతో ఏకాంతంగా భేటీ అయ్యారు. పారిశ్రామిక పట్టణానికి చెందిన నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానంటూ చెప్పుకొచ్చారు. పట్టణంలోనూ అన్నీ తానై వ్యవహరిస్తూ వచ్చిన మరో నాయకునికి అధికార పార్టీ అభ్యర్థి నుంచి పెద్ద మొత్తంలో సొమ్ములు రావాలి. బకాయి తీర్చడం లేదు. పైగా అభ్యర్థి అవినీతి దందా అధికమైంది. దీంతో పట్టణానికి చెందిన వైసీపీ నాయకుడు దూరంగా ఉంటున్నారు. జగన్‌ సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకుడే పార్టీకి దూరమయ్యా రంటే ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థమవుతోంది. ఇప్పటికీ అభ్యర్థి నుంచి పార్టీ నాయకులు, సానుభూతిపరులకు దాదాపు రూ.8 కోట్లు రావాల్సి ఉందం టూ నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. ఆ సొమ్ములు తిరిగి ఇవ్వకపోవడంతో ఇప్పుడంతా పార్టీకి దూరమయ్యారు. ఒకరిద్దరి నాయకులతోనే అభ్యర్థి ఇప్పుడు ప్రచారం చేస్తు న్నారు. గత ఎన్నికల్లో పార్టీ గెలుపులో కీలకంగా వ్యవహరిం చిన కీలక నాయకులంతా ఇప్పుడు కినుక వహిస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా కూటమికి చేయూతనిస్తున్నారు. అధికార పార్టీకి ఓటమి తప్పదన్న భావనతో మరి కొందరు బయటకు రావడం లేదు. ఈసారి అధికార పార్టీ నెగ్గితే పట్టణంలో నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బ తింటుందన్న ఆందోళన ఉంది. ఇది అధికార పార్టీ అభ్యర్థికి చుక్కలు చూపిస్తోంది. భవన నిర్మాణాల్లో కమీషన్‌లు తీసుకోవడం వంటి అవినీతి దందా తాజాగా అభ్యర్థిని వెంటాడుతోంది.

Updated Date - Mar 31 , 2024 | 12:03 AM

Advertising
Advertising