ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎల్‌ఐసీ ఏజెంట్ల సమస్యలన్నీ పరిష్కరించాలి

ABN, Publish Date - Oct 31 , 2024 | 12:33 AM

ఎల్‌ఐసీ యాజమాన్యంతో ఏజెంట్ల సమస్యలపై చర్చలు జరిపి కొన్ని సమస్యలు పరిష్కరించినప్పటికీ మిగిలిన అన్ని సమస్యలు పరిష్కరించాలని ఎల్‌ఐసీ ఏజెంట్ల సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు.

పాలకొల్లు ఎల్‌ఐసీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న ఏజెంట్లు

పాలకొల్లు, అక్టోబరు, 30 (ఆంధ్రజ్యోతి) : ఎల్‌ఐసీ యాజమాన్యంతో ఏజెంట్ల సమస్యలపై చర్చలు జరిపి కొన్ని సమస్యలు పరిష్కరించినప్పటికీ మిగిలిన అన్ని సమస్యలు పరిష్కరించాలని ఎల్‌ఐసీ ఏజెంట్ల సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక ఎల్‌ఐసీ బ్రాంచి కార్యాలయం వద్ద పాలకొల్లు, నరసాపురం ఏరియా ఏజెంట్ల ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో నాయకులు మాట్లాడారు. యాజమాన్యంతో ఏవోఐ నాయకులు జరిపిన చర్చల్లో అంగీకరించిన వాటితో పాటుగా మిగిలిన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పాలసీలపై జీఎస్‌టీ తీసి వేయాలని, ఏజెంట్ల కమీషన్‌ పూర్వం మాదిరిగానే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. పాలసీలపై జీఎస్‌టీ తీసి వేయాలని డిమాండ్‌చేస్తూ 2025 ఫిబ్రవరి 11న పార్లమెంట్‌ వద్ద మార్చ్‌ నిర్వహించాలని కేంద్ర సంఘం నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్రకమిటీ ప్రెసిడెంట్‌ తొట్టెంపూడి కోటేశ్వరరావు డిమాండ్‌ తెలిపారు. ఎండీఆర్‌టీ ఎజెంట్‌ ముత్యాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఏజెంట్లు అందరూ ఐక్యంగా ఉండి పోరాటం చేయాలని అన్నారు. ఏజెంట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తొట్టెంపూడి కోటేశ్వరరావు మాట్లాడుతూ పాలసీదారుల వయస్సును 55 నుంచి 50కి తగ్గించడం న్యాయం కాదని, 55 ఏళ్లకే కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక బ్రాంచ్‌ అధ్యక్షుడు కె.ఏలియా, యు.భాస్కర రావు, జి బాలాజీ, బి.రమేష్‌ కుమార్‌, వై.రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2024 | 12:36 AM